
నూతిమడుగులో టీడీపీ నాయకులు ప్రజలకు డబ్బులు ఇచ్చి నామినేషన్‌కు తరలిస్తున్న దృశ్యం
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.