Nomination process
-
PAC ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్
-
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ.. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు. దెందులూరు నియోజవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అబ్బాయి చౌదరి నర్సాపురం పట్టణం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ముదునూరి ప్రసాద్ రాజు ఆచంటలో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరం నియోజవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న శ్రీ గంది శ్రీనివాస్. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎలమంచిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యూవీ రమణ మూర్తి రాజు.. పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు... అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి.. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్. చీపురుపల్లి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగరి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ దాఖలు చేసిన వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్ కాకినాడ జిల్లా కాకినాడలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి లో టీడీపీ తరఫున జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయలు దేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మూడో దశకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 19 చివరి తేదీ. అలాగే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో వాయిదా పడిన ఎన్నికల కోసం విడిగా మరొక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉండగా ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా వేశారు. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు మరణిస్తే ఆ పార్టీ తాజా అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందు కోసం ఎన్నికలను వాయిదా వేస్తారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు. -
రేపటి నుంచి తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ
-
పంచాయతీ ఎన్నికలు: నామినేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. తొలిదశలో 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు కాగా,ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉ.6:30 నుంచి మ.3:30 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.. అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం ఇదిలా ఉంటే.. విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల తేదీలు మారాయి. దీని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తొలివిడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో.. రెండో విడతలో కొవ్వూరు, మూడో విడతలో జంగారెడ్డిగూడెం, నాలుగో విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే, విజయనగరం జిల్లా రెండో విడతలో పార్వతీపురం.. 3, 4 విడతల్లో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతాయి. ఇక ప్రకాశం జిల్లా తొలి విడతలో ఒంగోలు, రెండో విడతలో కందుకూరు, ఒంగోలు.. మూడో విడతలో కందుకూరు, నాలుగో విడతలో మార్కాపురం డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. -
పంచాయతీ ఎన్నికలు: నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలివిడతలో ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. పంచాయతీల వారీగా ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు శుక్రవారం ఉ.10.30కు నోటిఫికేషన్లు జారీచేస్తారు. ఇవి జారీచేసిన గ్రామ పంచాయతీలలో మూడ్రోజుల పాటు ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మూడు జిల్లాల ఎన్నికల్లో మార్పులు.. ఇదిలా ఉంటే.. విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల తేదీలు మారాయి. దీని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తొలివిడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో.. రెండో విడతలో కొవ్వూరు, మూడో విడతలో జంగారెడ్డిగూడెం, నాలుగో విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే, విజయనగరం జిల్లా రెండో విడతలో పార్వతీపురం.. 3, 4 విడతల్లో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతాయి. ఇక ప్రకాశం జిల్లా తొలి విడతలో ఒంగోలు, రెండో విడతలో కందుకూరు, ఒంగోలు.. మూడో విడతలో కందుకూరు, నాలుగో విడతలో మార్కాపురం డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. -
బిగ్‌బాస్: ఈ వారం ఎవరు మర్డర్ కానున్నారు?
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అప్పుడే మూడు వారాలు గడిచిపోయాయి. మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలవ్వగా ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెనుదిరిగారు. సోమవారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. అంటే మరో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆదివారం బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగిన ఎపిసోడ్లో లేడీ డైనమిక్ దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడంతో ఇంటి సభ్యుల్లో భయం పుచ్చుకుంది. ఈ వారం అందరూ ఆచూతూచి తమ గేమ్‌ను ఆడనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఇద్దరు హిట్ మెన్లు ఉంటారు. వారికి ఒక డెన్ ఉంటుంది. సమయానుసారం అయిదు బజర్లు మోగుతాయి. ప్రతి బజర్ మోగినప్పుడల్లా ఇంట్లోని సభ్యులో ఎవరు ముందుగా లాన్లోకి వస్తే వారు మాత్రమే హిట్ మెన్లతో చంపే ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. అయితే చనిపోయిన వ్యక్తి నామినేట్ అయినట్లు. ఇక ఇంటి సభ్యుల్లో సోహైల్, అఖిల్ హిట్మెన్లుగా వహరించనున్నారు. (దటీజ్ దేవి: మాస్టర్నే ఏడిపించేసింది) తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే సోమవారం రోజు జరగనున్న నామినేషన్ ప్రక్రియ జనాల్లో మరింత ఆసక్తిని పెంచేలా కన్పిస్తోంది. అమ్మ రాజశేఖర్ మాస్టర్, సుజాత, మొహబూబ్, అరియానా ఇంట్లో నుంచి మోదట బయటకు వచ్చినట్లు తెలుస్తుండటంతో వారంతా హిట్మెన్లతో చంపే డీల్ కుదుర్చుకున్నారు. వీరిలో సుజాత సాయి కుమార్‌ను మర్డర్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక అరియానా.. లాస్యతో చిరాకు పడుతూ బయటికి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్లో కుమార్ సాయి, అభిజిత్ మాత్రం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు అర్థమవుతోంది. అయితే ఈ వారం మరి ఎవరూ, అసలు ఎంత మంది నామినేట్ అవ్వబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. (అల్లరి నరేష్ హీరోయిన్ స్వాతి దీక్షిత్) Nomination process lo evarevaru murder avtharu?? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/I0xXT2Yitt — starmaa (@StarMaa) September 28, 2020 -
బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?
బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4.. ఆదివారంతో రెండు వారాలను పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్ కాస్తా కోపాలు, ఏడుపులు, సరదాలతో ముగియగా సోమవారం రావడంతో హౌజ్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే గత వారం నామినేషన్ చాలా సులువుగా త్యాగాలు చేస్తూ జరిగిందని నాగార్జున ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్ మిగతా వాటితో పోలిస్తే చాలా వేడిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎవరిని నామినేట్ చేయాలన్న విషయంలో కంటెస్టెంట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. (బిగ్‌బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!) ఈ వారం ఎవరిని నామినేషన్లో ఉంచాలో వారి ఫోటోలను మండుతున్న అగ్నిలో వేయాల్సి ఉంటుంది. అలాగే వారిని నామినేట్ చేయడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. కాగా ఈ నామినేషన్ ప్రక్రియపై శనివారం జరిగిన హీరో, జీరో టాస్క్ ఎఫెక్ట్ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు ఈ ఎపిసోడ్‌తో ఒక్కసారిగా శత్రువులుగా మారబోతున్నారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ సోహైల్ తన స్నేహితురాలు అరియానా గ్లోరీ ఫోటోను మంటల్లో వేయగా.. బదులుగా అరియానా.. సోహైల్ ఫోటోను మంటల్లో ఆహుతి చేసింది. (బిగ్‌బాస్: హారిక అవుట్! కానీ..) అలాగే సుజాత- అభిజిత్ ఫోటోను మంటల్లో వేసింది. అంతేగాక అభిజిత్ సుజాత ఫోటోను మంటల్లో వేశాడు. ఇలాగే మోనాల్- దివి, దివి-మోనాల్, దేత్తడి హారిక- మోహబూబా, మోహబూబా- హారిక, దేవి- అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఫోటోను మంటల్లో తగలబెట్టింది. ఇక పూర్తి నామినేషన్ ఎలా జరగబోతుంది. ఎవరూ ఈ వారం నామినేషన్లో ఉండబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ చూసే వరకు ఆగాల్సిందే. (దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య వార్నింగ్) Looks like this time nominations will be on fire 🔥 🔥 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/YIzqDmXemW — starmaa (@StarMaa) September 21, 2020 -
‘ఫారమ్ –ఎ లేకపోతే నామినేషన్ తిరస్కరించొద్దు’
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు ఫారమ్–ఎ సమర్పించకపోయినా, ఆ ఒక్క కారణంతో వారి నామినేషన్లను తిరస్కరించొద్దని రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లలో సిబ్బంది అభ్యర్థుల నుంచి ఫారమ్–ఎను ఆమోదించడం లేదని, ఆమోదించిన చోట్ల వాటి ప్రతులను తమ ధ్రువీకరణతో మున్సిపాలిటీల్లోని ఆర్వో లకు పంపలేదన్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. కొన్ని చోట్ల ఏ,బీ ఫారమ్స్ ఇవ్వాల్సిందిగా అధికారులు పట్టుబడుతున్నట్టు ఎస్ఈసీ దృష్టికొచ్చిందని, అది సరికాదని శుక్రవారం జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఎస్ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. -
వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీకి చుక్కెదురు
-
అధికార పార్టీకి షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కురుపాం నామినేషన్లను మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వి.విశ్వేశ్వరరావు పరిశీలించారు. టీడీపీ అభ్యర్థి థాట్రాజ్ ఎస్టీ (కొండదొర) కాదని, 2012లో హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చాయని, ఇప్పుడెలా పోటీకి అర్హుడవుతాడని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల వాదనలు, ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం జనార్దన్ థాట్రాజ్ ఎస్టీ కాదని ఇదివరకే కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన థాట్రాజ్ తల్లి నరిసింహ ప్రియ థాట్రాజ్ పోటీలో ఉంటారని తెలిపారు. నరసింహప్రియ థాట్రాజ్‌పైనా కుల వివాదం ఉన్నందున ఏం జరుగుతుందోనని టీడీపీ ఆందోళన పడుతోంది. సాలూరులోనూ టీడీపీ అభ్యర్థి ఆర్పి భంజ్‌దేవ్ ఎస్టీ కాదంటూ గతంలో కోర్టు తీర్పునివ్వడంతోపాటు అతని ఎన్నికను రద్దుచేసింది. మళ్లీ అతనికే టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. నర్సీపట్నం జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వేగి దివాకర్‌రావు అఫిడవిట్ అసంపూర్తిగా నింపారనే కారణంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆర్. గోవిందరావు తిరస్కరించారు. ఈ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపను పార్టీలోకి తీసుకొచ్చి టిక్కెట్ ఇవ్వాలని జనసేన నేతలు ప్రయత్నించారు. ముత్యాలపాప రానిపక్షంలో బయపురెడ్డి అశోక్‌కు టిక్కెట్ వస్తుందని ఆశించారు. అయితే చివరి నిమిషంలో పరవాడకు చెందిన దివాకర్‌రావుకు టిక్కెట్ లభించింది. నామినేషన్ల ఆఖరిరోజు దివాకర్‌రావు హడావుడిగా నామినేషన్లు వేశారు. అదికాస్తా తిరస్కరణకు గురైంది. పలు జిల్లాల్లో నామినేషన్ల తిరస్కరణ.. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు మంగళవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు. పలు జిల్లాల్లో పరిస్థితిదీ.. - అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 190 ఆమోదం పొందాయి. ధర్మవరం స్థానానికి 27 నామినేషన్లు రాగా వాటిలో 15 తిరస్కరణకు గురయ్యాయి. పుట్టపర్తిలో 7 నామినేషన్లను తిరస్కరించారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్ దాఖలు చేయగా 14 ఆమోదం పొందాయి. హిందూపురం పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలవగా.. 9 నామినేషన్లను ఆమోదించారు. - ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 17 నామినేషన్లు దాఖలవగా వాటిలో నాలుగింటిని తిరస్కరించారు. బాపట్ల పార్లమెంట్‌కు 16 నామినేషన్లు దాఖలవగా రెండింటిని తిరస్కరించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 237 నామినేషన్లు దాఖలవగా.. 65 నామినేషన్లను తిరస్కరించారు. - విజయనగరం పార్లమెంటు స్థానంతోపాటు జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు 132 నామినేషన్లు దాఖలవగా.. 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. - వైఎస్సార్ జిల్లాలో కడప లోక్‌సభ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో పదిహేడింటిని ఆమోదించగా, ఏడు తిరస్కరణకు గురయ్యాయి. రాజంపేట లోక్‌సభ స్థానానికి 12 నామినేషన్లు ఆమోదం పొందగా.. ఎనిమిదింటిని తిరస్కరించారు. పది అసెంబ్లీ స్థానాలకు 161 నామినేషన్లు ఆమోదం పొందగా.. 54 తిరస్కరణకు గురయ్యాయి. - గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విషయాన్ని స్థానిక అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు న్యాయవాది బాలసత్యనారాయణరెడ్డి తెలిపారు. - కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. పెనమలూరులో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల వివరాల విషయంలో న్యాయపరమైన అభ్యంతరాలు రావటంతో వాటిని పరిశీలించాల్సి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. -
బుజ్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి
సాక్షి, ఏలూరు : ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ కార్యక్రమానికి రండి రూ.1000 పట్టుకెళ్లండి అంటూ కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ పిలుస్తున్నారు, వెళ్లకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందకుండా చేస్తారేమోనని వెళ్తున్న మహిళలకు కార్పొరేటర్లు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. బుజ్జి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వస్తే కార్పొరేటర్లు రూ.500, బుజ్జి మరో రూ.500 ఇస్తారని చెబుతున్నారు. అలాగే బుజ్జిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం నుంచి వివిధ విధాలుగా అందిన రుణాలు, రుణమాఫీ వంటివన్నీ బుజ్జి చలువే అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బుజ్జికి ఓటు వేసేందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారని(ఎంత ఇస్తారో ప్రకటించడం లేదు) చెబుతున్నారు. బుజ్జి అత్యధిక మెజార్టీతో గెలిస్తే ప్రతి డ్వాక్రా మహిళకూ ఖరీదైన చీర బహూకరిస్తారని ప్రలోభ పెట్టారని ఈయా సమావేశాలకు హాజరైన మహిళల్లో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. -
మామా... ఏక్ పెగ్ లా!
సాక్షి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పట్టణంలో వైన్‌షాపులు కిటకిటలాడాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా టీడీపీ కార్యకర్తలే కనిపించారు. ఆర్అండ్బీ గెస్హౌస్ట్, మేళాపురం క్రాస్ బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో దర్జాగా కనిపించారు. ఆ మత్తులోనే వాహనాల్లో తిరుగుతూ పట్టణప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!. నీవే ఆదర్శం: బాలయ్య కటౌట్ ముందు.. టీడీపీ బార్: వైన్‌షాప్ ముందు తమ్ముళ్ల వాహనాలు -
బాలకృష్ణ నామినేషన్‌కు వస్తే రూ.400 ఇస్తాం..!
సాక్షి, చిలమత్తూరు: టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నేడు(శుక్రవారం) నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు అవసరమైన జనసమీకరణ కోసం మండలంలోని నాయకులు తలమునకలవుతూ నానా తంటాలు పడుతున్నట్లు స్థానికులు చర్చించుకోవడం విశేషం. నామినేషన్‌కు ప్రజలను తరలించడం కోసం ఒక్కొక్కరికి రూ.400 వరకు ఇస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకులు ప్రజలను తరలించేందుకు పలు గ్రామాల్లో తిరగినట్లు ప్రజలు చెబుతున్నారు. జనం వచ్చేలా చూడాలని నియోజకవర్గపు నాయకులు స్థానిక మండల నాయకులకు పనులు అప్పగించిన్నట్లు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం చిలమత్తూరులో నరసింహ స్వామి రథోత్సవంలో కూడా బాలయ్యను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. జనసమీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించమని ఎమ్మెల్యే... నాయకులకు హుకుం జారీ చేసిన్నట్లు సొంత పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. -
నేడు గాజువాకలో పవన్ నామినేషన్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ గురువారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాత గాజువాకలోని అనకాపల్లి బస్టాండ్ సెంటర్లో పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా, నంద్యాల లోక్ సభ సభ్యులు ఎస్పీవై రెడ్డి బుధవారం రాత్రి విజయవాడలో పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. -
‘గెలిపించండి.. మీ రుణం తీర్చుకుంటా’
సాక్షి, జగ్గంపేట: ‘‘ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేటలో మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రావులమ్మతల్లి గుడి వద్ద భార్య వేణితో కలిసి పూజలు అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాదయాత్రకు వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి చంటిబాబు మాట్లాడారు. ‘‘రెండు సార్లు పోటీ చేశాను.. మరోసారి మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి’’ అని కోరారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. చంటిబాబుతో పాటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిని వంగా గీతా పాల్గొని ప్రసంగించారు. అత్తులూరి నాగబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురామ్, బుర్రి చక్రబాబు, వరుపుల రంగనాయకులు, మండపాక చిన్న, రాయి సాయి, పెద్దాడ రాజబాబు, రావుల రాజా, ఎంపీటీసీ అబ్బు, బూసాల బాబూరావు, సర్వసిద్ధి లక్ష్మణ్, ఇళ్ల అప్పారావు, తులా రాము, చిట్టిమాని సత్యనారాయణ, గండపల్లి మండలానికి చెందిన చలగళ్ల దొరబాబు, ఒబిణ్ణి సత్యనారాయణ, రామకృష్ణ, ఉప్పలపాటి సాయి, అడబాల ఆంజనేయులు, రామకుర్తి మూర్తి, పరిమి వెంకటేశ్వరరావు, పాపారావు చౌదరి, గోకవరం మండలానికి చెందిన సుంకర రమణ, సూరారెడ్డి, వరసాల ప్రసాద్, జనపరెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, సతీష్, రఫీ, అల్లు విజయ్‌కుమార్, తోట రవి, అయ్యన్న, పలికల గంగరాజు, చదలాడ బాబీ, దోమాల గంగాధర్, సూది శ్రీను, పాఠంశెట్టి విశ్వనాథం, గోపి, పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలివెళ్లిన కార్యకర్తలు కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీగా జగ్గంపేట వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబును అఖండ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. కిర్లంపూడి, ముక్కొలు, గోనేడ, బూరుగుపూడి, గెద్దనాపల్లి, సింహాద్రిపురం, వీరవరం, తామరాడ, తదితర గ్రామాల నుంచి తరలివెళ్లి జ్యోతుల నామినేషన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో చదలవాడ బాబి, అల్లు విజయకుమార్, విశ్వనాథం చక్రరరావు, దోమాల గంగాధర్, వెంకటజాన్బాబు, పెనగంటి రాజేష్, ఎం రాంబాబు, వి.సాంబశివ, డి అప్పలరాజు, ఎస్.శివకుమార్, ఎ.గంగబాబు, బి వెంకటరమణ, పి శ్రీను, వై పాము, మల్లేష్, పి రాజుగోపాల్, సూరిబాబు, గోపి, తదితరులు పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలిన జనసందోహం గండేపల్లి: జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడంతో గండేపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలపై భారీగా జగ్గంపేట చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారి జనసందోహంగా మారింది. -
రండి బాబూ... రండి!
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఫిర్యాదులు.. చర్యలు తీసుకుంటాం’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18నుంచి 25 వరకు కొనసాగుతుందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం శాంతి భద్రతలపై దృష్టిసారించామన్నారు. రాయలసీమలో పలు సంఘటనలు జరిగాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు ప్రతిరోజు శాంతి భద్రతలపై నివేదికలు పంపుతున్నారని వెల్లడించారు. రెండుమూడు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ ఇచ్చి..బ్యాలెట్ పేపర్లు అందజేస్తామన్నారు. -
ఢిల్లీకి బీజేపీ చిట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం.. కరీంనగర్ జిల్లాలోని రెండుస్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపించింది. కరీంనగర్, పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కేవలం కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంజయ్ నియోజకవర్గం నుంచి 66వేల ఓట్లు సాధించారు. ఆయన మినహా కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, పుల్వామా దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపికి ఓట్లు రాలుస్తాయని ఆ పార్టీ నాయకులతోపాటు దిగువ శ్రేణి యంత్రాంగం కూడా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి స్థానాల నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేతలతోపాటు అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం కోర్‌కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న ముగ్గురేసి నేతల పేర్లను ఢిల్లీకి పంపించింది. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించనుంది. కరీంనగర్లో బండి సంజయ్‌కు శ్రేణుల అండ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ముచ్చెమటలు పోయించారు. ఒక దశలో గెలుపు ఇద్దరి మధ్య దోబూచులాడినంత పనిచేసింది. హిందుత్వ నినాదంతో కరీంనగర్ నగరంలో తనకంటూ ప్రత్యేక ఇమేజీ సంపాదించుకున్న సంజయ్‌కు వ్యతిరేకంగా ఒకవర్గం ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్కు పోలవడంతో ఓటమి పాలయినట్లు ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్కన్నా సంజయ్‌కే అత్యధిక ఓట్లు పోలవడంతో పార్టీ దిగువ శ్రేణుల్లో ఆయనకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి సంజయ్ పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన నాయకులు కూడా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత చొప్పదండి, సిరిసిల్ల, హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ముఖం చాటేయడంతో పార్టీకి నాయకులు లేకుండాపోయారు. సంజయ్‌కు ఆదరణ పెరగడం పార్టీలోని ‘పెద్ద’ నాయకులకు నచ్చడం లేదనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి సంజయ్‌కు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పెద్దల సాయంతో ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీకి సంజయ్, గుజ్జుల, ప్రదీప్‌కుమార్ పేర్లు పార్టీ రాష్ట్ర కమిటీ బుధవారం ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న ముగ్గురేసి నాయకుల పేర్లను కేంద్ర పార్టీకి పంపించింది. కరీంనగర్లో సంజయ్‌తోపాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన ప్రదీప్‌రావును ఆశావహులుగా పేర్కొంటూ కేంద్ర పార్టీకి సిఫారసు చేశారు. గుజ్జుల, ప్రదీప్‌రావు ఇద్దరూ పెద్దపల్లి అసెంబ్లీకి చెందిన వారే కావడం గమనార్హం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లిలో పోటీ చేసిన గుజ్జుల రామకృష్ణారెడ్డి కేవలం 9,375 ఓట్లు సాధించారు. ప్రదీప్‌రావుకు ఢిల్లీస్థాయిలో పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ మాత్రం తనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు. పెద్దపల్లి నుంచి సైతం ముగ్గురి పేర్లు... పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కూడా ముగ్గురు నాయకుల బయోడేటాలను పార్టీ రాష్ట్ర కమిటీ ఢిల్లీకి పంపించింది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించారు. ఈ నియోజకవర్గంలో ఎస్.కుమార్ వైపే పార్టీ మొగ్గు చూపనున్నట్లు సమాచారం. సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో భాగంగా పెద్దపల్లి నుంచి మాల వర్గానికి సీటు కేటాయించాలని భావిస్తే తనకు అవకాశం లభిస్తుందని బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ భావిస్తున్నారు. నేడోరేపో ప్రకటన... పార్లమెంట్ ఎన్నికలకు ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించనుండడంతో బీజేపీ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండురోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే ఢిల్లీ నాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నాయకులు ఎవరి పేరు సూచిస్తే వారికి అవకాశం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తొలి పరీక్షపై ఉత్కంఠ
పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలోకి దిగుతు న్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించడంతో, వారికి పంచాయతీ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన కాంగ్రెస్ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా తన ప్రతాపం చూపించాలని తహతహలాడుతోంది. మూడు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా గ్రామాల్లో సర్పంచ్ల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేటితో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఎవరు బరిలో ఉంటారో.. ఎవరు వెనక్కి తగ్గుతారోననే సందేహాలు వ్యకమ్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పోటీలో ఉంటామని ప్రజల మద్దతు కూడగట్టిన నాయకులు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గుతూ... కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలంటే డబ్బుతో ముడిపడి ఉండడంతో ఓటర్ల సంఖ్యను బట్టి ఎన్ని లక్షలు ఖర్చుపెడితే గెలుస్తామా అని బేరీజు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన తొలి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలుస్తుండడంతో పార్టీల మధ్యనే పోరు కనబడుతోంది. స్థానిక సంస్థల్లో పోటీ అంటే గతంలో అభ్యర్థిని చూసి ఓటు వేసే పద్ధతి కనబడేది. కానీ ఆ పద్ధతి రానురాను కనుమరుగవుతోంది. పనిచేసేవాడైనా.. చేయనివాడైనా... ఖర్చు పెడితేనే మద్దతు తెలుపుతామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించడంతో, వారికి పంచాయతీ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ సైతం పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన కాంగ్రెస్ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా తన ప్రతాపం చూపించాలని తహతహలాడుతోంది. మూడు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాలే... శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి. రాష్ట్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలువాలంటే ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించాలని, తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సర్పంచ్‌లను గెలుపించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల హడావుడి నుంచి ఇంకా తేరుకోకముందే వచ్చిన పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు గ్రేడింగ్‌గా పరిగణించే అవకాశాలు ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే చావో రేవో అన్నట్లు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్పంచ్ల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు తమ భుజాలపైకి ఎత్తుకొని బలం నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి తీవ్ర పోటీ నెలకొంటుండడంతో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది సంకటంగా మారింది. తాము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తమ గెలుపు కోసం పనిచేసిన వారందరూ సర్పంచ్‌లుగా అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇటు ఇంటి పోరును అటు ఎన్నికల పోరును అధిగమించి సర్పంచ్‌లను గెలిపించుకుంటేనే అధిష్టానం వద్ద తమకు ప్రతిష్టపెరిగి పదవులు దక్కుతాయనే ఆశతో ఎమ్మెల్యేలు కదనరంగంలో ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నేతలపై అసెంబ్లీ ఓటమి ఎఫెక్ట్... అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యంతో 13 స్థానాల నుంచి పోరాడి ఓడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్నారు. ఊహించని విధంగా ఘోర పరాజయం అనంతరం పంచాయతీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ నేతల్లో కొంత నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీకి వచ్చి ఓట్లు ఎన్ని... ఇప్పుడు పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే అంశం ఆ పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఫలితాలు రివర్స్ కావడంతో పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అయితే ఈ పరిస్థితులను అధిగమించి ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను బరిలో నిలుపుతూ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ గెలుపు గుర్రాల వేటలో ముందుకు కదులుతున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మూడు రోజుల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశం కూడా నిర్వహించి ‘పంచాయతీ’పై చర్చించారు. ఉనికి కోసం తపిస్తున్న బీజేపీ ఇతర పార్టీలు... శాసనసభ పోరులో బోల్తాపడిన బీజేపీ పంచాయతీలోనైనా కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లను గెలిపించుకొని ఉనికి కాపాడుకోవాలని భావి స్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు పదకొండు చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. కరీంనగర్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు. దీంతో కమలనాథులు వెనుకడుగు వేయకుండా సర్పంచ్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కొందరు అభ్యర్థులు కోరుతుండడంతో ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఎక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలపై దృష్టి పెట్టి అక్కడి క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీకి పోటీచేసిన వారు పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటేనే పరువు కాపాడుకునే పరిస్థితి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని టీఆర్ఎస్ భావిస్తుండడంతో బీజేపీతో పాటు ఇతర పార్టీలు సైతం ఇరకాటంలో పడుతున్నాయి. -
ఇదేనా గుర్తింపు ?!
మహబూబ్‌నగర్ రూరల్ : శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా తయారీ, అనర్హుల ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు లాంటి కీలక పనులు చేసిన బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ) శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. బీఎల్ఓలుగా వి«ధులు నిర్వర్తించిన అంగన్వాడీ టీచర్లకు మూడేళ్లకు సంబంధించి గౌరవ వేతనం అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో విధులు నిర్వహించిన బీఎల్ఓలకు నెలకు రూ.500 చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూడేళ్లుగా ఓటరు జాబితా ప్రక్రియలో భాగస్వామ్యమై రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన అంగన్వాడీ టీచర్లకు నిబంధనల ప్రకారం రావాల్సిన గౌరవ వేతనం చెల్లించకపోవడంతో వారు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. మూడేళ్ల నుంచి రూపాయి రాలే... గడిచిన 2016, 2017తో పాటు 2018లో ఓటర్ల జాబితా తయారీ, స్పెషల్ సమ్మరీ రివిజన్, అనర్హుల ఓట్ల తొలగింపు వంటి పనులు చేసేందుకు బీఎల్ఓలుగా అంగన్వాడీ టీచర్లను వినియోగించుకున్నారు. జిల్లాలో 360 మంది సేవలు ఉపయోగించుకోగా.. ఒక్క మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోనే 263 మంది ఉన్నారు. వీరందరికీ ఏడాదికి కనీస గౌరవ వేతనం రూ.7వేల చొప్పున మూడేళ్లకు గాను రూ.21వేలు రావాల్సి ఉంది. ఇలా ఒక్కొక్కరికి రూ. 21వేల చొప్పున బకాయి ఉండగా జిల్లా మొత్తంలో 360 మందికి రూ.75.60లక్షలు అందాల్సి ఉంది. ఇన్నేళ్లుగా పెంచింగ్‌లో ఉన్న గౌరవ వేతనాన్ని చెల్లించకపోగా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరి సేవలు వినియోగించుకున్నారు. ఇక తాజా గ్రామపంచాయతీ ఎన్నికల విధులు కూడా నిర్వర్తించాలని సూచించగా.. మూడేళ్ల నుంచి గౌరవం వేతనం ఇవ్వకపోవడంతో పలువురు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలను బీఎల్ఓలు సంప్రదించగా ప్రభుత్వం ని«ధులు విడుదలైన వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారని వాపోతున్నారు. అసలే అంతంత.. అంగన్వాడీ టీచర్లకు అంతంత మాత్రంగానే వేతనాలు అందుతున్నాయి. అటు కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించే కేంద్రాల నిర్వహణలో నిమగ్నమయ్యే వీరికి తరచూ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇందులో బూత్ లెవల్ అధికారుల విధులు ఒకటి. ఈ మేరకు కేంద్రాల నిర్వహణను ఆయాలకు అప్పగించినా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూస్తూనే ఇటు ఇతర విధుల్లో పాల్గొంటున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తామన్న కనీస గౌరవ వేతనాన్ని ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెండింగ్ బిల్లుల విషయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నా ఇంత వరకు వేతనాలు అందలేదు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున ఈ బాధ్యతలను కూడా వారికే అప్పగిస్తుండగా.. తొలుత పెండింగ్ వేతనాలు చెల్లించాకే విధుల్లో చేరుతామని పలువురు బీఎల్ఓలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల బడ్జెట్‌పై అనుమానాలు 2018 శాసనసభ ఎన్నికలకు సంబం«ధించి విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సంబంధించి విడుదలైన బడ్జెట్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్ఓలుగా విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు మూడేళ్లుగా బకాయి ఉన్న గౌరవ వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం మూడు నెలల బకాయిలు చెల్లిస్తామని అధికారులు చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి ఎన్నికల్లో పని చేసిన సిబ్బందికి వచ్చిన బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంతనే వివరాలు అధికారులకు తెలియాలి. కానీ అలా చెప్పకుండా కేవలం మూడు నెలల వేతనాలను బీఎల్ఓలకు చెల్లిస్తామని చెబుతుండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల బకాయిలు చెల్లిస్తాం శాసనసభ ఎన్నికల్లో భాగంగా బీఎల్ఓలుగా విధులు నిర్వర్తించిన అంగన్వాడీ టీచర్లకు మూడు నెలల పెండింగ్ బకాయిలను చెల్లిస్తాం. బీఎల్ఓలు గత మూడేళ్లుగా విధులు నిర్వహించిన బకాయిలు అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. కేవలం మూడు నెలల గౌరవ వేతనం చెల్లించడం వరకే మా పరిధిలో ఉంటుంది. – వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్‌నగర్ అర్బన్ -
రూల్స్ కంపల్సరీ
సాక్షి,ఖమ్మం: శాసనసభ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషను దాఖలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన నియమావళి ఈ విధంగా ఉంది శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం–2బీ ఉచితంగా సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇస్తారు. ఒక్క అభ్యర్థి 4 నామినేషన్లు వేయవచ్చు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే కార్యాలయంలోనికి అనుమతిస్తారు. రెండు ఫొటోలు: ఒకటి స్టాంప్‌సైజ్ నామినేషన్ పేపరుపై, ఒకటి పాస్పోర్ట్సైజ్ ఫారం–26 (అఫిడవిట్)పై అంటించేందుకు. డిపాజిట్: రూ.10,000. షెడ్యూలు కులము, షెడ్యూలు తెగలకు సంబంధించిన వారికి రూ.5 వేలు. షెడ్యూలు కులము/తెగల వారు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గములోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చును. (2బి లోని పార్ట్–1) పోటీ చేసేందుకు నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిష్టర్డ్ రాజకీయ పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గంలోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించాలి. (2బి లోని పార్ట్–2) ఇతరులు అనగా రిజిస్టర్/గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని (ఫారం–2బి పార్ట్–3 లోని (సి) కాలం ఎదురుగా కేటాయించాల్సిన గుర్తులను (ఈసీఐ పంపిన ఫ్రీ సింబల్స్ నుంచి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాలి. పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గం ఓటరు కాకపోతే.. అతడు ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకువచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి. ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులు అయి నామినేషన్ పేపర్లో వేలిముద్ర వేస్తే తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయవలసి ఉంటుంది. ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు (48) గంటల ముందు తన పేర కొత్త బ్యాంక్ అకౌంట్ ప్రత్యేకంగా తెరవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తెరిచిన బ్యాంక్ అకౌంట్లు అనుమతించబడవు. నామినేషన్ పత్రములోని ప్రతీ కాలమ్ తప్పనిసరిగా నింపాలి. ఆ కాలమ్‌లో నింపవలసినది లేనట్లైతే లేదు, వర్తించదు అని రాయాలి. అంతేకాని డ్యాష్ (–) వంటివి రాయకూడదు. ఏ కామ్ కూడా ఖాళీగా వదిలి వేయరాదు. గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి రిజిస్టర్డ్/గుర్తింపు పొందని రాజకీయ పార్టీలవారు ఫారం–ఎ, బి ఇంకుసైన్ చేయబడినది తేది:19–11–2018 మధ్యాహ్నం 3 గంటలోపు (నామినేషన్ వేసే చివరి రోజు) రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపైగల క్రిమినల్ కేసు వివరములను పార్ట్–3ఎలో తప్పనిసరిగా పేర్కొనాలి. ఎన్పిడిసిఎల్ నుండి విద్యుత్‌కు సంబంధించి, మున్సిపాలిటి/గ్రామ పంచాయతీ నుండి నీటికి సంబంధించి, ప్రభుత్వము కేటాయించిన వసతి గృహము (క్వార్టర్)లో ఉన్నట్లైతే గత (10) సంవత్సరముల నుండి ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రములు సమర్పించాలి. నామినేషన్ వేసే సమయంలోనే రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ/శపథం (తెలుగు/ఆంగ్లం) చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ తనకు నచ్చిన దేవుని పేరుమీదగాని, మనస్సాక్షి మీదగాని చేయవచ్చును. రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నమూనా సంతకం ఇవ్వాలి. (ఇది మీ తరపున ఎవరినైనా అనుమతించేందుకు ఉపకరిస్తుంది). అదే విధంగా తెలుగులో మీ పేరు బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ముద్రించవలెనో కూడా పేపర్ మీద రాసి ఇవ్వాలి. ఈ దిగువ తెలిపిన ప్రతులు/ధ్రువీకరణలు రిటర్నింగ్ అధికారి నుంచి పొందాలి చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రశీదు. స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు. ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టరు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, తదితరాలు ముద్రించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126–ఎ కింద సూచనలు. ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం. నామినేషన్ పత్రాల్లోని లోపాలు/ఇంకనూ జతపరచాల్సిన పత్రాల సూచిక (చెక్ మెనూ)