ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ..
- హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు. - దెందులూరు నియోజవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అబ్బాయి చౌదరి
- నర్సాపురం పట్టణం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ముదునూరి ప్రసాద్ రాజు
- ఆచంటలో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
- భీమవరం నియోజవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న శ్రీ గంది శ్రీనివాస్.
- కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
- ఎలమంచిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యూవీ రమణ మూర్తి రాజు.. పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు... అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి.. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్.
- చీపురుపల్లి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
- నగరి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ చేశారు.
- కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ దాఖలు చేసిన వైస్సార్‌సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు.
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్
- కాకినాడ జిల్లా కాకినాడలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు
- కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు
- అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి లో టీడీపీ తరఫున జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు.
- పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
- కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభిమానులు చేరుకున్నారు.
- తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయలు దేరారు.
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు.
- తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment