‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై ఫిర్యాదులు.. చర్యలు తీసుకుంటాం’ | AP Elections 2019 Nomination Process Starts From Monday | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

Published Sun, Mar 17 2019 7:31 PM | Last Updated on Sun, Mar 17 2019 7:43 PM

AP Elections 2019 Nomination Process Starts From Monday - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18నుంచి 25 వరకు కొనసాగుతుందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య అనంత‌రం శాంతి భ‌ద్ర‌త‌ల‌పై దృష్టిసారించామన్నారు. రాయలసీమలో ప‌లు సంఘ‌ట‌న‌లు జ‌రిగాయని తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, డీజీపీలు ప్ర‌తిరోజు శాంతి భ‌ద్ర‌త‌ల‌పై నివేదిక‌లు పంపుతున్నారని వెల్లడించారు.

రెండుమూడు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌పై శిక్షణ ఇచ్చి..బ్యాలెట్‌ పేపర్లు అందజేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement