న్యూఢిల్లీ: దేశంలో వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి కేంద్రప్రభుత్వం ప్రదానం చేసే ‘పద్మ’ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15ను నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, వాణిజ్యం, వ్యాపార రంగాల అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేసిన వారికి పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. www.padmaawards.gov.in. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు, రికమండ్ చేసేందుకు దేశంలోని పౌరులంతా అర్హులే. వెబ్‌సైట్‌లో తెలిపిన పద్ధతిలో సంబంధిత పత్రాలు, వివరాలతో దరఖాస్తులు పంపాలి. ఆ రంగంలో తాము చేసిన కృషిని 800 పదాలకు మించకుండా సవివరంగా రాసి పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment