ఇళయరాజాకు పద‍్మవిభూషణ్.. ధోనికి పద్మభూషణ్ | Government announces recipients of 2018 Padma awards | Sakshi
Sakshi News home page

'పద్మ' అవార్డుల గ్రహీతలు వీరే!

Published Thu, Jan 25 2018 8:20 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Government announces recipients of 2018 Padma awards - Sakshi

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు(గురువారం)ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిలో 73 మందికి పద్మశ్రీ, పద‍్మభూషణ్ 9 మందికి, ముగ్గురికి పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది. 2018 ఏడాదిలోఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం మొత్తం 15700 మంది ప్రముఖులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

పద్మవిభూషణ్ గ్రహీతలు

  • ఇళయరాజా (తమిళనాడు)- సంగీతం, కళలు
  • గులామ్ ముస్తఫా ఖాన్ (మహారాష్ట్ర)- సంగీతం, కళలు
  • పరమేశ్వరన్ పరమేశ్వరన్ (కేరళ)- సాహిత్యం, విద్య

పద్మభూషణ్ గ్రహీతలు వీరే

  • పంకజ్ అద్వానీ (కర్ణాటక)- క్రీడలు
  • ఫిలిపోస్ మార్ క్రిసోస్టామ్ (కేరళ)- ఆధ్యాత్మికం
  • మహేంద్ర సింగ్ ధోనీ (జార్ఖండ్)- క్రీడలు, క్రికెట్
  • అలెగ్జాండర్ కడకిన్ (రష్యా)- ప్రజా వ్యవహరాలు
  • రామచంద్రన్ నాగస్వామి (తమిళనాడు)- పురావస్తుశాఖ
  • వేద ప్రకాశ్ నంద (అమెరికా)- సాహిత్యం, విద్య
  • లక్ష్మణ్ పయ్ (గోవా)- కళలు, చిత్రలేఖనం
  • అరవింద్ పారిఖ్ (మహారాష్ట్ర)- కళలు-సంగీతం
  • శారదా సిన్హా (బిహార్)- కళలు-సంగీతం

విభాగాలు    -       పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

  • సాహిత్యం, విద్య విభాగం- అరవింద్‌ గుప్తా (మహారాష్ట్ర)
  • మెడిసిన్- లక్ష్మీకుట్టి (కేరళ), రాణి అండ్ అభయ్ బ్యాంగ్
  • మెడిసిన్- సులగాటి నరసమ్మ (కర్ణాటక), యేషి ధోడెన్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)
  • కళారంగం- భజ్జు శ్యామ్‌ (మధ్యప్రదేశ్‌)సేవారంగం- సుధాన్షు బిశ్వాస్‌ (పశ్చిమ బెంగాల్)
  • క్రీడలు- కిదాంబి శ్రీకాంత్(ఆంధ్రప్రదేశ్- బ్యాడ్మింటన్)
  • క్రీడలు- మురళీకాంత్‌ పటేకర్‌ (మహారాష్ట్ర)
  • సైన్స్ అండ్ ఇన్నోవేషన్- రాజగోపాలన్‌ వాసుదేవన్‌ (తమిళనాడు)
  • సామాజిక సేవలు- సుహాసిని మిస్త్రీ (పశ్చిమ బెంగాల్‌), లెంటిన ఠక్కర్, సంపత్ రాంటెకే
  • సాహిత్యం, విద్య- విజయలక్ష్మీ నవంతక్రిష్ణణ్
  • వన్యమృగ సంరక్షణ- రోములస్ విటకీర్
  • పల్లియేటివ్ కేర్- ఎం.ఆర్‌ రాజగోపాల్‌ మాడిసన్
  • ఆప్తమాలజీ- సందుక్ రౌట్ లకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement