అత్యున్నత పౌర పురస్కారాలు.. కోహ్లీకి పద్మశ్రీ
న్యూఢిల్లీ: ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. ఈమేరకు బుధవారం పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఒలింపిక్ పతక విజేత సాక్షిమాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, అథ్లెట్ వికాస్ గౌడ్ తదితరులకు నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ దక్కింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం ఇంకాసేపట్లో అందిస్తాం..