సాక్షి, హైదరాబాద్: అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు ఫారమ్–ఎ సమర్పించకపోయినా, ఆ ఒక్క కారణంతో వారి నామినేషన్లను తిరస్కరించొద్దని రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లలో సిబ్బంది అభ్యర్థుల నుంచి ఫారమ్–ఎను ఆమోదించడం లేదని, ఆమోదించిన చోట్ల వాటి ప్రతులను తమ ధ్రువీకరణతో మున్సిపాలిటీల్లోని ఆర్వో లకు పంపలేదన్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. కొన్ని చోట్ల ఏ,బీ ఫారమ్స్ ఇవ్వాల్సిందిగా అధికారులు పట్టుబడుతున్నట్టు ఎస్‌ఈసీ దృష్టికొచ్చిందని, అది సరికాదని శుక్రవారం జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment