
బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో అప్పుడే మూడు వారాలు గడిచిపోయాయి. మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలవ్వగా ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెనుదిరిగారు. సోమవారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. అంటే మరో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆదివారం బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగిన ఎపిసోడ్‌లో లేడీ డైనమిక్ దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడంతో ఇంటి సభ్యుల్లో భయం పుచ్చుకుంది. ఈ వారం అందరూ ఆచూతూచి తమ గేమ్‌ను ఆడనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఇద్దరు హిట్ మెన్‌లు ఉంటారు. వారికి ఒక డెన్ ఉంటుంది. సమయానుసారం అయిదు బజర్లు మోగుతాయి. ప్రతి బజర్ మోగినప్పుడల్లా ఇంట్లోని సభ్యులో ఎవరు ముందుగా లాన్‌లోకి వస్తే వారు మాత్రమే హిట్ మెన్‌లతో చంపే ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. అయితే చనిపోయిన వ్యక్తి నామినేట్ అయినట్లు. ఇక ఇంటి సభ్యుల్లో సోహైల్, అఖిల్ హిట్‌మెన్‌లుగా వహరించనున్నారు. (దటీజ్ దేవి: మాస్టర్‌నే ఏడిపించేసింది)
తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే సోమవారం రోజు జరగనున్న నామినేషన్ ప్రక్రియ జనాల్లో మరింత ఆసక్తిని పెంచేలా కన్పిస్తోంది. అమ్మ రాజశేఖర్ మాస్టర్, సుజాత, మొహబూబ్, అరియానా ఇంట్లో నుంచి మోదట బయటకు వచ్చినట్లు తెలుస్తుండటంతో వారంతా హిట్‌మెన్‌లతో చంపే డీల్ కుదుర్చుకున్నారు. వీరిలో సుజాత సాయి కుమార్‌ను మర్డర్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక అరియానా.. లాస్యతో చిరాకు పడుతూ బయటికి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్‌లో కుమార్ సాయి, అభిజిత్ మాత్రం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు అర్థమవుతోంది. అయితే ఈ వారం మరి ఎవరూ, అసలు ఎంత మంది నామినేట్ అవ్వబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. (అల్లరి నరేష్ హీరోయిన్ స్వాతి దీక్షిత్)
Nomination process lo evarevaru murder avtharu?? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/I0xXT2Yitt
— starmaa (@StarMaa) September 28, 2020