Bigg Boss Fame Akhil Sarthak Costly Car Gift To His Father, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Akhil Sarthak: నా నుంచి చిన్న గిఫ్ట్‌ పప్పా, నచ్చిందనే అనుకుంటున్నా: అఖిల్‌

Published Wed, Nov 10 2021 4:35 PM | Last Updated on Fri, Nov 12 2021 12:12 AM

Bigg Boss Akhil Sarthak Costly Car Gift To His Father, Pics Goes Viral - Sakshi

అఖిల్‌ సార్థక్‌.. బిగ్‌బాస్‌ షోతో ఎనలేని క్రేజ్‌ సొంతం చేసుకున్నాడీ యంగ్‌ యాక్టర్‌. మోనాల్‌తో లవ్‌ ట్రాక్‌, సోహైల్‌తో ఫ్రెండ్‌షిప్‌, ఒంటరిగా గేమ్స్‌ రఫ్ఫాడించగల సత్తా.. ఇవన్నీ అఖిల్‌ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ ఆ మధ్య కారు కొనాలన్న కలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు మరో కల నెరవేర్చుకున్నాడు. తండ్రికి కారు కొనిచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు అఖిల్‌.

"హ్యాపీ బర్త్‌డే డాడ్‌, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్‌ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు, నాకోసం మరెన్నో చేశావు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్‌ పప్పా.. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా కృషి చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను. మీకు కారు గిఫ్ట్‌ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్‌ప్రైజ్‌ మీకు నచ్చిందనే అనుకుంటున్నా! మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అఖిల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement