అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్‌ | Diehard Fan Got BB Telugu 4 RunnerUp Akhil Sarthak Name Tattoo On His Chest | Sakshi
Sakshi News home page

అఖిల్‌ పేరు పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్‌

Published Wed, Mar 10 2021 3:40 PM | Last Updated on Wed, Mar 10 2021 5:23 PM

Diehard Fan Got BB Telugu 4 RunnerUp Akhil Sarthak Name Tattoo On His Chest - Sakshi

అఖిల్‌ సార్థక్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్‌నెస్‌తోనే కాకుండా యాటిట్యూడ్‌తో, తనదైన గేమ్‌ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్‌ ల్యాప్‌టాప్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్‌బాస్‌ ఐ ఉన్న బ్రేస్‌లెట్‌ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్‌కు షాక్‌ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

బిగ్‌బాస్‌ షో సమయం నుంచి అఖిల్‌కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్‌ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్‌ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్‌తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్‌కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

"ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్‌ యూ అర్జున్‌. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్‌ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే.

చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు

పాతికేళ్లకే సాధించిన అఖిల్‌ సార్థక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement