అఖిల్‌ కొత్త బైకు: సోహైల్‌, మోనాల్‌కు నో ఛాన్స్!‌ | Bigg Boss 4 Telugu: Akhil Sarthak Buy New Bike | Sakshi
Sakshi News home page

అఖిల్‌ కొత్త బైకు, ఎవరినీ ఎక్కించుకోలేడుగా!‌

Published Wed, Mar 31 2021 8:41 PM | Last Updated on Wed, Mar 31 2021 9:59 PM

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Buy New Bike - Sakshi

పాతికేళ్ల వయసులో కారు కొన్నాలన్న కోరికను సాకారం చేసుకున్న అఖిల్‌ తాజాగా మరో కల నెరవేర్చుకున్నాడు..

అఖిల్‌ సార్థక్‌.. బిగ్‌బాస్‌కు ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్‌బాస్‌ తర్వాత ఇతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొన్న అఖిల్‌ తన యాటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన ఇతడు పాతికేళ్లకే కారు కొన్నాలన్న కోరికను సైతం గత నెలలో సాకారం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్‌ యాక్టర్‌ లేటెస్ట్‌ బైక్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ మేరకు ఫొటోలతో పాటు బైక్‌ నడుపుతున్న వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. "నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఇంతలా సపోర్ట్‌ చేస్తూ నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్‌ యూ సో మచ్‌. రానున్న రాజుల్లో మీ అందరూ గర్వపడేలా చేస్తాను" అని రాసుకొచ్చాడు.

ఇక ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో ఆశ్చర్యపోయిన సోహైల్‌ తానెక్కడ కూర్చోవాలని ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. నీకోసం నా గుండెలో స్పెషల్‌ సీటు ఉందని రిప్లై ఇచ్చాడు. అతడి ఫ్యాన్స్‌ మాత్రం అక్కడ ఆల్‌రెడీ మోనాల్ ఉందిగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గంగవ్వేమో జర నెమ్మదిగా నడుపు అని తన మనవడు అఖిల్‌కు సూచించింది.  పలువురు సెలబ్రిటీలతో పాటు అతడి అభిమానులు సైతం అఖిల్‌ కొత్త బైకు కొన్నందుకు కంగ్రాట్స్‌ చెప్తున్నారు. ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో అఖిల్‌.. సోహైల్‌, మోనాల్‌నే కాదు,‌ ఎవరినీ ఎక్కించుకుని రైడ్‌కు తీసుకెళ్లలేడు. కాగా గతంలో పలు సీరియళ్లలో నటించిన అఖిల్‌ ప్రస్తుతం మోనాల్‌ గజ్జర్‌తో "తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి" అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు.

చదవండి: అఖిల్‌ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్‌

భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement