Kambaduru
-
రఘువీరా దొంగాట
సాక్షి, కంబదూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పరిచయాలు.. టీడీపీతో చీకటి ఒప్పందం గెలుపు తీరాలకు చేరుస్తాయని భ్రమపడిన ఆయనకు వాస్తవం బోధపడింది. ప్రజల్లో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ఆదరణ.. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ దూసుకుపోతున్న తీరుతో రఘువీరా చీకటి రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ వర్గీయులను తన వైపునకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు ఎర వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతూ మంతనాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ వర్గీయులకు రఘువీరాతో పాటు ఆయన వర్గీయులు ఫోన్లు చేస్తూ పార్టీ మారాలనే ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. అయినప్పటికీ ససేమిరా అంటుండటంతో ఆయనే స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బతిమలాడుతున్నారు. ఈ కోవలోనే గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో కంబదూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ దళిత నేతలు సీహెచ్ నరసప్ప, మల్లేష్, మల్లికార్జునతో పాటు మరికొందరి ఇళ్ల వద్దకు రఘువీరారెడ్డి వెళ్లారు. పడుకున్న వాళ్లను నిద్ర లేపి పార్టీలో చేరాలని బలవంతపెట్టారు. వాళ్లంతా పార్టీ మారబోమని స్పష్టం చేసినా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఫొటోలు తీయించారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయించి వైఎస్సార్సీపీ శ్రేణులు పార్టీ మారుతున్నారనే సంకేతాలు పంపే ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. -
రండి బాబూ... రండి!
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. -
నిప్పంటించుకుని గర్భిణి ఆత్మహత్యాయత్నం
కంబదూరు: మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన బోయ ప్రియాంక (20) అనే వివాహిత మహిâýæ ఒంటికి నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన బోయ నరేష్ అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె 9 నెలల నిండు గర్భిణి 10 రోజుల్లో కాన్పుకావాల్సిన యువతికి ఏం జరిగిందో తెలీదు కానీ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో కిరోషి¯ŒS పోసుకోని నిప్పటించుకుంది. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. హుటాహుటీన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆత్యహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ఐ నరసింహుడు తెలిపారు. -
గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం
కంబదురు(అనంతపురం): పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాక అడ్డొచ్చిన వాచ్‌మెన్‌ను కత్తులతో బెదిరించి పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మల్లేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన వాచ్మెన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతన్ని కత్తులతో బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నిన్న వాటర్‌మేన్, ఈ రోజు స్వీపర్ ఆత్మహత్య!
అనంతపురం: కంబదూరు గ్రామపంచాయతీలో నిన్న వాటర్‌మేన్ ఆత్మహత్య చేసుకుంటే, ఈ రోజు స్వీపర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పంచాయతీలో 30 ఏళ్లుగా వాటర్మేన్గా పని చేస్తున్న మల్లేష్(45) బుధవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సర్పంచ్ శ్రీరాములు, కార్యదర్శి నాగరాజుల వల్లే మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సర్పంచ్, కార్యదర్శి, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు. దాంతో మల్లేష్ ఆత్మహత్య కేసు విషయంలో తనపై ఆరోపణలు వస్తాయని స్వీపర్ పోతన్న భయపడిపోయాడు. ఆ భయంతోనే పోతన్న ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.