అనంతపురం: కంబదూరు గ్రామపంచాయతీలో నిన్న వాటర్మేన్ ఆత్మహత్య చేసుకుంటే, ఈ రోజు స్వీపర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పంచాయతీలో 30 ఏళ్లుగా వాటర్మేన్గా పని చేస్తున్న మల్లేష్(45) బుధవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సర్పంచ్ శ్రీరాములు, కార్యదర్శి నాగరాజుల వల్లే మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సర్పంచ్, కార్యదర్శి, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
దాంతో మల్లేష్ ఆత్మహత్య కేసు విషయంలో తనపై ఆరోపణలు వస్తాయని స్వీపర్ పోతన్న భయపడిపోయాడు. ఆ భయంతోనే పోతన్న ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
నిన్న వాటర్మేన్, ఈ రోజు స్వీపర్ ఆత్మహత్య!
Published Thu, Jul 3 2014 8:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement