సెల్ఫీయా.. నో నో! | Ileana D'Cruz doesn't have 'patience' to take selfies | Sakshi
Sakshi News home page

సెల్ఫీయా.. నో నో!

Published Mon, Jul 27 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

సెల్ఫీయా.. నో నో!

సెల్ఫీయా.. నో నో!

నచ్చిన వ్యక్తితో సెల్ఫీ, మంచి డ్రెస్ వేసుకుంటే సెల్ఫీ, కొత్త ప్రదేశానికి వెళితే సెల్ఫీ... ఇలా సెల్‌ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడో ఫ్యాషన్ అయిపోయింది. ఈ పిచ్చి ఎందాకా ముదిరిందంటే.. చివరికి చచ్చిపోయిన వాళ్లతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఇటీవల ఈ సెల్ఫీల గురించి ఇలియానా స్పందించారు. ‘‘ఏమోనండి బాబూ నాకు సెల్ఫీలంటే ఇంట్రస్ట్ లేదు’’ అని పేర్కొన్నారు ఈ గోవా సుందరి.

 

ఇటీవల ఓ రెస్టారెంట్ దగ్గర చిన్న పాప సెల్ఫీ తీసుకుంటూ ఇలియానాకి కనిపించిందట. ‘‘ఒక్క ఫొటో కోసం ఆ పాప దాదాపు 15 నిమిషాలు కేటాయించింది. ఆ ఓపికకు ఆశ్చర్యపోయాను. ఇదే ఓపికను ఉపయోగపడే విషయాలకు కేటాయిస్తే బాగుంటుంది కదా అనిపించింది’’ అని ఇలియానా పేర్కొన్నారు. అది మాత్రమే కాదు.. తనకంత ఓపిక లేదని, ఎవరైనా ఒత్తిడి చేస్తే, అప్పుడు కాదనలేక సెల్ఫీకి ఓకే చెబుతానని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement