యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు. యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.
బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్‌లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment