Bangladeshis
-
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
గౌహతి: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు.తాజాగా ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది బంగ్లాదేశీయులను అస్సాం రాష్ట్ర పోలీసులు సరిహద్దుల నుంచి వెనక్కి పంపించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఒక ట్వీట్లో తెలిపారు. భారతదేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు గణనీయంగా పెరిగాయన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొంత భాగాన్ని మాత్రమే అస్సాం కాపాడుతోందని అన్నారు. పోలీసులు బంగ్లాదేశీయులను వెనక్కి పంపడాన్ని సీఎం మెచ్చుకున్నారు. కరీంగంజ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి చొరబడుతున్న బంగ్లాదేశీయుల ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారని శర్మ పేర్కొన్నారు.ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 25 మంది చొరబాటుదారులను అస్సాం నుండి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించినట్లు శర్మ తెలిపారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులు టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేందుకు దక్షిణాది నగరాలకు చేరుకోవడానికి అస్సాంను రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారన్నారు. కాగా ఈశాన్య ప్రాంతంలోని 1,885 కి.మీ పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిఘా మరింతగా పెంచింది. Taking firm stance against infiltration, @assampolice pushed back 9 Bangladeshis and 8 children across the border in the wee hours today-Harul Lamin-Umai Khunsum-Md. Ismail-Sansida Begum-Rufiya Begum -Fatima Khatun-Mojur Rahman-Habi Ullah-Sobika BegumGood job 👍 pic.twitter.com/Q3DeQBr6kj— Himanta Biswa Sarma (@himantabiswa) September 28, 2024ఇది కూడా చదవండి: Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్? -
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు. యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు. -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా
కారుతో ఢీకొట్టి ఇద్దరు మహిళలను చంపినందకు ఇద్దరు వ్యక్తులకు సుమారు రూ. 90 లక్షలు దాక జరిమానా విధించింది దుబాయ్ ట్రాఫిక్ కోర్టు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగ్లాదేశీ కాగా, మరోకరు భారతీయ వ్యక్తి. గత జులై నెలలో దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సౌదీ మహిళలు మృతి చెందడానికి ఆ ఇద్దరే వ్యక్తులే కారణం అని కోర్టు నిర్ధారించి ఈ శిక్ష విధించింది. 48 ఏళ్ల భారతీయ డ్రైవర్‌కి సుమారు రూ. 45 వేలు జరిమాన విధించడం తోపాటు దాదాపు రూ. 18 లక్షలను బ్లడ్‌మనీగా కట్టమని ఆదేశించింది. అలాగే మిగతా డబ్బును బంగ్లాదేశ్ వ్యక్తిని చెల్లించమని దుబాయ్ కోర్టు ఆదేశించింది. బంగ్లాదేశ్ వ్యక్తి, భారతీయ డ్రైవర్ సంఘటన జరిగినప్పుడూ చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఢీ కొన్న కొద్దిసేపటికే ఆ ఇద్దరు సౌదీ మహిళలు మృతి చెందారని, అలాగా బాధితుల కుటుంబంలోని మిగతా నలుగురు కూడా ఆ ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా ఆ ఘటన రోజు దుబాయ్‌లోని అల్-బర్షా ప్రాంతంలో బంగ్లాదేశ్ వ్యక్తి తన కారుని రోడ్డు మధ్యలో ఆపి రివర్స్ చేస్తుండగా...మరో కారులో వస్తున్న భారతీయ డ్రైవర్ చూడకపోవడంతో ఆ కారుని గట్టిగా ఢీ కొట్టాడు. సరిగ్గా అదే సమయంలో సౌదీకి చెందిన కుటుంబంతో వస్తున్న కారుని అనుకోకుండా ఈ ఇద్దరు వ్యక్తులు తమ కార్లతో దారుణంగా ఢీకొట్టారు. (చదవండి: వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు) -
గోవాలో అక్రమంగా ఉంటున్నవారి అరెస్టు
పనాజీ: గోవాలో అక్రమంగా నివసిస్తున్న 10 మంది బంగ్లాదేశీయులను, 18 మంది ఉగాండా వాసులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గోవా పోలీసులు, విదేశీయుల రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు (ఎఫ్ఆర్ఆర్ఓ) సంయుక్త ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది బంగ్లా కుంటుంబ సభ్యులు ఉత్తర గోవా ప్రాంతంలో ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతోపాటు.. విదేశీ వీసాపై భారత్‌కు వచ్చిన 18 మంది ఉగాండా వాసులు ఆరాంబోల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వారందరిపై పది రోజులుగా నిఘా వేసిన పోలీసులు, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు అదుపులోకి తీసుకుని మాపుస పట్టణంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. -
దుబాయ్ లక్ష్యం.. పాతబస్తీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: తమ తమ మాతృదేశాలు విడిచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారీ స్కెచ్‌తోనే దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ల దేశంలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో దుబాయ్, గల్ఫ్‌లాంటి విదేశాలకు వెళ్లడానికి భారత్‌ను తాత్కాలిక వేదికగా మార్చుకుంటుండగా.. మరికొందరు ఇక్కడే స్థిరపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది మెరుగైన జీవితం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సులువుగా గుర్తింపు కార్డులు పొంది.. భారత పౌరులుగా చలామణీ అవుతున్నారు. కొందరు విదేశాల కు వెళ్లే యత్నాలు చేస్తుంటే. మరికొందరు ఇక్కడే సెటిలవుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దర ఖాస్తు చేసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. పాతబస్తీలో రూ.10కి ఓటరు కార్డు, రూ.200కు పాన్‌కార్డు, రూ.2,000కు పాస్ పోర్టు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారికి ఉగ్రనేపథ్యముంటే.. అది అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మంటగలుపుతుందని అధికారులు వాపోతున్నారు. దుబాయ్‌కి ప్రణాళికలు.. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వీరంతా పాతబస్తీ, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఖాళీస్థలాలు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు దీనిని పట్టించుకోవడం లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు తీసుకుంటూ భారత పౌరులకు దక్కాల్సిన పథకాలను కొట్టేస్తున్నారు. స్థానిక యువతతో స్నేహం చేస్తోన్న రోహింగ్యా, బంగ్లాదేశీ యువకులు మెల్లిగా పంథా మార్చారు. స్థానిక యువత దారిలోనే.. దుబాయ్, గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులు సంపాదిస్తున్నారు. విజిటింగ్ వీసా మీద అయినా సరే.. విదేశాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలుపెట్టారు. వారు విదేశీయులని తెలిసీ కొందరు ఏజెంట్లు సాయం చేస్తుండటం గమనార్హం. కసబ్‌కు దారం.. వీరికి ఆధార్! 2008లో దేశంలోకి అక్రమంగా చొరబడి చేతికి ఎర్రటి దారం కట్టుకుని ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన కసబ్‌ను భారత పౌరుడంటూ పాకిస్తాన్ ప్రపంచానికి చాటిచెప్పే యత్నం చేసింది. నగరంలో ఓటర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందిన రోహింగ్యాలు విదేశాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడితే.. భారత్ అంతర్జాతీయంగా తనమీద పడ్డ మచ్చను చెరిపేసుకోవడం చాలాకష్టమని, పలుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని పలువు రు అంటున్నారు. అమెరికా, యూరోప్ వంటి దేశాలకు రోహింగ్యాల వల్ల నష్టం కలిగితే.. భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టులను రద్దు చేయాల ని పాస్‌పోర్టు ఆఫీసులకు లేఖలు రాస్తున్నారు. ఉపాధి కోసమా.. ఉగ్రకోణమా? వాస్తవానికి ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా వారిని వెంటనే అరెస్టుచేసి, జైలుశిక్ష లేదా తిరిగి పంపించడం చేస్తారు. వీరంతా వేలసంఖ్యలో వచ్చిన శరణార్థులు కావడంతో ఎవరినీ తిరిగి పంపే ప్రయత్నాలు జరగలేదు. వీరిలో చాలామంది ఉగ్రవాద సానుభూతిపరు లున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భారత్ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు విదేశాలకు వెళ్తున్నారన్న విషయం వెలుగుచూడగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా వెళ్లేవారు భారత పౌరుల ముసుగులో అక్కడ ఏదైనా ఉగ్రచర్యలకు పాల్పడితే.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మంటగలిసే ప్రమాదముందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. -
'దేశభద్రతకు సవాల్‌గా మారింది'
► అక్రమంగా 4 లక్షల మంది మకాం ► పోలీస్ కమిషనర్ సూద్ ఆందోళన జయనగర: భారత ఐటీ రాజధాని బంగ్లాదేశీయులతో కిక్కిరిసిపోయింది. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి ఉపాధి కోసం ఐటీ సిటీకి తరలి వస్తున్నారు. బెంగుళూరులో సుమారు 4 లక్షల మంది బంగ్లావాసులు అక్రమంగా ఉంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని నగర పోలీస్‌కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బెంగళూరులో బంగ్లాదేశ్, రష్యా, ఆఫ్రిక, శ్రీలంక , పాకిస్థాన్, పౌరులు పెద్ద సంఖ్యలో అక్రమంగా స్థిరపడ్డారని ఆయన చెప్పారు. అక్రమంగా మకాం వేసినవారి ఆచూకీ కనిపెట్టడానికి వివిధ ఏజెన్సీలతో సమాచారం పంచుకుంటూ గాలిస్తున్నామని తెలిపారు. ఇటీవల పాకిస్థానీ దంపతులను అరెస్ట్ చేశామని ఆయన గుర్తుచేశారు. భద్రతా దళాలకు లంచాలు ఇచ్చి.. ఆయా దేశాల పౌరులు ఇక్కడ సులభంగా ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను పొందడాన్ని నిరోధించడానికి కఠిన నిబంధనలు పాటించాల్సిన అవసరముందన్నారు. అక్రమంగా వచ్చి ఉంటున్న విదేశీయుల్లో 4 లక్షల మందికిపైగా బంగ్లా దేశీయులు ఉండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ చొరబాటుదారులు దేశ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందికి లంచాలు ఇచ్చి భారత్ లోకి ప్రవేశంచకుండా దేశభద్రతకు సవాల్‌గా మారిందని ప్రకటించారు. ఈ బంగ్లాదేశీయులు బెంగళూరులో లంచాలు ఇచ్చి అక్రమంగా ఆధార్, పాన్, ఓటరు కార్డులు పొందుతున్నారని కమిషనర్ చెప్పారు. వీరిలో కొందరు ఏళ్ల కిందటే నగరంలో స్థిరపడగా, కొందరు ఇటీవల వచ్చినవారు ఉన్నారని తెలిపారు. కట్టడ నిర్మాణాలు, హోటల్స్, మార్కెట్లు, మాల్స్, తదితరాల్లో కూలీపనులు చేసుకుంటూ ఉన్నారని చెప్పారు. వీరు కొత్తగా వచ్చేవారికి వసతి కల్పిస్తూ సహకరిస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. -
ఐసిస్ లో 261 మంది పౌరుల చేరిక?
ఢాకా: దాదాపు 261 మంది బంగ్లా జాతీయులు ఐసిస్ లేదా బంగ్లా మిలిటెంట్ల దళంలో చేరినట్లు ఆ దేశం అనుమానిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ నిఘా సంస్థ 'రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ)' బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం తెల్లవారుజామున ఫేస్ బుక్ లో వీరి జాబితాను పోస్టు చేసిన ఆర్ఏబీ వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరింది. ఆర్ఏబీ అధికార ప్రతినిధి ముఫ్తీ మహముద్ ఖాన్ మాట్లాడుతూ.. జాబితాలో పేర్కొన్నవారంతా గత కొద్ది నెలలుగా ఆచూకీ లేకుండా పోయారని, ఈ ఏడాది జరిగిన రెండు ఉగ్రదాడులకు సంబంధించి వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కాగా, వీరందరూ ఉగ్రసంస్థల్లో చేరిన ఉగ్రవాదులా అని మీడియా ప్రతినిధులు అడగగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు. ఢాకా కేఫ్, ఈద్ ప్రార్ధనా స్థలాలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడులు చేసింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించగా, బంగ్లాదేశ్ దాన్ని తోసిపుచ్చింది. నిఘాసంస్థ ప్రకటించిన జాబితాలో ఎవరి పిల్లల పేర్లయినా ఉంటే కచ్చితంగా తెలియజేయాలని, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సొస్తోందని భయపడొద్దని ఆర్ఏబీ చీఫ్ బెనర్జీర్ అహ్మద్ కోరారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో వారితో పాటు మిగిలిన పౌరులను కూడా కాపాడుకోవచ్చని చెప్పారు. కాగా, డజన్ల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు ఐసిస్ లో చేరేందుకు బంగ్లాదేశ్ నుంచి మిడిల్ ఈస్ట్ కు వెళ్లినట్లు ఆ దేశ పత్రికలు పేర్కొన్నాయి.