
డిటెన్షన్ సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం)
పనాజీ: గోవాలో అక్రమంగా నివసిస్తున్న 10 మంది బంగ్లాదేశీయులను, 18 మంది ఉగాండా వాసులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గోవా పోలీసులు, విదేశీయుల రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సంయుక్త ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది బంగ్లా కుంటుంబ సభ్యులు ఉత్తర గోవా ప్రాంతంలో ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతోపాటు.. విదేశీ వీసాపై భారత్‌కు వచ్చిన 18 మంది ఉగాండా వాసులు ఆరాంబోల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వారందరిపై పది రోజులుగా నిఘా వేసిన పోలీసులు, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారులు అదుపులోకి తీసుకుని మాపుస పట్టణంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment