పాక్ పౌరసత్వం పొందిన భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో నివసిస్తున్న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయలకు పాక్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ మేరకు గత ఐదేళ్లలో 298 మందికి భారతీయులకు ఈ సదుపాయం కల్పించినట్లు పాక్ అధికార వర్గాలు ప్రకటించాయి. 2012 నుంచి 2017 ఏప్రిల్ 14 మధ్యకాలంలో పాక్ పౌరసత్వం జారీచేసినట్లు పాక్ విదేశీ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం ప్రకటించింది.
శనివారం పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడు షేక్ రోహిల్ అస్ఘర్ జాతీయ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు విదేశీ అంతర్గత వ్యవహారాల శాఖ సమాధానమిచ్చింది. 2012లో 48 మంది భారతీయులు పాకిస్తాన్ పౌరసత్వం పొందగా, 2013లో 75 మంది, 2014లో 76 మందికి పాక్ పౌరసత్వం లభించింది. కానీ 2015లో అనూహ్యంగా 15కు పడిపోయింది. 2016లో మాత్రం 69 మంది పాక్ పౌరసత్వం పొందారు. 2017 ఏప్రిల్ 14 మరకు సుమారు 14 మందికి పాక్ ప్రభుత్వం పౌరసత్వం జారీ చేసింది.
పాకిస్తాన్ పౌరసత్వం పొందడుం చాలా కష్టం. కానీ అనేక దేశాల వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు, ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, భారత్ నుండి పెద్ద సంఖ్యలో వలస వెళ్లి జీవిస్తున్నారు.