మోదీకి వ్యతిరేకంగా పాక్‌ కుట్ర! | Pakistan wooing Indians opposed to Modi | Sakshi
Sakshi News home page

మోదీకి వ్యతిరేకంగా పాక్‌ కుట్ర!

Published Wed, Nov 23 2016 6:22 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

మోదీకి వ్యతిరేకంగా పాక్‌ కుట్ర! - Sakshi

మోదీకి వ్యతిరేకంగా పాక్‌ కుట్ర!

మోదీకి వ్యతిరేకంగా భారతీయుల్ని కూడగట్టే యత్నం
హైలెవల్‌ కమిటీ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన సర్తాజ్ అజిజ్‌
 
ఇస్లామాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా భారతీయుల్ని కూడగట్టాలని పాకిస్థాన్‌ భావిస్తోంది. మోదీ అనుసరిస్తున్న ‘ఉగ్రవాద విధానాలకు’ వ్యతిరేకంగా ఉన్న భారతీయుల్ని కూడగట్టుకునేందుకు, అదేవిధంగా కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు.. హైలెవల్‌ కమిటీని పాక్‌ ఏర్పాటుచేసింది. ఈ విషయమై ఆచరణసాధ్యమైన, నిరంతరమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని పాక్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజిజ్‌ మంగళవారం ఏకంగా సెనేట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని పాక్‌ దినపత్రిక డాన్ తెలిపింది. 
 
రక్షణ, హోం, సమాచార, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌ శాఖల సీనియర్‌ అధికారులతోపాటు,  ఐఎస్‌ఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో కీలక అధికారులు ఈ హైలెవల్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి విదేశాంగ కార్యదర్శి ఐజాజ్‌ చౌదరి నేతృత్వం వహిస్తారు. భారత ప్రచార వ్యూహాలను ఎదుర్కొనేందుకు, కశ్మీర్‌ పోరాటాన్ని నిరంతరం అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు వీలైన వ్యూహనివేదికను ఈ కమిటీ అందజేస్తుందని సర్తాజ్‌ అజిజ్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement