Sartaj Aziz
-
మాటలు కలిపిన మోదీ, అజీజ్
అమృత్సర్: ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొనేందుకు శనివారం భారత్ చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్.. ప్రధాని మోదీ, అఫ్గన్ అధ్యక్షుడు ఘనీ, 30 మంది ఇతర దేశాల ప్రతినిధులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అజీజ్ పలకరించుకున్నారు. సదస్సు సందర్భంగా భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం విసృ్తత ద్వైపాక్షిక భేటీ నిర్వహించాలని ఆ సమయంలో నిర్ణరుుంచాయి. అయితే పఠాన్‌కోట్ , ఉడీ దాడులు, సర్జికల్ దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సదస్సులో పాక్‌ను భారత్ దౌత్యపరంగా ఒంటరి చేయడానికి ప్రయత్నించొచ్చు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ధిష్ట చర్యలు చేపట్టేలా ఇతర దేశాల మద్దతు కూడగట్టొచ్చు. పాక్ భూభాగం నుంచి ఉగ్ర ముప్పు ఎదుర్కొంటున్న అఫ్గనిస్తాన్ ఇతర దేశాలు కట్టుబడి ఉండేలా ప్రాంతీయ ఉగ్ర వ్యతిరేక వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. -
మోదీకి వ్యతిరేకంగా పాక్ కుట్ర!
-
మోదీకి వ్యతిరేకంగా పాక్ కుట్ర!
మోదీకి వ్యతిరేకంగా భారతీయుల్ని కూడగట్టే యత్నం హైలెవల్ కమిటీ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన సర్తాజ్ అజిజ్ ఇస్లామాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా భారతీయుల్ని కూడగట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది. మోదీ అనుసరిస్తున్న ‘ఉగ్రవాద విధానాలకు’ వ్యతిరేకంగా ఉన్న భారతీయుల్ని కూడగట్టుకునేందుకు, అదేవిధంగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు.. హైలెవల్ కమిటీని పాక్ ఏర్పాటుచేసింది. ఈ విషయమై ఆచరణసాధ్యమైన, నిరంతరమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని పాక్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం ఏకంగా సెనేట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని పాక్ దినపత్రిక డాన్ తెలిపింది. రక్షణ, హోం, సమాచార, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ శాఖల సీనియర్ అధికారులతోపాటు, ఐఎస్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక అధికారులు ఈ హైలెవల్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి నేతృత్వం వహిస్తారు. భారత ప్రచార వ్యూహాలను ఎదుర్కొనేందుకు, కశ్మీర్ పోరాటాన్ని నిరంతరం అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు వీలైన వ్యూహనివేదికను ఈ కమిటీ అందజేస్తుందని సర్తాజ్ అజిజ్ తెలిపారు. -
పాక్ కొత్త పలుకు.. ట్రంప్తోపాటే మేం కూడా
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఉగ్రవాదం విషయంలో ప్రకటన చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము అమెరికాతో కలిసి సమాంతరంగా ముందుకు వెళతామని చెప్పింది. ఉగ్రవాదానికి కౌంటర్ ఇచ్చేందుకు తాజాగా అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ తో కలిసి పనిచేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలహా దారుడు సర్తాజ్ అజిజ్ అన్నారు. పాక్ లోని ఓ మీడియాతో సర్తాజ్ గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో ట్రంప్ పాక్‌ను నేరుగా విమర్శించారని, కొన్ని సంస్థలతో మాత్రమే పాక్ పోరాడుతూ మిగితా ఉగ్రవాద సంస్థలను పాక్ నిర్లక్ష్యం చేస్తుందని అన్నారని, అమెరికాలోని ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఉగ్రవాదంతో సంబంధం కలిపారు కదా అని ప్రశ్నించగా బదులిచ్చిన సర్తాజ్ అదంతా గతం అని, ఇప్పుడు అలాంటి విధానాలేవి లేవని, ఉగ్రవాద నిర్మూలనకోసం తీవ్రంగానే శ్రమిస్తున్నామని, తాము ట్రంప్‌తో కలిసి ఈ విషయంలో పోరాడుతామని చెప్పారు. -
ఉగ్రవాదానికి ప్రధాన బాధితులం మేమే
తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దంటూ ఎన్నిసార్లు భారత్ హెచ్చరించినా.. పెడచెవిని పెట్టిన పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని పోలీసు శిక్షణ కేంద్రంపై నిన్న జరిగిన ఉగ్ర దాడితో కళ్లుతెరిచింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్, తీవ్రవాదానికి ప్రధాన బాధితులం తామేనని వాపోతుంది. దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదం ప్రబలుతుందని పాకిస్తాన్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ఇస్తామాబాద్‌లో జరిగిన యునిటెడ్ నేషన్స్ సెక్యురిటీ కౌన్సిల్ కౌంటర్-టెర్రరిజం కమిటీ సమావేశంలో భౌగోళిక రాజకీయ పరిణామాలను ఆయన గుర్తుచేసుకున్నారు. గత దశాబ్దాలుగా టెర్రరిజం ప్రబలడానికి ముఖ్య కారణంగా భౌగోళిక-రాజకీయ పరిణామాలే కారణమని సర్తాజ్ అజీజ్ ఎత్తిచూపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కమ్యూనిటీ చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ ముందంజలో ఉందని, నేషనల్ యాక్షన్ ప్లాన్‌కు ఆదేశాలతో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం అమలుచేస్తుందని సర్తాజ్ అజీజ్ వివరించారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజంలో పాకిస్తాన్ ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణా కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడిన ఉగ్రవాద ఘటనలో 61 మంది యువ క్యాడెట్లు మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు పేర్కొన్నారు. -
'ఇండియాతో దొడ్డిదారి దౌత్యం ఉండదు'
ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ సర్జికట్ స్ట్రైక్స్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలను నివారించే క్రమంలో దొడ్డిదారి దౌత్యాన్ని నెరపబోమని పాక్ ప్రధాని భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల అభిలాషను బట్టి ఎలాంటి సంవాదమైనా నేరుగానే తప్ప మరోదారిలో చేయబోమని స్పష్టం చేశారు. రేడియో పాకిస్థాన్ కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అన్ని దేశాలతోనూ మైత్రిని కోరుకుంటోందన్న సర్తాజ్ అజీజ్.. అభివృద్ధి ఎజెండాతో అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ తోపాటు మిగతా దేశాలతోనూ స్నేహం చేస్తున్నమన్నారు. ఇటు దక్షిణ ఆసియా దేశాలతోనూ సత్సంబంధాలు నెరుపుతున్నామన్న ఆయన.. ప్రతిష్ఠాత్మక తజకిస్థాన్-అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్-ఇండియా(తైపీ) సహజవాయు గ్యాస్ పైప్ లైన్ తోపాటు సెంట్రల్ ఏసియా-సౌత్ ఏసియా పవర్ ప్రాజెక్ట్(కాసా) నిర్మాణాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
-
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోలేదు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళుతామని వ్యాఖ్య ఇస్లామాబాద్: సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు నదీ జలాలపై భారత్-పాకిస్తాన్ చర్చలను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవంటూ ఈ ఒప్పందంపై సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు' అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం పేర్కొన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణ సమయంలోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు. -
బలూచ్పై మా మాట రుజువైంది: పాక్
బలూచిస్తాన్, పీవోకేలో ప్రజలపై అకృత్యాలను పంద్రాగస్టు ప్రసంగంలో ప్రస్తావించిన మోదీపై పాక్ స్పందించింది. బలూచ్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న తమ వాదన ఆయ వ్యాఖ్యలతో రుజువైందని పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారైన సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. కశ్మీర్లో నెలకొన్ని విషాద పరిస్థితిపైనుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
భారతదేశమే మాకు అతిపెద్ద శత్రువు!
తమ దేశానికి అతిపెద్ద శత్రువు ఉగ్రవాదం కాదని.. భారతదేశమేనని పాక్ అంటోంది. భారతదేశం తన అణ్వస్త్ర నిల్వలను తగ్గించుకుంటే గానీ.. పాకిస్థాన్ ఆయుధ సేకరణ తగ్గించబోదని చెబుతోంది. ఇలా అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు పాక్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్! అణ్వస్త్ర నిల్వలను తగ్గించుకోవాలంటూ అమెరికా మంత్రి జాన్ కెర్రీ చేసిన సూచనకు సమాధానంగా ఆయనీమాట చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నిల్వలను తగ్గించుకోవాల్సింది భారతదేశమే గానీ పాకిస్థాన్ కాదని ఆయన అన్నారు. వాళ్లు నిల్వలు పెంచుకుంటూ పోతే.. తాము తగ్గించుకోలేమని ఆయన చెప్పారు. అణ్వస్త్రాలను తగ్గించుకోవాలన్నదాన్ని విధాన నిర్ణయంగా తీసుకోవాలని జాన్ కెర్రీ పాకిస్థాన్‌కు సూచించారు. అయితే, భారతదేశాన్ని కూడా అలా అడుగుతామా, లేదా అన్న విషయాన్ని మాత్రం కెర్రీ ఎక్కడా ప్రస్తావించలేదు. భద్రతాపరంగా తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని సర్తాజ్ అజీజ్ అమెరికాను కోరారు. భారత్ తన అణ్వస్త్రాలను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటోందని, అందువల్ల పాకిస్థాన్ కూడా స్పందించాల్సి వస్తోందని ఆయన అన్నారు. అమెరికా - పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక చర్చలలో పాల్గొనేందుకు వెళ్లిన సర్తాజ్ అజీజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. -
ఇప్పట్లో భారత్‌తో క్రికెట్ సాధ్యం కాదు
పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ కరాచీ: భారత్‌తో క్రికెట్ సిరీస్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొందని గుర్తుచేశారు. ‘ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ జరగాలంటే అంతకన్నా ముందు ఇతర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. నాకైతే ఇప్పట్లో మ్యాచ్‌లు జరుగుతాయని అనిపించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తి వివరాలు పీసీబీ చెప్పాల్సి ఉంటుంది’ అని అజీజ్ తెలిపారు. -
'భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ అనుమానమే'
కరాచీ: తాజా పరిణామాల దృష్ట్యా భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపించడంలేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్లో దాయాది దేశాల మధ్య సిరీస్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిరీస్ నిర్వహించాలంటే ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. దుబాయ్‌లో వచ్చేవారం బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్ గురించి ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తానని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపిన మరునాడే అజీజ్ ఈ వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. 2015 నుంచి 2022ల మధ్య భారత్-పాక్ జట్లు ఆరు సిరీస్‌లు ఆడేందుకు చర్చించనున్నట్లు పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య సిరీస్ జరగకపోవడం అంత మంచిది కాదని అజీజ్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్న భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఒకరికొకరు దూరంగా ఉండటం కూడా ఈ సిరీస్ పట్ల అనిశ్చితిని కొనసాగిస్తోంది. -
భారత్‌తో చర్చలకు సిద్ధం: పాక్
న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు షరతు లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసినట్టు భారత్ అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ఇదిలావుండగా, భారత్, పాక్‌ల మధ్య శాంతి చర్చల్లో మూడోపక్షం ప్రమేయం ఉండరాదని భారత్ మొదట్నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. పాక్ ఈ చర్చలకు జమ్ముకశ్మీర్ వేర్పాటు వాద నాయకులను ఆహ్వానించడంపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. గతంలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన శాంతిచర్చల ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అప్పట్లో అనుకున్న ఎజెండాలో అసలు కాశ్మీర్ అంశం లేదు. కానీ ఆ తర్వాత నవాజ్ షరీఫ్‌పై పాక్ సైన్యం తీవ్రమైన ఒత్తిడి తేవడంతో చర్చల్లో కాశ్మీర్ సమస్య గురించి కూడా ఉండాలని అన్నారు. పైగా, ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు ముందు.. కాశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలతో చర్చలకు పాక్ సై అంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. పాక్ జాతీయ భద్రత సలహాదారును కలిసేందుకోసం వెళ్తున్న కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సర్తాజ్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో అన్ని సమస్యల గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ అంశానికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. భారత్ హురియత్ నేతలను అరెస్ట్ చేయడం తమను నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పాక్ ముందస్తు షరతు లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు భారత్ అభీష్టానికి భిన్నంగా హురియత్ నేతలను చర్చలకు ఆహ్వానించడం గమనార్హం. -
'బ్యాక్ ఎండ్‌లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
ఇస్లామాబాద్: ప్రధాన సమస్య జోలికి పోకుండా మిగతా అంశాలపై దశలవారీగా చర్చలు జరపడం.. తద్వారా అసలు సమస్య పరిష్కారానికి కావాల్సినంత సానుకూలతను సృష్టించడం దౌత్యనీతి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ లు ఇలాంటి వెనుక మార్గపు దౌత్యాన్ని(బ్యాక్ ఎండ్ డిప్లమసీ) అనుసరిస్తున్నాయని పాకిస్థాన్ ప్రధానికి జాతీయ భద్రత, విదేశీవ్యవహారాల సలహాదారు సర్తజ్ అజీజ్ అన్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశంలో భాగంగా రష్యాలోని ఉఫా నగరంలో చర్చించుకున్న భారత్, పాక్ ప్రధానుల చర్చల్లో కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ వంటి కీలక అంశాలపై ఎలాంటి ప్రస్తావన రాకపోవడంపై ఇటు భారత్ సహా, అటు పాకిస్థాన్ లోనూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రధాన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయని, అయితే చిక్కుముడిని ఒక్కసారే విప్పడంకంటే సావధానంగా వ్యవహరించడం ఉత్తమమని అజీజ్ పేర్కొన్నారు. మోదీతో చర్చల సందర్భంలో షరీఫ్ వెంట అజీజ్ కూడా పాల్గొన్నారు. -
పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళన
ఇస్లామాబాద్: తీవ్రవాదులను తీవ్రవాదులతోనే తటస్థీకరించాలని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తప్పుబట్టింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న పారికర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భారత్ తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు. తీవ్రవాదం రెండు దేశాల ఉమ్మడి శత్రువని, దాన్ని ఓడించేందుకు ఇరుదేశాలు కలిసి పోరాడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. తీవ్రవాదం కారణంగా తమ దేశమే ఎక్కువగా నష్టపోయిందన్నారు. -
భారత్ షరతు అంగీకారం కాదు:పాకిస్తాన్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ చర్చల్లో కాశ్మీర్ అంశం లేవనెత్తరాదన్న భారత్ షరతు తమకు అంగీకారం కాదని పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ తో చర్చల నేపథ్యంలో సెనేట్ స్టాండింగ్ కమిటీతో సోమవారం ఇస్లామాబాద్‌లో సమావేశమైన సందర్భంగా అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ అంగీకరిస్తే అందుకు అనుగుణంగా పాక్ పనిచేస్తుందని కమిటీ సభ్యులతో అజీజ్ అన్నట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం భారత్, పాకిస్థాన్ కాకుండా కాశ్మీర్‌కు మరో అవకాశం లేదన్నారు. భారత బలగాల దాడిలో 14 మంది తమ దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 65 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలే ముందుగా సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాకిస్తాన్ శత్రుత్వం పెట్టుకునేందుకు యత్నిస్తోందని అజీజ్ తెలిపారు. -
‘కాశ్మీర్’పై అంతర్జాతీయ ప్రచారం
భారత సైన్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ భారత్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఈ దురాగతాలపై అంతర్జాతీయంగా ప్రచారం చేపడతామని పాకిస్థాన్ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఎగువసభలో ఓ ప్రకటన చేశారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ.. ఆక్రమిత కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనలకు ఏడు లక్షల మంది భారత సైనికులే కారణమని, ఈ దురాగతాలపై అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం చేపడతామన్నారు. ఈ ఉల్లంఘనలు నరేంద్ర మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్భంగా అజీజ్ అన్నట్టు రేడియో పాకిస్థాన్ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ 224 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, గతం తో పోల్చితే ఇప్పుడు దాడుల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అయితే భారత్ నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదని అజీజ్ పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల్లో భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాక్ జాతీయ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అజీజ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైన్యం అక్రమంగా బంకర్లను నిర్మిస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు 500 మీటర్ల లోపుగా ఇరు దేశాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 2010లో చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అని పేర్కొంది. శాంతినే కోరుకుంటున్నాం: రాజ్‌నాథ్ గ్రేటర్ నోయిడా: సరిహద్దులో తాము శాంతినే కోరుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 53వ రైజింగ్ డే కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్‌పోస్టులు, నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ వరుస కాల్పులను ఆపాలని డిమాండ్ చేశారు. దీపావళి రోజునా పాక్ దళాల కాల్పులు జమ్మూ: దీపావళి రోజున, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్థాన్ బలగాలు సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడ్డాయి. సాంబా, కతువా, జమ్మూ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బోర్డర్ ఔట్ పోస్టులు లక్ష్యంగా పాక్ దళాలు బుల్లెట్ల వర్షం కురిపించాయని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. భారత బలగాలను రెచ్చగొట్టేందుకు పాక్ కాల్పులకు పాల్పడిందని పేర్కొన్నారు. కాగా, పూంచ్ జిల్లాలోని అధీన రేఖ వద్ద శుక్రవారం రాత్రి కూడా పాక్ సైన్యం భారత శిబిరాలపై కాల్పులు జరపగా భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. -
కాశ్మీర్ వేర్పాటువాదులతో సర్తాజ్ అజీజ్ భేటీ
న్యూఢిల్లీ: కాశ్మీర్ వేర్పాటు వాద గ్రూపులతో పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఢిల్లీలో సమావేశం కావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. ఆదివారం అజీజ్ ఇక్కడి పాక్ హైకమిషన్‌లో హురియత్ కాన్ఫరెన్స్ గ్రూపులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆసియా, యూరప్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి ఉదయం ఇక్కడికి వచ్చిన అజీజ్.. సాయంత్రం హురియత్ నేత సయ్యద్ అలీషా, జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్, మితవాద అవామీ గ్రూపు నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, దుక్తరనీ మిల్లట్ ఫౌండర్ అసియా అండ్రబీతో సమావేశమయ్యారు. అంతకుముందు దీనిని అడ్డుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఇలా భారత భూభాగంలో కాశ్మీర్ వేర్పాటు వాదులతో అజీజ్ సమావేశానికి యూపీఏ ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆయన మండిపడ్డారు.