పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళన | Pakistan criticizes Indian defence minister's terrorism remarks | Sakshi
Sakshi News home page

పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళన

Published Sun, May 24 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

మనోహర్ పారికర్(ఫైల్)

మనోహర్ పారికర్(ఫైల్)

ఇస్లామాబాద్: తీవ్రవాదులను తీవ్రవాదులతోనే తటస్థీకరించాలని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తప్పుబట్టింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న పారికర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

భారత్ తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు. తీవ్రవాదం రెండు దేశాల ఉమ్మడి శత్రువని, దాన్ని ఓడించేందుకు ఇరుదేశాలు కలిసి పోరాడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. తీవ్రవాదం కారణంగా తమ దేశమే ఎక్కువగా నష్టపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement