అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్ట్జ్‌ను తన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా ఎంపిక చేశారు. దీంతో భారత కాకస్‌కు చీఫ్ అయిన మైక్ వాల్ట్జ్.. భారత్‌తో అమెరికా రక్షణ, భద్రతా సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక.. ఆయన ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్‌లో ఆమెరికా విస్తరణ కార్యక్రమాల్లో పనిచేశారు. దీనికిగాను ఆయన బ్రాంజ్ స్టార్‌తో సహా అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. డిఫెన్స్ సెక్రటరీ డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ ఆధ్వర్యంలో పెంటగాన్‌లో ఆఫ్ఘనిస్తాన్ విధాన సలహాదారుగా కూడా పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంపై హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా మైక్ వాల్ట్జ్.. అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రశ్నించి వార్తల్లోకి ఎక్కారు.
వాల్ట్జ్.. బలమైన రక్షణ వ్యూహాలు రచించే న్యాయవాది. ముఖ్యంగా భారత్, చైనానుతో సంబంధాలను మెరుగుపర్చటంలో అనుభవజ్ఞుడైన విదేశాంగ విధాన నిపుణుడు. అమెరికా-ఇండియా కూటమికి కీలకమైన ప్రతిపాదకుడు. భారతదేశంతో ముఖ్యంగా రక్షణ, భద్రతా సహకారంలో లోతైన సంబంధాలను పెంచుకున్నారు. భారతదేశం, భారతీయ అమెరికన్లపై ద్వైపాక్షిక కాంగ్రెషనల్ కాకస్‌కు కో-చైర్మన్‌గా మైక్ వాల్ట్జ్.. 2023లో అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన చారిత్రాత్మక ప్రసంగంలో కీలక పాత్ర పోషించారు.
సెనేట్ ఇండియా కాకస్‌లో ప్రస్తుతం 40 మంది సభ్యులు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలు, భద్రతను ప్రభావితం చేసే దేశీయ, అంతర్జాతీయ సమస్యలపై జాతీయ విధానాలను రూపొందించే ద్వైపాక్షిక కూటమి. దీనిని 2004లో అప్పటి న్యూయార్క్ సెనేటర్ , సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ , సెనేటర్ జాన్ కార్నిన్‌లు స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment