
సాక్షి, ఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావడంతో మళ్లీ ఆయన్నే నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా మరోసారి పీకే మిశ్రా నియమితులయ్యారు. ప్రధానమంత్రి సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు అమిత్ కరే, తరుణ్ కపూర్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.