మాటలు కలిపిన మోదీ, అజీజ్ | Modi, Aziz Mixed the words | Sakshi
Sakshi News home page

మాటలు కలిపిన మోదీ, అజీజ్

Published Sun, Dec 4 2016 2:00 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

Modi, Aziz Mixed the words

అమృత్‌సర్: ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొనేందుకు శనివారం భారత్ చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్.. ప్రధాని మోదీ, అఫ్గన్ అధ్యక్షుడు ఘనీ,  30 మంది ఇతర దేశాల ప్రతినిధులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అజీజ్ పలకరించుకున్నారు. సదస్సు సందర్భంగా భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చల విషయంలో  ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ఇరు దేశాలు చర్చలు జరిపాయి.

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం విసృ్తత ద్వైపాక్షిక భేటీ నిర్వహించాలని ఆ సమయంలో నిర్ణరుుంచాయి. అయితే పఠాన్‌కోట్ , ఉడీ దాడులు, సర్జికల్ దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సదస్సులో పాక్‌ను భారత్ దౌత్యపరంగా ఒంటరి చేయడానికి  ప్రయత్నించొచ్చు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ధిష్ట చర్యలు చేపట్టేలా ఇతర దేశాల మద్దతు కూడగట్టొచ్చు. పాక్ భూభాగం నుంచి ఉగ్ర ముప్పు ఎదుర్కొంటున్న అఫ్గనిస్తాన్ ఇతర దేశాలు కట్టుబడి ఉండేలా ప్రాంతీయ ఉగ్ర వ్యతిరేక వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement