దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు.
మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం.. క్యారియర్లు 2024లో 4,56,919 షెడ్యూల్డ్ డిపార్చర్‌లను నిర్వహించాలి. 2022లో 6,413 విమానాలు రద్దయ్యాయని, 2023లో ఈ సంఖ్య 7,427కి పెరిగిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తెలిపారు.
డిజి యాత్ర (Digi Yatra) గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, దశలవారీగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా విమాన ప్రయాణికులు డిజి యాత్రను ఉపయోగించారు.
డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా రూపొందించారు. విమానాశ్రయాల్లోని వివిధ చెక్‌పాయింట్‌ల వద్ద కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రయాణికుల డేటా అంత ఉంటుంది. అయితే విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి డేటా తొలగిస్తుంది. ఇది ప్రయాణికులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment