దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.
దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచారణలో అవి ఫేక్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.
2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్‌లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడంపై పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్‌కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.
ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
Comments
Please login to add a commentAdd a comment