నిరుద్యోగ యువతకు ఊరట.. | Urban Unemployment Rate Fell In January March Period | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు ఊరట..

Published Sat, Nov 23 2019 7:38 PM | Last Updated on Sat, Nov 23 2019 7:54 PM

Urban Unemployment Rate Fell In January March Period - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగాల కోత, ప్రబలుతున్న నిరుద్యోగం ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే తాజాగా వెలువడిన ప్రభుత్వ గణాంకాలు కొంత ఊరట ఇచ్చాయి. ఈ ఏడాది జనవరి -మార్చిలో పట్టణ నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దిగివచ్చింది. అంతకుముందు ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా నమోదైంది. అయితే 2018లో జనవరి-మార్చి కాలంలో నిరుద్యోగ రేటు వివరాలు ఈ గణాంకాల్లో లేకపోవడం గమనార్హం. గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి 2019 కాలానికి త్రైమాసిక బులెటిన్‌లో పట్టణ ఉపాధి, ప్రామాణికాలపై అంచనాలతో ఈ గణాంకాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగ రేటు 8.7 శాతం ఉండగా గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో 9 శాతంగా నమోదైంది. ఇక మహిళల్లో నిరుద్యోగ రేటు 11.6 శాతం కాగా గత ఏడాది 12.8 శాతంగా నమోదవడం గమనార్హం. కాగా, 2017-18లో 45 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదవడంతో మోదీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement