
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఒకవైపు కొనసాగుతుండగా.. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. పెట్రో ధర లీటరుకు 15పైసలు పెరగా, డీజిల్ ధర లీచరుకు 22 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర తాజాగా 56 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. డీజిల్ ధరలది కూడా ఇదే ధోరణి . తాజాగా మరో ఆల్‌టైం హైని టచ్ చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ. 74.95,కోలకతా 77.65 రూపాయలు, ముంబైలో 82.79 రూపాయలు, చెన్నైలో 77.77 రూపాయలుగా ఉంది. డీజిల్ ధరలు వరుసగా రూ. 66.36 లీటరు, రూ. 68.9, రూ.70.66, రూ. 70.02గా ఉన్నాయి. మే 15 న ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment