సాక్షి, ముంబై: దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పై రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.19 పెరిగి రూ.61,340కి చేరుకుంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.55,300గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏక ంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 360 గా ఉంది. అటు ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది.
ఇక హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది.
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment