సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్‌లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది.
బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను,
బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్‌లతో సమానంగా సిల్వర్ డోర్, బార్‌లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్‌తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment