సాక్షి, ముంబై: పసిడి ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దూకుడు మీద రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో కాస్త వెనక్కి తగ్గాయి. అయితే సమీప భవిష్యత్తులో స్వర్ణం సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా బ్యాంకుల సంక్షోభం, ఫెడ్ వడ్డీ రేపు పెంపులాంటి బంగారంపై పెట్టుబడిని సురక్షితమైందిగా ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉందని అంచనా వేశారు.
(ఇదీ చదవండి: సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)
ఇది ఇలా ఉంటే బుధవారం బంగారం ధరలు లాభ నష్టాల మధ్య ఇన్వెస్టర్లను ఊరించాయి. ఉదయం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.210 మేర తగ్గి రూ.54,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.240 మేర తగ్గి 59,450 కి చేరింది. మరోవిలువైన మెటల్ వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి రూ.73,000లుగా ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600వద్ద, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 పలుకింది. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.75,700కు చేరింది.
మళ్లీ ఎగిసిన పసిడి ధర
కానీ మధ్యాహ్నం తరువాత పసిడి ధర మళ్లి పుంజుకుంది బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ. 59,670 ఉంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment