volatility
-
వచ్చే వారం ఏమౌతుందో.. పసిడి ప్రియుల్లో టెన్షన్!
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.వచ్చే వారం బంగారం ధర అంచనావచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులుప్రస్తుతం ఇలా..అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. -
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే
ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో డిసెంబర్ 6 నుండి 8 వరకూ జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యింది. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్ ఉద్ఘాటించారు. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది. -
Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?
సాక్షి, ముంబై: పసిడి ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దూకుడు మీద రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో కాస్త వెనక్కి తగ్గాయి. అయితే సమీప భవిష్యత్తులో స్వర్ణం సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా బ్యాంకుల సంక్షోభం, ఫెడ్ వడ్డీ రేపు పెంపులాంటి బంగారంపై పెట్టుబడిని సురక్షితమైందిగా ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉందని అంచనా వేశారు. (ఇదీ చదవండి: సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇది ఇలా ఉంటే బుధవారం బంగారం ధరలు లాభ నష్టాల మధ్య ఇన్వెస్టర్లను ఊరించాయి. ఉదయం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.210 మేర తగ్గి రూ.54,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.240 మేర తగ్గి 59,450 కి చేరింది. మరోవిలువైన మెటల్ వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి రూ.73,000లుగా ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600వద్ద, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 పలుకింది. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.75,700కు చేరింది. మళ్లీ ఎగిసిన పసిడి ధర కానీ మధ్యాహ్నం తరువాత పసిడి ధర మళ్లి పుంజుకుంది బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ. 59,670 ఉంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. -
Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ – అదానీ గ్రూప్ పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్ ఇండెక్స్ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది. ‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్ సంక్షోభం పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ కన్స్ట్రక్షన్ పీఎంఐ డేటా, బ్రిటన్ సీఐపీఎస్ కన్స్ట్రక్షన్ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఆర్బీఐ ఎంసీపీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గతేడాది జూన్ తర్వాత ఒక నెలలో ఎఫ్ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్లో షార్ట్ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. -
ఫెడ్ వడ్డీ పెంపు: నష్టాల్లో స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు.సెన్సెక్స్ 168 పాయింట్లు క్షీణించి 59288 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 17666 వద్ద కొనసాగుతోంది. దాదాపుఅన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, బ్రిటానియా,మారుతి సుజుకి లాభాల్లో ఉన్నాయి. ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, ఓఎన్జీసీ నష్టాల్లో ఉన్నాయి.మరో వైపు డాలరుమారకంలో రూపాయి భారీగా నష్టపోతోంది.ఏకంగా 60 పాయింట్లు పతనమై 80.45 వద్ద రికార్డ్ లోను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్‌పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్‌ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్‌కే పరిమితం కావాలి. -
రూపాయి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు
ముంబై: వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. డాలర్‌తో రూపాయి 80కు పడిపోవడం, రానున్న రోజుల్లో ఇంకొంత క్షీణిం చొచ్చంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. రూపాయిలో అస్థిరతలు, ఎత్తు పల్లాలను ఆర్బీఐ చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంకు చర్యల వల్లే రూపాయి ప్రయాణం సాఫీగా ఉందన్నారు. రూపాయి ఈ స్థాయిలో ఉండాలనే ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ పెట్టు కోలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు యూఎస్ డాలర్లను సరఫరా చేస్తూ తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తున్నట్టు చెప్పారు. విదేశీ రుణాలకు సంబంధించి హెడ్జింగ్ చేయకపోవడంపై ఎటువంటి హెచ్చరికలు అవసరం లేదన్నారు. విదేశీ రుణాల్లో ఎక్కువ ఎక్స్పోజర్ ప్రభుత్వరంగ సంస్థలకే ఉందని చెబుతూ.. అవసరమైతే ప్రభుత్వం సాయంగా నిలుస్తుందన్నారు. 2016లో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ రంగ ప్రయోజనాల రీత్యా దీన్నే కొనసాగిస్తామని శక్తికాంతదాస్ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి పరిమితం చేయాలన్నది ఈ కార్యాచరణలో భాగం. ప్రతికూల సమయాల్లో దీనిని ప్లస్2, మైనస్2 దాటిపోకుండా చూడడం లక్ష్యం. ఆర్థిక వ్యవస్థ సాఫీగా.. ‘‘నిర్ణీత కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కుదురుకునేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అదే సమయంలో వృద్ధిపై పరిమిత ప్రభావం ఉండేలా చూస్తాం’’అని ఆర్బీఐ గవర్నర్ భరోసా ఇచ్చారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్టాలను తాకిందంటూ, ఆగస్ట్‌లో జరిగే ఎంపీసీ భేటీలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను సమీక్షిస్తామని చెప్పారు. యూరోప్‌లో (ఉక్రెయిన్‌పై) యుద్ధం కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. కమోడిటీ ధరలు, చమురు ధరలు పెరిగి పోయాయి. వీటి ప్రభావం మనపై పడింది. అదే సమయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీని కఠిన తరం చేయడం వల్ల ఆ ప్రభావాలు మననూ తాకాయి. పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం, కరెన్సీ విలువ క్షీణత ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణలో లేనివి. లిక్విడిటీ, పాలసీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, వాటి ప్రభావం వృద్ధిపై, ఆర్థిక వ్యవస్థ రివకరీపై ఏ మేరకు ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకునే చేస్తాం’’అని శక్తికాంతదాస్ వివరించారు. ప్రస్తుతం ఆర్బీఐముందున్న ప్రాధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, తర్వాత వృద్ధికి మద్దతుగా నిలవడమేనని చెప్పారు లైసెన్స్ ఉన్న సేవలకే పరిమితం డిజిటల్ రుణ సంస్థలు లైసెన్స్ పొందిన సేవలకే పరిమితం కావాలని శక్తికాంతదాస్ సూచించారు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనలు ఆమోదనీయం కాదని తేల్చి చెచెప్పారు. లైసెన్స్ పరిధికి వెలుపల ఏ సేవలకు అయినా తమ ఆమోదం కోరాలని సూచించారు. ఆమోదం లేకుండా వీటిని నిర్వహించడం వల్ల వ్యవస్థలో రిస్క్ పెరుగుతుందంటూ, అందుకు తాము అవకాశం ఇవ్వబోమన్నారు. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసే నాన్ బ్యాంకింగ్ సంస్థలు వ్యాలెట్లను, కార్డులను క్రెడిట్ సదుపాయాలతో లోడ్ చేసుకోవడం కుదరదంటూ ఆర్బీఐ గత నెలలో ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు సెంట్రల్ బ్యాంకు మద్దతు ఇస్తుంది. కానీ, అదే సమయంలో మొత్తం వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో, నియంత్రణల మధ్య వృద్ధి చెందాల్సి ఉంటుంది. అందుకని ఆర్థిక స్థిరత్వం విషయంలో రాజీపడేది లేదు’’అని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. నియంత్రణలో లేని, లైసెన్స్‌లు లేని ఎన్నో సంస్థలు ఎన్నో రకాల రుణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు దాస్ చెప్పారు. ‘‘ఈ అంశంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించాం. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తాం’’అని తెలిపారు. -
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
రోజంతా ఊగిసలాటే: రియల్టీ, మెటల్ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి దాదాపు 200 పాయింట్లకుపైగా సెన్సెక్స్ 53 వేల ఎగువకు చేరింది. కానీ అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఇదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 52693, 15732 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు నష్టంతో 15732 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ మినహా మిగిలిన రంగాలు నష్టపోయాయి. బజాజ్ ఆటో, ఇండస్ బ్యాంకు, ఓఎన్జీసీ, హిందాల్కో, టెక్ మహీంద్ర నష్టపోగా ఎన్టీపీసీ, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, దివీస్ లాభపడ్డాయి. -
లాభాల రింగింగ్: సెన్సెక్స్, నిఫ్టీ హైజంప్
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లతో దాదాపు 300 పాయింట్ల మేర రీబౌండ్ అయ్యాయి. ఆరంభంలో సోమవారం నాటి అమ్మకాల ఒత్తిడి మంగళ వారం కూడా కొనసాగింది. ట్రేడింగ్ స్టార్టింగ్‌లో దాదాపు 100 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 52794వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నీరసించి 15753 వద్ద కొనసాగినా ఆ తరువాత భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 53040 వద్ద, నిప్టీ కూడా 65 పాయింట్లు లాభపడి 15835 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మెటల్ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్, బజాజ్ ఆటో, రిలయన్స్ నష్టపోతుండగా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, విప్రో లాభపడు తున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి అల్ టైం కనిష్టం నుంచి తేరుకుంది. డాలరు మారకంలో ఆరంభంలో 2 పైసలు ఎగిసి ప్రస్తుతం 78.05 వద్ద ఉంది ఫెడ్ రేటు పెంపుదల ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారుకోనుందనే భయాలతో వాల్ స్ట్రీట్ లో కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అలాగే దేశీయంగా అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతంతో ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. -
కల్లోలంలో కుదురుగా ఉంటేనే..!
పుష్కలమైన లిక్విడిటీతో మంచి రాబడులను ఇచ్చే మెరుగైన సాధనం ఏదైనా ఉందంటే అది ఈక్విటీయే. కానీ, ఈక్విటీలన్నవి అస్థిరతల నడుమ తిరుగుతుంటాయి. సానుకూల పరిణామాలకు పొంగిపోయినట్టే.. ప్రతికూలతల్లో పతనాలను చూస్తుంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నాం..? అన్నదే రాబడులను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లో మన స్థానాన్ని పరీక్షిస్తుంది. జనవరి 17న సెన్సెక్స్ 61,475. మే 9న 54,470కు దిగొచ్చింది. మార్చి 8న 52,261 కనిష్ట స్థాయి వరకూ వెళ్లిన సెన్సెక్స్, అక్కడి నుంచి మార్చి 31 నాటికి 58,891కు చేరింది. మళ్లీ ఇప్పుడు వెనుక చూపులు చూస్తోంది. ఈ అస్థిరతలకు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తున్నారన్నది ఈక్విటీ పెట్టుబడులకు కీలకం అవుతుంది. ఈ తరహా అశాంతి, ఆందోళనకు గురిచేసే ఈక్విటీ కల్లోల పరిణామాల్లో సాధారణ ఇన్వెస్టర్లు ఏం చేస్తే మెరుగ్గా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది. 2020 మార్చిలో సెన్సెక్స్ 29,468 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్క నెలలోనే 9,442 పాయింట్లు కోల్పోయింది. ఇది 24 శాతానికి సమానం. మార్కెట్లు పడినప్పుడే ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూసే ఇన్వెస్టర్లు కొందరు ఉంటారు. వీరికి 2020 మార్చి–ఏప్రిల్ కరోనా క్రాష్ మంచి అవకాశం. తమ దగ్గరున్న మిగులు నిల్వలను పెట్టుబడిగా పెట్టుకున్నారు. అయితే, ప్రతీ మార్కెట్ పతనాన్ని పెట్టుబడులకు చక్కని అవకాశంగా తీసుకోవడం సాధ్యపడదు. అలాగే, మార్కెట్ గరిష్టాలను సరిగ్గా అంచనా వేసి అక్కడ విక్రయించడం కూడా ఎక్కువ సందర్భాల్లో అసాధ్యమే. మంచి అవకాశం తలుపుతట్టినా ఆ సమయంలో ఇన్వెస్టర్ ఎలా స్పందించాడన్నది కీలకం అవుతుంది. 2020 మార్కెట్ పతనం సమయంలో మెజారిటీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. మార్కెట్లు ఇంకా పడిపోతాయని అనుకున్నారు. మెజారిటీ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేశారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక దశ నుంచి మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అదే ఏడాది చివరికి దాదాపు నష్టాలన్నింటినీ భర్తీ చేసుకున్నాయి. మార్కెట్లు అంచనాలకు భిన్నంగా అలా పెరిగేసరికి అక్కడి నుంచి మళ్లీ పడిపోతాయన్న అంచనాలు వినిపించాయి. దీంతో సెన్సెక్స్ 40వేల స్థాయికి చేరగానే కొందరు పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. కానీ, ఏమైంది..? మార్కెట్లు అక్కడి నుంచి పడిపోలేదు. మరో 50 శాతం పెరిగి 60,000కు చేరింది సెన్సెక్స్. ‘‘మార్కెట్లు ఎగిసిపడడం సర్వసాధారణం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా వాటిని చూసి అనవసరంగా మన పెట్టుబడులను విక్రయించడం లేదా కొనుగోలు చేస్తే గాయాలపాలు కావాల్సి వస్తుంది’’అన్నది నిపుణుల సూచన. మార్కెట్ల గరిష్ట స్థాయి ఇది, కనిష్ట స్థాయి ఇది.. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయి.. ఇక్కడి నుంచి పడిపోతాయి.. ఈ తరహా అంచనాలు (మార్కెట్ టైమింగ్) వేసుకోవడం సరైన విధానం కానే కాదు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది అనుసరణీయం కాదు. ఎక్కువ సందర్భాల్లో అంచనాలు తప్పి, ర్యాలీలు మిస్ అయిపోవచ్చు. ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చేజార్చుకుని, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద అడుగు పెట్టొచ్చు. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసి కొనసాగడమే సరైన విధానం అవుతుంది. తరచూ పెట్టుబడులను మార్చే విధానం వారికి పెద్దగా కలసి రాదు. క్రమం తప్పకుండా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించాలి. ‘‘మార్కెట్లలో పతనాల కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం మార్కెట్ పతనంలో పెట్టుబడి పెట్టాలని చూసే వారికి మేమిచ్చే సలహా ఒక్కటే. ఒకే విడత పెట్టుబడి పెట్టకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి చేసుకోవడమే మెరుగైన మార్గం. మీరు నిర్ణయించుకున్న అస్సెట్ అలోకేషన్ విధానానికి అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ‘క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్’ ఈక్విటీ ఫండ్ మేనేజర్ సార్బ్ గుప్తా సూచించారు. అస్థిరతలు.. అవకాశాలు మార్కెట్లలో అస్థిరతలు నిజానికి ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టే అవకాశాలుగా అర్థం చేసుకోవాలి. అందరూ ఎగబడి కొంటుంటే విక్రయించడం.. అందరూ ఆందోళనతో విక్రయిస్తుంటే కొనుగోలు చేయడం అన్న వారెన్ బఫెట్ సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. అస్సెట్ అలోకేషన్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మార్కెట్లు పడిపోతుంటే స్టాక్స్ చౌక ధరలకే లభిస్తాయి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కూడా ఎక్కువ సొంతం చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు రూ.1,000ను ఒక పథకంలో రూ.11 ఎన్ఏవీ వద్ద ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. అప్పుడు 90.90 యూనిట్లు వస్తాయి. ఏడాది చివరికి అదే ఎన్ఏవీ రూ.13కు వెళితే 18.18 శాతం రాబడి వచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.9కు దిగిపోతే అప్పుడు మరో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే 111.11 యూనిట్లు వస్తాయి. మొత్తం రూ.2,000 పెట్టుబడికి వచ్చిన యూనిట్లు 202. అప్పుడు ఎన్ఏవీ రూ.13కు చేరిందనుకోండి రాబడి రేటు 31.30 శాతంగా ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ కానీ, సిప్ విధానంలో కానీ ఈ విధమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. సమాచారం విషయంలో జాగ్రత్త ఈక్విటీలకు సంబంధించి ఎంతో సమాచారం డిజిటల్ వేదికలపై ప్రసారమవుతుంటుంది. ఒకప్పటితో పోలిస్తే నేడు అధిక సమాచార వ్యాప్తి ఇన్వెస్టర్లను కుదురుగా ఉండనీయడం లేదు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌లో సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం తప్పటడుగులకు దారితీయకుండా చూసుకోవాలి. అవసరమైన సమాచారానికే పరిమితం కావాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిందన్న సమాచారం వెలుగు చూడగానే కంగారుగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించేసిన ఇన్వెస్టర్లు ఉన్నారు. విక్రయించడం సులభమే. కానీ, ఈ పెట్టుబడిని మళ్లీ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తామన్నది కూడా రాబడులను నిర్ణయిస్తుంటుంది. యుద్ధం వల్ల మొత్తం మార్కెట్ కంటే కూడా విడిగా కొన్ని కంపెనీలపై ప్రభావం భిన్నంగా ఉంటుంది. ‘‘ఒక కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ స్వల్ప కాలంలో ఆ కంపెనీ షేరు ధర పడిపోవచ్చు. కానీ, అది తాత్కాలికమే. దీర్ఘకాలంలో అదే తీరు కొనసాగదు. మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, పరిశ్రమ భవిష్యత్తు అంచనాలు, యాజమాన్యం నాణ్యత, ప్రమోటర్, కార్పొరేట్ చర్యలు ఇలా ఎన్నో అంశాలు షేర్ల ధరలను, మార్కెట్ విలువను ప్రభావితం చేస్తుంటాయి’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్కామత్ పేర్కొన్నారు. ఒక కంపెనీ షేరు ధర ఎప్పటికైనా దాని వ్యాపార, ఆర్థిక మూలాలకు తగ్గట్టు నడుచుకోవాల్సిందేనన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు కంపెనీ ఆర్థిక, వ్యాపార బలాలు, ఇతర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి తప్పించి, తాత్కాలికంగా వినిపించే వార్తలు, సమాచారంతో అయోమయానికి గురి కాకూడదు. పెట్టుబడి కాల వ్యవధి కూడా ఈ తరహా సమాచారంపై ఆధారపడాలా? లేదా అన్నది నిర్ణయించుకోవడానికి మార్గదర్శి అవుతుంది. ‘‘ఉదాహరణకు మూడేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేశారనుకోండి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి వార్తలు రణగొణధ్వనే అవుతుంది. ఒకవేళ మూడు నెలల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు ప్రస్తుత యద్ధం సంక్షోభ పరిణామాలకు స్పందించాల్సి ఉంటుంది’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ పీఎంఎస్ ఫండ్ మేనేజర్ శ్రేయి లూంకర్ వివరించారు. యుద్ధం కంపెనీ వ్యాపార నమూనానే దెబ్బతీస్తుందా? లేక తాత్కాలిక ప్రభావం చూపిస్తుందా? అన్నది తేల్చుకున్న తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి. కాల వ్యవధి కీలకం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీలు మంచి పనితీరు చూపించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే స్వల్పకాలంలో ఆటుపోట్ల కారణంగా పెట్టుబడికి నష్టం ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో అస్థిరతలను ఎదుర్కొన్నా.. సుదీర్ఘ బాటసారిగా మార్కెట్లు ముందుకే ప్రయాణం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా సంక్షోభ సమయాల్లో ఈక్విటీ మార్కెట్లు సగం మేర వాటి విలువను కోల్పోయాయి. కానీ, ఈ రెండు సందర్భాల తర్వాతి కాలంలో మార్కెట్లు మళ్లీ లేచి నిలబడ్డాయి. స్వల్పకాలంలో గణాంకాలు నిరాశకు గురి చేయవచ్చు. దీర్ఘకాలంలో పనితీరు ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఈక్విటీల తీరు అలా ఉంటుంది. గడిచిన మూడు నెలల కాలంలో నిఫ్టీ 100, బీఎస్ఈ 500 సూచీల రాబడి 0.75 శాతం, 1.23 శాతం కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటుగానే ఉంది. కానీ, గత ఐదేళ్ల కాలంలో చూస్తే వీటి కాంపౌండెడ్ వార్షిక వృద్ధి 15 శాతంగా ఉంది. ఈక్విటీ పెట్టుబడి అంటే.. ఏదో ఒక స్టాక్‌లో ఒక ధర వద్ద ఇన్వెస్ట్ చేసి, నిర్ణీత శాతం పెరిగిన తర్వాత విక్రయించడం అని కాదు. ఒక వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నట్టు. ఆ వ్యాపారానికి దీర్ఘకాలంలో ఉన్న వృద్ధి అవకాశాలను చూడాలి. వాటి ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆ వ్యాపారం వృద్ధి సాధిస్తున్న కొద్దీ అది షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అంతిమంగా పెట్టుబడి మంచి వృద్ధిని చూస్తుంది. కనుక ఈక్విటీలను ఎప్పుడూ దీర్ఘకాల పెట్టుబడి సాధనంగానే చూడాల్సి ఉంటుంది. స్వల్పకాల దృష్టితో చూసే వారికి డెట్ సాధనాలే మార్గం. రీబ్యాలెన్సింగ్ కీలకం... అస్సెట్ అలోకేషన్ ప్రణాళికను మార్కెట్ల అస్థిరతల సమయాల్లో లేదా ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్సింగ్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీ వ్యాల్యూయేషన్ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఉండాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ల అస్థిరతల్లో ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల విలువలో 40 శాతానికి పడిపోయిందనుకోండి. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి వచ్చే విధంగా ఇతర విభాగాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ పట్ల క్రమశిక్షణగా నడుచుకుంటే దీర్ఘకాలంలో ఆ ప్రయోజనం ఏంటో స్వయంగా కళ్లజూస్తారు. అంతేకాదు, మార్కెట్లు బాగా ర్యాలీ చేసిన సందర్భాల్లో ఈక్విటీల వ్యాల్యుయేషన్ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 70 శాతానికి చేరిందనుకుంటే.. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి దిగి వచ్చే విధంగా కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. వాటిని ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్స్ అంటారు. దీనివల్ల ఒక విభాగంలో వచ్చే ఆటుపోట్లను అవకాశంగా తీసుకుని అదనపు పెట్టుబడులు పెట్టడం.. ఒక విభాగంలో అధిక వృద్ధి నుంచి లబ్ధి పొందడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అస్సెట్ అలోకేషన్ అంటే వైవిధ్యం అని కూడా అర్థం చేసుకోవాలి. ఒకే చోట పెట్టుబడులు అన్నింటినీ పెట్టకుండా వైవిధ్యం పాటించడం. అలాగే, విడిగా ఆయా విభాగాల్లోనూ వైవిధ్యాన్ని పాటించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీల్లో ఒకే రంగంలో, ఒకే విభాగంలో (లార్జ్/మిడ్/స్మాల్‌క్యాప్) కాకుండా వర్గీకరించుకోవాలి. ఈక్విటీ మార్కెట్ల సహజ తీరును అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో కోరుకుంటున్న రాబడి రేటు, కావాల్సిన నిధి, ఏ మేరకు పెట్టుబడులు పెట్టగలరు వీటన్నింటినీ విశ్లే షించుకుని చక్కని అస్సెట్ అలోకేషన్ ప్రణాళిక వేసుకుంటే.. ఇక మార్కెట్లు ఎలా స్పందించినా.. అది చూసి ఇన్వెస్టర్‌గా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పోర్ట్‌ఫోలియో మీరు ఆశించిన మేర ఫలితాలను ఇచ్చే విధంగా రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. అస్సెట్ అలోకేషన్.. మార్కెట్లు ఏ స్థాయిలో ఉంటే మనకు ఎందుకు..? అస్సెట్ అలోకేషన్ ప్రణాళికకు అనుగుణంగా పెట్టుబడుల క్రమం కొనసాగాలన్నది నిపుణుల సూచన. అస్సెట్ అలోకేషన్ అన్నది వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఎంత కాలం పాటు పెట్టుబడులు పెట్టగలరు, కొనసాగించగలరు, ద్రవ్యోల్బణం, అస్థిరతలు ఇత్యాది అంశాల ఆధారంగా ఎవరికి వారే తమకు అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులకు.. డెట్, బంగారంలోని పెట్టుబడులు అస్థితరలకు రక్షణగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లు కుదేలైన సందర్భాల్లో పోర్ట్‌ఫోలియోలో వాటి విలువ సహజంగానే పడిపోతుంది. అదే సమయంలో బంగారం, డెట్ ఫండ్స్‌లోని పెట్టుబడుల రూపంలో కొంత రక్షణ ఉంటుంది. ఈక్విటీల షాక్‌లను తట్టుకునేందుకు ఇలా భిన్న సాధానాలతో అస్సెట్ అలోకేషన్ ఉండాలి. గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే పెట్టెలో పెట్టకూడదన్నదే అస్సెట్ అలోకేషన్‌కు మూలం. ఈక్విటీ, డెట్, ఇతర సాధనాల మధ్య సమతూకం పాటించాలి. ఎక్కువ రాబడులను ఇస్తుంది కదా అని ఈక్విటీలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. డెట్ ఫండ్స్‌లో రాబడులు చాలా తక్కువగా ఉన్నా సరే పెట్టుబడి కాపాడుకునే వ్యూహంలో భాగంగా కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకూ కేటాయించుకోవాల్సిందే. ఈ విధమైన సమతూకం లేకపోతే మార్కెట్ల పతనాల్లో ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందన్న నిపుణుల హెచ్చరిక. -
స్టాక్మార్కెట్లో అస్థిరత
ముంబై : స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఉదయం నుంచే లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఊగిసలాడుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ స్థిరంగానే ఉంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 52,919 పాయింట్ల వద్ద ప్రారంభమై గరిష్టంగా 53,006 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత నష్టపోతూ ఉదయం పది గంటల సమయానికి 52,805 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 15,819 పాయింట్ల దగ్గర మొదలై 15,850 పాయింట్లకు చేరకుంది. ఉదయం పదిగంటల సమయంలో మొత్తగా 10 పాయింట్లు నష్టపోయి 15,880 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈరోజు ఏషియన్ పేయింట్స్, టాటాస్టీల్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ లాభపడగా మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ లీవర్, టైటాన్ షేర్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు క్లెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జీ ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఐపీవోకు రానున్నాయి. -
మూడు నెలలైనా ఆగాల్సిందే : కేఎం బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: దూకుడు మీదున్న ఫైనాన్షియల్ మార్కెట్లలో పొంగు ఎంతమేరకు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఇదే ఉత్సాహం కొనసాగుతుందా, లేదా అన్నది తెలియాలంటే కనీసం మరో త్రైమాసికం అయినా వేచి చూడాలన్నారు. గడిచిన ఏడాది గురించి మాట్లాడుతూ..కరోనా మహమ్మారి ఎంతో నష్టానికి కారణమైందన్నారు. వ్యక్తిగత జీవితంలో అయినా, వ్యాపారంలో అయినా కోమార్బిడిటీల (ఒకటికి మించిన సమస్యలు)ను నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు.సంక్షోభాల నుంచి బలంగా అవతరించేందుకు విజ్ఞాన నిల్వలు, ఆలోచనలు, సహకారం, మంచి పేరును సంపాదించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎక్కువ మంది సమర్థిస్తున్న తరుణంలో.. కార్యాలయ ప్రాధాన్యం గురించి బిర్లా మాట్లాడారు. కార్యాలయం అన్నది ఉద్యోగులు వచ్చి పనిచేసే కేవలం ఒక స్థలం మాత్రమే కాదని.. ప్రజలు, ఆలోచనలు, సంభాషణలన్నింటినీ కరిగించి, ఫలితాన్ని వెలికితీసే వేదికగా పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పరుగు ఎంత కాలం పాటు కొనసాగుతుందీ చెప్పాలంటే, కనీసం మరో మూడు నెలలు చూస్తే కానీ చెప్పలేమన్నారు. అప్‌ట్రెండ్ పరిమితమే: బీఓఎఫ్ఐ అంచనా కాగా, భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అప్‌సైడ్ ట్రెండ్ కొంతకాలమే ఉంటుందని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. నిఫ్టీ 15వేల మార్కుని అందుకున్నప్పటికీ.., ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ స్థాయిలోపే ట్రేడ్ అవుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఆర్థిక, మెటల్, స్టీల్ రంగాలపై ‘‘ఓవర్‌వెయిట్’’ వైఖరిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. -
ఒడిదొడుకులతో షురూ- ఫార్మా ప్లస్‌లో
అంచనాలకు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్లు క్షీణించి 39,517కు చేరగా.. నిఫ్టీ 13 పాయింట్లు తక్కువగా 11,649 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,633-39,451 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,680- 11,629 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. సహాయక ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ వెనకడుగు వేయడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు దేశీయంగా ఇటీవల మార్కెట్లు భారీ ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, మీడియా రంగాలు 1 శాతం స్థాయిలో నీరసించగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో 0.6-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, కోల్ ఇండియా, యాక్సిస్, టాటా మోటార్స్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ 3.7-0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే దివీస్, బ్రిటానియా, యూపీఎల్, ఆర్ఐఎల్, టీసీఎస్, హీరో మోటో, ఓఎన్జీసీ, సిప్లా, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, మారుతీ 1.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, మణప్పురం, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎంజీఎల్, ముత్తూట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఐడియా, పీవీఆర్, పెట్రోనెట్, ఫెడరల్ బ్యాంక్ 2.5-1.5 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. మరోపక్క మారికో, జీఎంఆర్, ఇన్ఫ్రాటెల్, భారత్ ఫోర్జ్, టాటా పవర్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ ప్రు 2.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 943 నష్టపోగా.. 638 లాభాలతో ట్రేడవుతున్నాయి. -
నేడు ఆటుపోట్ల మధ్య ఓపెనింగ్?!
నేడు(23న) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 10 పాయింట్లు తక్కువగా 11,167 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,177 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. తిరిగి టెక్నాలజీ దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5-1.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. గురువారం సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు మరోసారి ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 38,000 దిగువకు రెండో రోజూ మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 292 పాయింట్లు క్షీణించి 37,742 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,058 పాయింట్ల వద్ద, తదుపరి 10,963 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,276 పాయింట్ల వద్ద, ఆపై 11,398 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,907 పాయింట్ల వద్ద, తదుపరి 20,675 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,422 పాయింట్ల వద్ద, తదుపరి 21,705 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేడు ఫ్లాట్ ఓపెనింగ్- ఆపై ఆటుపోట్లు?!
నేడు(18న) దేశీ స్టాక్ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 17 పాయింట్లు పుంజుకుని 11,544 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,527 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో సింగపూర్ మినహా.. మిగిలిన మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 39,000 దిగువకు సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పతనమై 39,000 మార్క్ దిగువన 38,980 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 88 పాయింట్ల వెనకడుగుతో 11,516 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,235-38,926 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,587-11,499 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,481 పాయింట్ల వద్ద, తదుపరి 11,445 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,569 పాయింట్ల వద్ద, ఆపై 11,623 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,223 పాయింట్ల వద్ద, తదుపరి 22,127 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,461 పాయింట్ల వద్ద, తదుపరి 22,601 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నష్టాల నుంచి నేడు తొలుత రీబౌండ్?!
వరుస నష్టాల నుంచి నేడు(10న) దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 11,321 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,307 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలలో మూడు రోజుల భారీ అమ్మకాలకు బుధవారం చెక్ పడింది. దీంతో యూఎస్ మార్కెట్లు జంప్‌చేశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఇటీవల ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్లు నేడు హుషారుగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు కొంతమేర సెంటిమెంటును దెబ్బతీయవచ్చని అభిప్రాయపడ్డారు. మళ్లీ నష్టాలు బుధవారం రోజంతా నేలచూపులకే పరిమితమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 38,194 వద్ద నిలవగా.. నిఫ్టీ 39 పాయింట్లు తక్కువగా 11,278 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మిడ్‌సెషన్‌కల్లా 37,935 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆపై కొంతమేర కోలుకుంటూ వచ్చి చివర్లో 38,253కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,298-11,185 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,209 పాయింట్ల వద్ద, తదుపరి 11,141 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,322 పాయింట్ల వద్ద, ఆపై 11,367 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,047 పాయింట్ల వద్ద, తదుపరి 21,826 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,521 పాయింట్ల వద్ద, తదుపరి 22,775 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. అమ్మకాల బాటలో నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
నేలచూపులతో నేడు మార్కెట్లు?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(9న) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 11,261 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,302 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మరోసారి టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు తలెత్తడంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లన్నీ బలహీనంగా కదులుతున్నాయి. యూఎస్ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలు మళ్లీ దేశీ స్టాక్ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు లోనుచేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చివర్లో అమ్మకాలు మంగళవారం ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ సైతం 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,259 పాయింట్ల వద్ద, తదుపరి 11,202 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,406 పాయింట్ల వద్ద, ఆపై 11,495 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,569 పాయింట్ల వద్ద, తదుపరి 22,394 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,992 పాయింట్ల వద్ద, తదుపరి 23,239 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల వెనకడుగు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇదే విధంగా గడిచిన శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
చివర్లో అమ్మకాలు- ఐటీ ఇండెక్స్ రికార్డ్
ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. అయితే చివరి అర్ధగంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో చతికిలపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. వెరసి 500 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాలు, యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూసినట్లు నిపుణులు తెలియజేశారు. ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ఐటీ 1.2 శాతం పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ 3-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇంట్రాడేలో ఐటీ ఇండెక్స్ 18,672 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! ఏప్రిల్ నుంచి ఈ రంగం 46 శాతం ర్యాలీ చేసింది. 26 రంగాలలో ఐటీ రంగం మాత్రమే కోవిడ్-19 సవాళ్లకు ఎదురు నిలవగలిగినట్లు కేవీ కామత్ కమిటీ తాజాగా పేర్కొనడం ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్ఫ్రాటెల్ పతనం నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా 2.7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫ్రాటెల్ 8 శాతం పతనంకాగా.. జీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్, ఎయిర్టెల్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌పీ లైఫ్ 4.7-1.7 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 8.5 శాతం కుప్పకూలగా.. పీవీఆర్, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, సెయిల్, అపోలో టైర్, జీఎంఆర్, ఎన్ఎండీసీ, నాల్కో, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్ 6-4 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్ సీపీ, పిరమల్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, ఎస్బీఐ లైఫ్, సీఫోర్జ్ 4.3-0.7 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1717 నష్టపోగా.. 978 మాత్రమే లాభపడ్డాయి. అమ్మకాల బాట నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కేవలం రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే -
రోజంతా ఒడిదుకుడులు చివరికి లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలతో రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివరికి లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్, 60 పాయింట్ల లాభంతో 38417 వద్ద, నిఫ్టీ 21పాయింట్ల లాభంతో 11355 వద్దముగిసాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్లు,అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్ సీ, డా. రెడ్డీస్, హెచ్ యూఎల్, టీసీఎస్, జీ, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎంఅండ్ఎం, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఒఎన్జీసీ, సిప్లా, హీరో మోటో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా కొత్త బ్రాండింగ్ వార్తలతో భారీ లాభాలను దక్కించుకుంది. -
ఆద్యంతం ఆటుపోట్లు- స్వల్ప లాభాలతో సరి
నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు బలపడి 38417 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,520 వద్ద గరిష్టాన్ని తాకగా, 38,061 దిగువన కనిష్టాన్నీ చేరింది. నిఫ్టీ సైతం 11,381- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. వారాంతాన వరుసగా రెండు రోజు యూఎస్ మార్కెట్లు పతనంకావడం, చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రియల్టీ వీక్ ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా 0.6-0.3 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ప్రాటెల్ 6 శాతం జంప్‌చేయగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, యాక్సిస్, జీ, విప్రో 3.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎంఅండ్ఎం, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఎన్టీపీసీ, హీరో మోటో, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, శ్రీ సిమెంట్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, సిప్లా, ఎల్అండ్టీ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్ 3.6-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఐడియా జోరు డెరివేటివ్స్‌లో ఐడియా, హావెల్స్, ఏసీసీ, బాష్, వేదాంతా, మదర్సన్, టీవీఎస్ మోటార్, సన్ టీవీ, బీవోబీ, అంబుజా, ఐసీఐసీఐ ప్రు, మైండ్‌ట్రీ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు టాటా కన్జూమర్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, చోళమండలం, ఎస్కార్ట్స్, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్,పీవీఆర్ 4.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.2 శాతం బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1491 నష్టపోగా.. 1227 లాభాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,889 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 457 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! గురువారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 8 కోట్లు, డీఐఐలు స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లు: నేడు గ్యాప్‌డౌన్ ఓపెనింగ్?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(4న) పతనం(గ్యాప్‌డౌన్)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 11,422 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,550 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం యూఎస్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలనుంచి కుప్పకూలాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. జీడీపీ పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో మూడు రోజులుగా ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు నేడు మరోసారి బలహీనంగా కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లాభాలతో మొదలై గురువారం తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యధాప్రకారం ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు క్షీణించి 38,991 వద్ద నిలవగా.. నిఫ్టీ 8 పాయింట్లు తక్కువగా 11,527 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,236- 38,943 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,508 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,475 పాయింట్ల వద్ద, తదుపరి 11,423 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,573 పాయింట్ల వద్ద, ఆపై 11,617 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,304 పాయింట్ల వద్ద, తదుపరి 23,078 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,904 పాయింట్ల వద్ద, తదుపరి 24,278 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐలు సైలెంట్ గురువారం నగదు విభాగంలో ఇటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 8 కోట్లు, అటు దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.