
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఓలటైల్‌గా ప్రారంభమయ్యాయి. లాభనష్టల మధ్య ఊగిసలాడుతున్న కీలక సూచీల్లో ఒక దశలో 80పాయింట్లకు కోల్పోయిన సెన్సెక్స్65 పాయింట్ల లాభంతో 34,913 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,611 వద్ద ఉంది. చైనాతో వాణిజ్య వివాదానికి తెరపడనుందన్న వార్తలతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. అయితే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటులో ని ప్రతిష్టంభన దేశీయంగా కొంతమేర సెంటిమెంటు బలంగా లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ లాభాల్లో ఉండగా ఆటో, ఫార్మా రంగాలు నష్టపోతున్నాయి. మారుతీ, సన్ ఫార్మా, ఐబీ హౌసింగ్, యూపీఎల్, హీరోమోటో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, జీ, సిప్లా, కొటక్ బ్యాంక్ నష్టాల్లోనూ, అల్ట్రాటెక్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, వేదాంతా లాభాల్లోనూకొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి సోమవారం మరింత దిగజారింది. 0.07పైసలు నష్టపోయి 68.08 వద్ద ఉంది. పసిడి మాత్రం కొలుకుని ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. 31,097వద్ద ఉంది