సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఎఫ్‌అండ్‌ఓ గడువు ముగిసే రోజు.సెన్సెక్స్ 168 పాయింట్లు క్షీణించి 59288 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 17666 వద్ద కొనసాగుతోంది. దాదాపుఅన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి.
అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, బ్రిటానియా,మారుతి సుజుకి లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐలైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, ఓఎన్జీసీ నష్టాల్లో ఉన్నాయి.మరో వైపు డాలరుమారకంలో రూపాయి భారీగా నష్టపోతోంది.ఏకంగా 60 పాయింట్లు పతనమై 80.45 వద్ద రికార్డ్ లోను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్‌పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment