
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి దాదాపు 200 పాయింట్లకుపైగా సెన్సెక్స్ 53 వేల ఎగువకు చేరింది. కానీ అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఇదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 52693, 15732 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు నష్టంతో 15732 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ మినహా మిగిలిన రంగాలు నష్టపోయాయి.
బజాజ్ ఆటో, ఇండస్ బ్యాంకు, ఓఎన్జీసీ, హిందాల్కో, టెక్ మహీంద్ర నష్టపోగా ఎన్టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, దివీస్ లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment