సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి. ఒడిదొడుకులతో ప్రారంభమైన కొనుగోళ్లతో బలపడి ప్రస్తుతం సెన్సెక్స్ 176 పాయింట్లు ఎగిసి 35,318 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 10,626 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఒక దశలో 200 పాయింట్లు మేర సెన్సెక్స్ పుంజుకుంది. ఈ హెచ్చుతగ్గుల ధోరణి మాత్రం కొనసాగుతోంది.
ఐటీ, రియల్టీ, ఆటో రంగాలు లాభపడుతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టైటన్, టెక్ మహీంద్రా, ఐషర్, హీరోమోటో, ఇన్‌ఫోసిస్, మారుతీ, యాక్సిస్, ఎయిర్‌టెల్ టాప్ విన్నర్స్‌గా ఉండగా, యస్‌బ్యాంక్, గ్రాసిమ్, ఐబీ హౌసింగ్‌అల్ట్రాటెక్, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా, గెయిల్, బీపీసీఎల్ నష్టపోతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రుపీ గురువారం కూడా బలపడింది. ఆరంభంనుంచి పాజటివ్‌గా ఉన్న రూపాయి డాలరు మారకంలో 33 పైసల లాభంతో 71.99 స్థాయికి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment