ముంబై: అధిక వాల్యూయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాల్ని కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 412 పాయింట్లు పెరిగి 67,539 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 20,110 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది.
చివరికి 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద నిలిచింది. యుటిలిటీ, పవర్, టెలికం, రియల్టి, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, మౌలిక రంగ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 4%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3% చొప్పున నష్టపోయాయి. ఇరు సూచీలకు ఈ ఏడాది అతిపెద్ద పతనం కావడం గమనార్హం.
చివరి రోజు నాటికి ఈఎంఎస్ లిమిటెడ్ ఐపీఓ 75.28 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.07 కోట్ల షేర్లను జారీ చేయగా, 81.21 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 29.79 రెట్లు సబ్ర్‌స్కిప్షన్ సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment