
సాక్షి,ముంబై: విదేశీ సంకేతాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. అయితే మళ్లీ అమ్మకాలు పెరగడంతో ప్రస్తుతం 31 పాయింట్లు క్షీణించి 36,077కు చేరగా, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,813 వద్ద ట్రేడవుతోంది.
రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ లాభాల్లోనూ, ఆటో, మెటల్ రంగాలు నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఐఎల్, ఐటీసీ, హెచ్‌పీసీఎల్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ లాభాల నార్జిస్తుండగా, ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్, యూపీఎల్, ఎయిర్‌టెల్, యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.