సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శనివారం బడ్జెట్ ప్రత్యేక ట్రేడింగ్‌లో వెయ్యి పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ ఆరంభంలో 120 పాయింట్లకుపైగా నష్టపోయింది. అనంతరం 220పాయింట్లు కుప్పకూలింది. లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతున్న సూచీ ప్రస్తుతం 83 పాయింట్లుఎగసి 39799 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11688 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ప్రధానంగాబ్యాంకింగ్ షేర్లలోఅమ్మకాలు కనిపిస్తుండగా, ఆటో, మెటల్,మీడియా కొనుగోళ్ల ధోరణి ఉంది. ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఓఎన్‌జీసీ నష్టపోతుండగా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, భారతి ఎయిర్‌టెల్ లాభాలతో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment