
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి జారుకుని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సూచీలు తిరిగి సెంచరీ లాభాల వైపు మళ్లాయి. దాదాపు 200 పాయింట్లకు పైగా లాభాలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు అనంతరం అమ్మకాల జోరుతో వెనుకంజ వేశాయి. తిరిగి పుంజుకున్న సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 35739కు చేరగా.. నిఫ్టీ కూడ అదే బాటలో 31 పాయింట్లు ఎగిసి 10682 వద్ద కొనసాగుతోంది. అయితే గురువారం డెరివేటివ్స్ ముగింపు, వారాంతాన బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో లాభనష్టాల మధ్య ఊగిసలాట ధోరణి కొనుగుతోంది. పీఎస్‌యూ, ప్రయవేట్ బ్యాంక్స్ 1 శాతం లాభపడగా.. మెటల్ 0.7 శాతం పుంజుకుంది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
యాక్సిస్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హిందాల్కో, విప్రో, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్ లాభాల్లో ఉండగా, ఐబీ హౌసింగ్ 4.4 శాతం పతనంకాగా.. హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్ నష్టపోతున్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అంటే కోబ్రోపోస్ట్ ఆరోపణలతో ఆరంభంతో 9శాతానికి పైగా కుప్పకూలిన డీహెచ్‌ఎఫ్‌ఎల్, కంపెనీ వివరణతో భారీగా పుంజుకుని ప్రస్తుతం 4శాతం బలహీనంగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment