
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.
వచ్చే వారం బంగారం ధర అంచనా
వచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
ప్రస్తుతం ఇలా..
అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి.