అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బుధవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరష్టాలకు పెరిగాయి.
బుధవారం మధ్యాహ్నం 2:17 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.9% పెరిగి ఔన్సుకు 2,592.39 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన అర శాతం రేట్ల కోతతో ద్రవ్య విధాన సడలింపు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ రేటు ఈ సంవత్సరం చివరి నాటికి మరో అర శాతం, 2025లో పూర్తిగా ఒక శాతం తగ్గుతుందని భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపుతో అందరి దృష్టి బంగారంపై పడింది. పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్‌పై భారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా ఉండనుంది.
ఫెడ్ రేట్ కట్ తరువాత డాలర్ 0.5% పతనమైంది. 2023 జూలై నుండి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది.ఇన్వెస్టర్లు ఇప్పుడు పాలసీ మార్గంపై ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నుంచి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా స్పాట్ వెండి సోమవారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఔన్స్‌కు 0.6% పెరిగి 30.93 డాలర్ల వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment