సాక్షి, ముంబై : అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పరుగందుకున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1450 డాలర్ల వద్ద ఉంది. దీంతో పుత్తడి ఆరేళ్ల (2013, మే) గరిష్టానికి చేరాయి.ఫెడ్ వడ్డీరేటు కట్ అంచనాలు, మిడిల్ ఈస్ట్‌లో ఆందోళన వాతావరణం బంగారం ధరలకు ఊతమిచ్చాయి. వరుసగా రెండోవారం కూడా పుంజుకున్న గోల్డ్ ధరలు ఈ వారంలో 2 శాతం ఎగిసాయి. ఇరాన్ డ్రోన్‌ను 1,000 గజాల లోపలికి వచ్చిన ఇరానియన్ డ్రోన్‌ను యుఎస్ఎస్ నేవీ కూల్చి వేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. దీంతో వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో క్రూడ్ ధరలు పుంజుకున్నాయి. డాలరు బలహీనపడింది. దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది.
దేశీయ ఫ్యూచర్స్‌మార్కెట్‌లో 10 గ్రా.పుత్తడి 177 రూపాయలు ఎగిసి 35333వద్ద కొనసాగుతోంది. వెండి 566 రూపాయలు పుంజుకుని కిలో ధర రూ. 41304 వద్ద ఉంది. అటు చమురు, ఫెడ్ అంచనాలు, ఆర్థిక బిల్లులో ఎలాంటి కీలక మార్పులు లేకుండా లోక్‌సభలోఆ మోదం పొందిన నేపథ్యంలోఆటోషేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకింది. దీంతో ఈక్వటా మార్కెట్లు 350 పాయింట్లకు పైగా కోల్పోయింది. తద్వారా సెన్సెక్స్ 38 561 వద్ద ఉంది. నిఫ్టీ 107 పాయింట్లు పతనమై 11495 వద్ద కొనసాగుతోంది. దీంతో 11500 స్థాయిని కూడా కోల్పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment