
సాక్షి,ముంబై: లాభాలతో మొదలైన దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి.అమెరికా చైనా మధ్య వాణిజ్య విభేదాలు ముగియనున్న నేపథ్యంతో జోరుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలన్నీ అవిరైపోయి, నష్టాలలోకి ప్రవేశించాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయింది. లాభనష్టాల మధ్య ఊగిస లాడుతున్న సెన్సెక్స్ 57 పాయింట్లు కోలుకొని 36250వద్ద, నిఫ్టీ 10పాయింట్లు పుంజుకుని 10,886 వద్ద ట్రేడవుతోంది. తొలుత లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ 36,446 వరకూఎగసిన సంగతి తెలిసిందే. ముఖ‍్యంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు.
రియల్టీ దాదాపు 2శాతం పుంజుకోగా, ఆటో మెటల్ ఫార్మా నష్టపోతున్నాయి. సన్ ఫార్మా 8.3 శాతం కుప్పకూలగా.. ఎంఅండ్‌ఎం, యూపీఎల్, హెచ్‌పీసీఎల్, జీ, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఐబీ హౌసింగ్ 5.4 శాతం జంప్‌చేయగా, హిందాల్కో, వేదాంతా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, ఎయిర్‌టెల్, గెయిల్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఆయిల్ ధరలు పుంజుకోవడంతో దేశీయ కరెన్సీరూపాయి బలహీనపడింది. డాలరు మారకంలో మళ్లీ 70 స్థాయికి పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment