2017లో దలాల్ స్ట్రీట్కు శని గండమా?
2017లో దలాల్ స్ట్రీట్కు శని గండమా?
Published Fri, Dec 30 2016 5:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరాదిలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతోంది. ఎవరికి వారు తమకు కొత్త ఏడాది 2017 ఎలా ఉండబోతుంది? కొత్త కార్యాచరణలు ఏం చేపట్టాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. దలాల్ స్ట్రీట్ విశ్లేషకులు కూడా కొత్త సంవత్సరాది అంచనాల్లో మునిగిపోయారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొనే ఆటుపోట్లపై జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 2017 సంవత్సరమంతా పూర్తిగా ఒడిదుడుకులమయంగా సాగుతుందని దలాల్ స్ట్రీట్ జ్యోతిష్యులు చెబుతున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం దేశీయ మార్కెట్లు మరింత సవాళ్లుగా మారాయని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా పడిపోయిన మార్కెట్లు, ఆ దెబ్బకు పూర్తిగా కోలుకోలేక బేరిస్ ట్రెండ్లో సాగుతున్నాయి. అటు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు సహకరించలేకపోతున్నాయి. ఈ బేరిస్ ట్రెండ్ 2017వరకు సాగుతుందట. ఒకవేళ లాభపడిన స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. 400 పాయింట్ల రేంజ్లో 7,730 కీలక మార్కు నుంచి 8,230 పాయింట్ల మధ్యలో కదలాడుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
డీమానిటైజేషన్ అనంతరం నెలకొన్న గడ్డు పరిస్థితులు 2018 ఆగస్టు వరకు ఉంటాయని ముంబాయికి చెందిన సెలబ్రిటీ ఆస్ట్రో-న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని చెప్పారు. 'మనం 71వ స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతున్నాం. 71 అనే సంఖ్య 8తో సమానం. ఎనిమిది శనిని సూచిస్తుంది. ఎక్కువ బాధలు పెట్టే దేవుడిగా శనికి పేరుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా నవంబర్ 8వ తేదీన సాయంత్రం ఎనిమిది గంటలకే తీసుకున్నారు' అని విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. బాధలు పెట్టిన అనంతరం శని శుభాలు చేకూరుస్తాడని, తర్వాత వచ్చే 72వ ఏడాది బాగుంటుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఎవరైనా 2017లో పెట్టుబడులు పెట్టదల్చుకుంటే, దేవుడిపై భారం వేసి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. మంచి రంగంలో పెట్టుబడులు పెట్టేలా నిర్ణయించుకోవాలంటున్నారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారమైతే 2017 ఏడాది మిక్స్డ్గా ఉంటుందని, కానీ పెట్టుబడులకు పాజిటివ్ సంకేతం కాదంటున్నారు ఆస్ట్రాలజర్ ముర్తాజా అలీ. అయితే పెట్టుబడిదారుల కోసం ఏమైనా మంచి ఆప్షన్లు ఉన్నాయో లేవో వేచిచూడాల్సిందేనన్నారు. కేంద్ర బడ్జెట్ వచ్చేంతవరకు కూడా ఆటో, కన్జ్యూమర్ డురెబుల్స్, ఎఫ్ఎమ్సీజీలు పెట్టుబడులు పెట్టడానికి తగిన స్టాక్స్ కావని హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ కూడా నెగిటివేనంటున్నారు. సిమెంట్, స్టీల్ స్టాక్స్ను భయం లేకుండా కొనుగోలు చేయొచ్చని భరోసా ఇస్తున్నారు.
Advertisement
Advertisement