astrologers
-
USA Presidential Elections 2024: ఎవరిపైన అనుగ్రహం
ఎన్నికలంటే ఉపన్యాసాలు, వాదనలు, పందేలు, ప్రగల్భాలు... ఇవి కాకుండా సర్వేలు, జోస్యాలు కూడా ఉంటాయి. మన దేశంలో ఇవి షరా మామూలే అయినా అమెరికాలో కూడా ఉన్నాయంటే కాసింత ఆశ్చర్యమే. చరిత్రలో ఇంతకు మునుపు లేని విధంగా ఒక స్త్రీగా కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంటే గ్రహాలన్నీ ఆమెను చల్లగా చూడనున్నాయని అక్కడి జ్యోతిష్యులు అంటున్నారు. అలాగని ట్రంప్ కోసం తారాతీరాన్ని చూస్తున్నవారు తక్కువగా లేరు. ఇంతకీ అక్కడ ఏం చెబుతున్నారు?ఎన్నికల కాలంలో జ్యోతిషులకు గిరాకీ మన ‘సనాతన’ దేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఉంది. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి జ్యోతిషులు రకరకాలుగా జోస్యాలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇదివరకు ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అయినా ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికన్ జ్యోతిషురాలు ‘లారీ రివర్స్’ గత ఏడాది జూన్‌లోనే జోస్యం చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీకి దిగుతారని లారీ 2020 ఆగస్టులో చెప్పిన జోస్యం ఫలించడంతో ఈ ఎన్నికల్లో ఆమె జోస్యంపై జనాలు నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం తథ్యమని మరో జ్యోతిషురాలు ‘అమీ ట్రిప్’ జోస్యం ప్రకటించారు. ‘స్టార్హీల్’ అనే యూజర్ పేరుతో ‘టిక్‌టాక్’లో నిత్యం జోస్యాలు చెప్పే అమీ ట్రిప్‌కు 7.40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో కొత్తగా ‘టిక్ టాక్’లోకి ప్రవేశించిన జ్యోతిషుడు జో థియోడర్ కూడా కమలా హ్యారిస్‌కు అనుకూలంగా జోస్యాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యాలు చెబుతున్న వారిలో ఎక్కువ మంది కమలా హ్యారిస్‌కు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న పుట్టారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న పుట్టారు. వీరిద్దరూ నిండు పున్నమి తిథిలోనే పుట్టారు. అయితే ట్రంప్ పుట్టిన రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ‘చాలామంది జ్యోతిషులు ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలని భావిస్తున్నారు. అందుకే ఆమెకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు. అయితే, సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పుట్టిన వారి శక్తిని తక్కువగా అంచనా వేయలేం. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’ అని బ్రిటన్‌కు చెందిన జ్యోతిషురాలు ఫ్రాన్సెస్కా ఆడీ చెబుతుండటం విశేషం.మరోవైపు భారతీయ జ్యోతిష్యులలో ఒకడైన కార్తిక్ గోర్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న రాహువు కమలా హ్యారిస్‌కు మాత్రం వరాలు కురిపించనున్నాడని చెప్పారు. మరో జ్యోతిష్యుడు విజయేంద్ర ట్రంప్ జాతకం ప్రకారం ఆయన విషయంలో చంద్రుడు వేదనలో ఉన్నాడని అందువల్ల అతనికి ప్రతికూలత ఎదురుకానుందని అన్నారు. అయితే చాట్‌జిపిటి ద్వారా కొందరు 16 శతాబ్దపు మహా జ్యోతిష్యుడైన నోస్ట్రాడామస్ ఇప్పుడు ఉంటే అతను అమెరికా ఎన్నికల విషయంలో ఏం జోస్యం చెబుతాడని ఏ.ఐ.ని అడిగితే అది అనూహ్యమైన జవాబు చెప్పింది. ‘కమలా హ్యారిస్గానీ ట్రంప్‌గానీ ఊహించే అంచనాకు చేరలేకపోవచ్చు’ అంది. ‘చివరి నిమిషంలో మలుపు తిరిగి రంగంలో లేని వారు పదవిని ఆశించవచ్చు’ కూడా అన్యాపదేశంగా సూచించింది. దాంతో ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న టిమ్ వాల్జ్, జెడి వాన్స్ వైపు కొంతమంది చూస్తున్నారు. అలాగే ఏ.ఐ ఈ ఎలక్షన్ల తర్వాత అమెరికాలో అల్లర్లు రేగుతాయని, వీధులు మండుతాయని కూడా జోస్యం చెప్పింది.గతంలో బైడన్ అధ్యక్షుడు అయ్యే ముందు అలాగే జరిగింది కదా.ఏమైనా ఈ ఎన్నికలు అందరినీ ఉత్కంఠగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. గ్రహాలు ఇదంతా లైవ్‌లో చూస్తూ ఫలితాలను ఏమని టెలికాస్ట్ చేస్తాయో త్వరలో తెలియనుంది. -
అదీ.. దాంపత్యం అంటే..!
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Astrology: గ్రహాలేం చెబుతున్నాయ్..
న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయా, ఇంక్రిమెంట్లు పడతాయా వంటి అనేకానేక సందేహాలు చాలామంది ఉద్యోగులను వెంటాడుతున్నాయి. తమ భవిష్యత్తు గురించి గ్రహాలేం చెబుతున్నాయో తెలుసుకోవాలనే ఆరాటం కొద్దీ ఆన్లైన్ జ్యోతిష్యం పోర్టల్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిలో యువ ఉద్యోగులే కాకుండా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కెరియర్లో పురోగతి, ఉద్యోగంలో మార్పులు వంటి అంశాలపై ఉద్యోగులు ఆరాటపడుతుండగా, స్టార్టప్ వ్యవస్థాపకులు తమ నిధుల సమీకరణ యత్నాలు సక్రమంగా సాగుతాయా లేదా, ఇతర వ్యవస్థాపకులతో సంబంధాలు బాగుంటాయా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆన్లైన్ ఆ్రస్టాలజీ పోర్టల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. కెరియర్, బిజినెస్ గురించి తెలుసుకునేందుకు డిజిటల్ ఆ్రస్టాలజీ ప్లాట్‌ఫాం గణేషాస్పీక్స్డాట్కామ్కి యువ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల నుంచి వచ్చే కన్సల్టేషన్ల అభ్యర్ధనలు పది రెట్లు పెరిగాయి. వారిలో చాలా మంది 23–35 ఏళ్ల మధ్య వారే కావడం విశేషం. ఇక ఆస్ట్రోయోగి ప్లాట్‌ఫాంపై యూజర్ల సంఖ్య .. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 రెట్లు పెరిగింది. ఆస్ట్రోటాక్, ఆస్ట్రోయోగి వంటి ప్లాట్‌ఫాంలు అందించే మొత్తం కన్సల్టేషన్లలో సుమారు 30 శాతం కన్సల్టేషన్లు .. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో కోతల భయాలు మొదలైన వాటి గురించే ఉంటున్నాయి. రూ. 10 నుంచి కన్సల్టేషన్.. జ్యోతిష్యుల అనుభవాన్ని బట్టి కన్సల్టేషన్‌కు వసూలు చేసే చార్జీలు ఉంటున్నాయి. నిమిషానికి రూ. 10 నుంచి మొదలుపెడితే రూ. 200 వరకు కూడా ఇవి ఉంటున్నాయి. జ్యోతిష్యుల్లో పక్కాగా జ్యోతిష్యం నేర్చుకున్నవారే కాకుండా ఇంజనీర్లు, ఎంటెక్, సీఏలు చేసిన వారు కూడా ఉంటున్నారు. సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉండే నగరాల్లోని మొత్తం ఆన్లైన్ ఆ్రస్టాలజీ యూజర్లలో 60 శాతం వాటా జనరేషన్ జెడ్ యువతదే ఉండటం ప్రస్తావించతగ్గ అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వ్యాపారాల విషయంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో చిన్న పట్టణాలు మొదలుకుని మెట్రో నగరాల వరకు అన్ని చోట్లా యువ యూజర్ల నుంచి దాదాపు ఒకే తరహా సందేహాలకు కన్సల్టేషన్ అభ్యర్ధనలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఆస్ట్రో యూజర్లలో ఎక్కువ శాతం మంది ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, జైపూర్, చండీగఢ్, లూధియానా వంటి పెద్ద నగరాల నుంచి ఉంటున్నట్లు వివరించాయి. వ్యాపారం జోరు.. పెరుగుతున్న యూజర్ల సంఖ్యకు అనుగుణంగా ఆస్ట్రో పోర్టల్స్ ఆదాయాలు కూడా జోరుగా ఉంటున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రోటాక్ ఆదాయం రూ. 65 కోట్లుగా ఉండగా 2023 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 282 కోట్లకు పెరిగింది. లాభాలు రూ. 11.2 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు చేరాయి. యూజర్ల సంఖ్య 25 లక్షల నుంచి ఇప్పటివరకు 1.9 కోట్లకు ఎగిసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 630 కోట్లకు, లాభం రూ. 130 కోట్లకు చేరగలదని ఆస్ట్రోటాక్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించాలనే యోచనలో కంపెనీ ఉంది. ఇందులో భాగంగా ఇతర సంస్థలను కొనుగోలు చేయడం, కొత్త విభాగాలను ప్రారంభించడం, సీనియర్ల హోదాలో నియామకాలు చేపట్టడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, గణేషాస్పీక్స్ పోర్టల్‌ను తీసుకుంటే 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 58 శాతం పెరిగింది. -
జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్, వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్ ఆస్ట్రోటాక్ స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. 10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా కార్యకలాపాలను, ప్రస్తుత బృందాన్ని పెంచాలని చూస్తున్నాము. మా వద్ద ఉన్న జ్యోతిష్యుల సంఖ్యతో పోలిస్తే వినియోగదరులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించడానికి మా మార్కెటింగ్ చాలా మెరుగ్గా ఉంది. మా వెబ్సైట్లో మేము పొందుతున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే మా టెక్నాలజీ టీమ్‌లో వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించాము మేము 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము’’ అన్నారు. 3 కోట్ల మంది కస్టమర్లు నమోదు... సొంత వనరులతో అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన తన స్టార్టప్ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్ సందర్శనలను నమోదు చేసిందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని వెల్లడించారు. అయితే 3,500 కంటే ఎక్కువ జ్యోతిష్యుల సేవలను వినియోగించుకోలేకపోయినట్లు తెలిపిన ఆయన, ఇప్పుడు వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నాన్-జ్యోతిష్యుల సంఖ్య దాదాపు 125గా ఉందని పేర్కొంటూ, మరింత మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. కంపెనీ నాన్-జ్యోతిష్యుల్లో రిక్రూటర్లు, జ్యోతిష్కుల శిక్షకులు, జ్యోతిష్య భాగస్వాములు, కస్టమర్ల కోసం రిలేషన్షిప్ మేనేజర్లు ఉన్నట్లు వెల్లడించారు. -
అల్లు అర్జున్‌కు అలాంటి అవాంతరాలు, జ్యోతిష్యులు ఏం చెప్పారంటే..
Astrologer Suggested To Allu Arjun As Per His Astrology: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. గతేడాది డిసెంబర్ 17న రిలీజైన ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. ఇదిలా ఉంటే ఎక్కడ చూసిన పుష్ప మేనియానే కనిపిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్‌ను సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకులకు వరకు ఈ డైలాగ్‌ను వాడేస్తున్నారు. చదవండి: ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్ ఇక ఈ చిత్రంలోని పాటకలు వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు. శ్రీవల్లి, సామీ సామీ పాటలు క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఇదే జోష్‌తో త్వరలోనే పుష్ప పార్ట్ 2ను మొదలపెట్టాలని చూస్తున్నాడు బన్నీ. అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అదృష్టం ఉన్న సమయం కూడా కలిసి రావాలి. అదే సమయం కలిసి రాకపోతే ఎలాంటి సమస్యలైన తలెత్తే అవకాశం ఉంది. సడెన్‌గా కెరీర్‌కు బ్రేక్‌లు పడటం, చేసే ప్రతి పనిలో అవాంతరాలు ఎదురవుతుంటాయి. అందుకే అలాంటివి జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు మన సినీ, రాజకీయ ప్రముఖులు. చదవండి: 60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు ఇక తాజా పాన్ ఇండియా స్టార్ హోదాను పొందిన అల్లు అర్జున్‌కు భవిష్యత్తులో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్‌లు రావాలంటే ఆయన కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు చేయాలని ప్రముఖ జ్యోతీష్య పండితులు సూచిస్తున్నారట. పుష్ప పార్ట్ 2 షూటింగ్ నేపథ్యంలో ఆయన ఫేమస్ జ్యోతీష్యలు వద్ద జాతకం చూపించినట్లు తెలుస్తోంది. బన్నీ జాతకం చూసిన పండితులు ఆయన జీవితం, సినీ కెరీర్ సాఫీగా సాగాలంటే కుటుంబంతో కలిసి పూజ, హోమాలు చేయాలని సూచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి సూచన మేరకు బన్నీ త్వరలోనే కుటుంబంతో కలిసి తన ఫామ్‌హౌజ్‌లో పూజలు, హోమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. -
ట్రంప్ గెలుస్తాడంటున్న జ్యోతిష్కులు
వాషింగ్టన్: ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు గెలుస్తారని జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు. లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా ట్రంప్ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు యాహూ న్యూస్ తెలిపింది. న్యూమరాలజిస్టులు లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా జాతకాలు చెబుతారు. లైఫ్‌పాత్ నంబర్ అంచనా ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్ అనికూడా అంటారు. ట్రంప్ బర్త్‌డేట్: 14–06–1946. ఇందులో అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్ లైఫ్‌పాత్ నంబర్. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులు మాస్టర్ బిల్డర్స్ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువని తెలిపారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్ బర్త్‌డేట్: 20–11–1942. ఇందులో అంకెలను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్ ఇయర్ అని వివరించారు. -
దేవుని తీర్పు కోసం సిద్ధపడే తరుణమిది
బబులోను రాజైన బెల్షస్సరు రాజవంశీయులైన వెయ్యి మంది అధిపతులకు, తన రాణులకు, ఉపపత్నులకు ఒక రాత్రి గొప్ప విందు చేశాడు. తన రాజధానియైన బబులోను పట్టణమంటే అతనికెంతో అతిశయం!! బబులోను పట్టణం చుట్టూ 350 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పున మహా ప్రాకారముంది. శత్రువుల ఆగమనాన్ని పసిగట్టేందుకు ఆ గోడ మీద 350 చోట్ల కాపలా శిఖరాలున్నాయి. ప్రాకారాన్ని ఆనుకొని పట్టణం చుట్టూ మొసళ్ళు నివసించే నీళ్లతో లోతైన కందకాలున్నాయి. శత్రువు బయటి నుండి ముట్టడి వేసినా కోట లోపల కొన్ని ఏళ్లపాటు సుఖంగా బతికేందుకు అవసరమైనన్ని ధాన్యం, ఆహారం నిల్వలు న్నాయి. అందువల్ల తమ ప్రాణాలకు, భద్రతకు ఏమాత్రం ఢోకా లేదన్న అతివిశ్వాసంతో రాజైన బెల్షస్సరు విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు. పైగా యెరూషలేము మహాదేవుని ఆలయం నుండి దోపిడీ చేసి తెచ్చిన బంగారు పాత్రల్లో ద్రాక్షారసం తాగేందుకు పూనుకోవడం అతని అహంకారానికి పరాకాష్ట అయ్యింది. ఆ రాత్రే ఒక అదృశ్యవ్యక్తి తాలూకు హస్తం అతని ఎదుట గోడమీద ఏదో రాయడం అతనికి కలవరం కలిగించింది. తన వద్దనున్న జ్యోతిష్కులు, గారడీవాళ్ళు, మంత్రగాళ్ళ ద్వారా దాని భావాన్ని తెలుసుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. చివరికి దానియేలు ప్రవక్త అతనికి దాని గుట్టు విప్పి చెప్పాడు. ‘రాజా, నీ తండ్రి నెబుకద్నెజరు చేసిన తప్పిదాన్నే నీవు కూడా చేస్తున్నావు. నీ తండ్రిని దేవుడు ఎలా శిక్షించాడో అంతా ఎరిగి కూడా నిన్ను నీవు సరిచేసుకోకుండా, నిగ్రహించుకోకుండా పరలోకమందలి దేవుని కన్నా పైగా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. అందువల్ల ‘మేనే మేనే టేకేల్ ఉఫారసీన్’ అని దేవుని హస్తం నిన్ను గురించి దైవభాషలో రాసింది. అంటే దేవుడు నీ విషయం లెక్క చూసి, తన త్రాసులో తూచగా నీ అహంకారం వల్ల నీవు చాలా తక్కువగా తూగావు. అందువల్ల ‘ఇదంతా నాదేనంటూ నీవు విర్రవీగుతున్న నీ రాజ్యాన్నంతా తీసి దేవుడు నీ శత్రువులైన మాదీయులు, పారసీకులకు ఇవ్వబోతున్నాడు’ అని దేవుని తీర్పును అతనికి వెల్లడించాడు. ఆ రాత్రే అదంతా నెరవేరి, బెల్షస్సరు శత్రువుల చేతిలో చనిపోగా, అతని రాజ్యం శత్రురాజుల చేజిక్కింది. దేవుడెంత న్యాయవంతుడంటే, ముందుగా హెచ్చరించకుండా, పరివర్తన చెందేందుకు సమయమివ్వకుండా ఎవరినీ శిక్షించడు. సమయమిచ్చినా దాన్ని వాడుకొని మారనివారిని దేవుడెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు కూడా. ‘ఎంతోమంది చక్రవర్తులు, మహాపాలకులు కూలిపోయింది శత్రురాజుల చేతిలో కాదు, వాళ్ళు తమ అహంకారానికే బలయ్యారు’ అన్నది చరిత్ర చెప్పే సత్యం!! రాజైన హిజ్కియా కూడా దారి తప్పి పశ్చాత్తా్తపపడితే దేవుడు మరో అవకాశాన్నిచ్చి అతని ఆయువును పెంచాడు. అతని కొడుకు మనశ్శహే రాజు కూడా తప్పులు చేసినా, తన తండ్రిలాగే తనను తాను సరిదిద్దుకొని మరో అవకాశం పొందాడు. బబులోను రాజైన బెల్షస్సరు మాత్రం తన తండ్రి నెబుకద్నెజరుకు జరిగిన దాన్నంతా చూసి కూడా గుణపాఠం నేర్చుకోక తన అహంకారానికి, అజ్ఞానానికి బలై భ్రష్టుడయ్యాడు. తన చుట్టూ ఉన్న కోట, తన సైనికులు తనను కాపాడుతారనుకున్నాడు కాని మహాకాశంలో తన సింహాసనాన్ని కలిగి ఉన్న దేవదేవుడు తనను కూడా పాలించే మహాపాలకుడన్న వాస్తవాన్ని మరచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించి, వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఆది నుండీ చెప్పేది అదే!! మనిషి వినాశనం మనిషి చేతుల్లోనే ఉంటుంది. తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ఆ వినాశనం నుండి తప్పించుకోగలడు. దేవుడిచ్చిన పాపక్షమాపణను పొందిన వారే దేవుని తీర్పును తప్పించుకోగలరు. –రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
ఐపీఎల్-12లో జ్యోతిష్యమే గెలిచింది..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్ నిలుస్తుందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. రోహిత్ శర్మకు, ముంబై ఇండియన్స్ జట్టుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు, అదృష్టం ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని వారు వివరించారు. అయితే జోతిష్యుల అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది. దీంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు సిద్దాంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం స్థానక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. అయితే గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలంటారు. నిన్నటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ అదృష్టం రోహిత్‌కు ఉన్న గ్రహబలమేనని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతా అంబానీ పూజలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె మ్యాచ్ మధ్యలో బల్కంపేటలోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. అనంతరం నీతా అంబానీ తిరిగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ ఆసాంతం ఆమె పూజలు చేశారు. చివరి బంతి సమయంలో కూడా మంత్రాలు చదువుతూ కనిపించారు. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్‌మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు. చదవండి: విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు -
ఏపీ ఎన్నికల ఫలితాలు చెప్తే భారీ నజరానా!
సాక్షి, విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలపై భారత నాస్తిక సమాజం ఆసక్తికర సవాల్ విసిరింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముందుగానే చెప్పిన జ్యోతిష్యులకు రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు వై.నూకరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో కొంతమంది జ్యోతిష్యం పేరిట ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంపొందించడం ప్రతి భారతీయుని విధి అని, అందుకు విరుద్ధంగా కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఈ నెల 23న వచ్చే ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ముందుగా చెప్పిన వారికి రూ.5 లక్షలు బహుమతి అందిస్తామన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు మురపాక కాళిదాస్ నాడీ జ్యోతిష్యం ప్రకారం వైఎస్సార్సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని గతవారంలో చెప్పారని, ఆయన కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. సందేహాలుంటే 94402 60280, 90106 96498 నంబర్లను సంప్రదించాలన్నారు. -
యతిశేఖరులు..పరమాచార్యులు
సప్తమోక్షపురులలో ఒకటిగా కీర్తిగాంచిన కాంచీనగరం నుండి ఎంతోమంది మహనీయులు భరతజాతికి ఆధ్యాత్మిక వెలుగులను ప్రసరింప జేసారు. ఈ క్షేత్రమహత్యాన్ని గుర్తించిన శంకర భగవత్పాదులు కంచికామకోటి పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠాన్ని అధిరోహించి పీఠానికి వన్నె తెచ్చిన వారిలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకరు.1894వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం విల్లుపురం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి–మహాలక్ష్మి దంపతులకు జన్మించారు శ్రీస్వామినాథన్. అబ్బాయి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు... భవిష్యత్తులో ఈ పిల్లవాడు జగద్గురువుగా ప్రఖ్యాతి పొందుతాడని చెప్పారు. ఆ మాటలను నిజంచేస్తూ ఆ పిల్లవాడే కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యునిగా ఆధిపత్యాన్ని స్వీకరించి భక్తుల చేత కంచిపరమాచార్యగా గౌరవ మన్ననలను పొందారు. వారే శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. 13సంవత్సరాల పసిప్రాయంలో పీఠాధిపత్య బాధ్యతలను స్వీకరించిన స్వామివారు అటు పీఠబాధ్యతలను, ఇటు ధర్మబోధనలను ఏకకాలంలో సమర్థంగా నిర్వహించేవారు. వీరి బోధనలకు ఆకర్షితులైన ఎంతోమంది వీరి దర్శనం లభిస్తే చాలు... జన్మధన్యమైందని భావించేవారు. దేశ, విదేశీ రాజకీయ, చారిత్రక, మతప్రముఖులు, ఇలా భిన్న రంగాలవారు స్వామివారిని సందర్శించి, వారితో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేవారు. స్వామివారు తమదైన శైలిలో చెప్పిన సమాధానంతో వారంతా సంతృప్తికరమైన భావనతో తిరిగి వెళ్ళేవారు. ఈ సంఘటనలన్నీ స్వామివారి సామాజిక స్పృహకు తార్కాణంగా నిలుస్తాయి.కనీస అవసరాలకై ఎదురుచూసే ఎంతోమంది అభాగ్యులకు సేవచేయడం కూడా పరమేశ్వరారాధనే అవుతుంది. దానివల్ల ఆత్మతప్తి కలుగుతుంది. ఇతరుల బాగుకోసం చేసే పనిలో కలిగే బాధైనా ఆనందాన్నే మిగులుస్తుందనేవారు నడిచే దైవంగా పేరొందిన పరమాచార్యస్వామివారు. అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
ప్చ్.. జ్యోతిష్యుల ‘హస్త’రేఖ బాలేదు!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టయింది కర్ణాటకలో జ్యోతిష్యుల పరిస్థితి. ఎన్నికల కోడ్ తమ కొంప ముంచుతోందని లబోదిబో మంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.. జ్యోతిష్యులు, హస్తసాముద్రిక నిపుణులు చేతులు చూసి జాతకాలు చెబుతారు. తమ వృత్తికి గుర్తుగా వారు తమ ఇళ్లు, కార్యాలయాల ముందు హస్తం బొమ్మలు పెట్టుకుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల చిహ్నాలను ఇతరులు బహిరంగంగా ప్రదర్శించకూడదు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం. ఈ జ్యోతిష్యులు పెట్టుకునేది కూడా హస్తం బొమ్మనే. ఈ బొమ్మ వల్ల కాంగ్రెస్‌కు ప్రచారం చేసినట్టు అవుతుందని ఎన్నికల సంఘం ఆ బొమ్మలను తొలగించడమో, మూసేయడమో చేస్తోంది. మాండ్య నగరంలో నాలుగు రోజుల క్రితం ఎన్నికల అధికారులు జ్యోతిష్యులు, హస్తసాముద్రికుల ఇళ్లు, ఆఫీసులన్నీ వెదికి హస్తం చిహ్నాలను తొలగించారు. ఎన్నికలయ్యేంత వరకు వాటిని బయటపెట్టవద్దని హెచ్చరించారు. హస్తం గుర్తు తమ వ్యాపార చిహ్నమని అది లేకపోతే ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలను గుర్తించలేరని సత్యనారాయణ భట్ అనే జ్యోతిష్యుడు వాపోయారు. ‘మేం చేయి గుర్తు వాడుతాం కాని మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అని చెప్పి దాన్నెలా తీసేస్తారు. బీజేపీ గుర్తు కమలం కాబట్టి ఎన్నికల సంఘం చెరువులు, సరస్సుల్లోని కమలాలన్నింటినీ తొలగించేస్తుందా? అని మరో జ్యోతిష్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సూర్యుడు, ట్రాక్టర్, సైకిలు, టార్చ్‌లైటు, ఏనుగు, రెండాకులు.. ఇలా బోలెడన్ని పార్టీ చిహ్నాలున్నాయి. వాటన్నింటినీ కూడా మూసేస్తారా..సూర్యుడిని ఉదయించకుండా చేస్తారా? అంటూ జ్యోతిష్యులు ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్నారు. -
నిన్ను నువ్వు నమ్ముకో!
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ల కుమారుడు బాబూ టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం ఉండదని జ్యోతిషులు పెదవి విరిచారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగాలు పడ్డాడు. అప్పట్నుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలు పెట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పచూసి విఫలమైంది. కష్టంలోనూ. సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది. ‘జాతకాలు, జన్మకుండలి పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడవద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు’ అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటలు బాబుకి చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు బాగా రాశాడు. ఉత్తీర్ణత కూడా సాధించాడు. బాబాపై ఉంచిన విశ్వాసమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో’’ అనేది బాబా ఉపదేశం. భగవంతుడి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. గురువులు, ఇష్టదైవాల గురించి చదివి వదిలేయడం కాదు, వారు చెప్పిన దానిని ఆచరించాలి. అదే మనం వారిపై చూపే నిజమైన నమ్మకం. – డా.కుమార్ అన్నవరపు -
పంతులూ ఓసారి ఇటు చూడు
నెన్నెల(బెల్లంపల్లి): ఎన్నికల నగారా మోగింది. అందరూ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు పార్టీలు ప్రక టించిన అభ్యర్థులతోపాటు పోటీ చేయాలనుకుంటున్న వారు సీటు ఎటుతేలని నాయకులు కూడా పంచాంగం పండితుల సలహా తీసుకుంటున్నారు. ఈ మాసంలో 14వ తేదీ దివ్యమైనదిగా పండితులు చెబుతుండటంతో ఈ రోజు నామినేషన్లకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక 17, 19 తేదీల్లో మంచి రోజులేనని చెబుతున్న పంచాంగ పండితులు ఆయా అభ్యర్థుల నక్షత్రం, బలాన్ని బట్టి ఆ రోజు వారికి మంచిదా, కాదా అని చెబుతున్నారు. మొత్తంగా నామినేషన్లు వేసేందుకు గడువు బాగానే ఉన్నా మంచి ముహూర్తాలు లేవని అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మహాకూటమి ఇంకా తేలకపోవడంతో చివరి నిమిషంలో ఖరారు చేస్తే ఎలా నామినేషన్లు వేయాలని ఆందోళన చెందుతున్నారు. పండితుల సూచనలు ఈ నెల 14న కార్తీక శుద్ధ సప్తమి శ్రవణ నక్షత్ర నేపథ్యంలో నామినేషన్లకు చాలా విశేషమైందని పండితులు చెబుతున్నారు. ఉదయం 10.42 నిమిషాల నుంచి 11.42 నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు మంచి ముహూర్తం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 17న కార్తీక శుద్ధ దశమి ఉంది. ఈ రోజు కూడా మంచి గడియలే ఉన్నాయని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చని చెబుతున్నారు. ఈ నెల 19న ముహూర్తం బాగానే ఉన్నా ఆయా అభ్యర్థుల నక్షత్రాలు, బలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఈ మూడు రోజులు మాత్రమే మంచి గడియలు ఉన్నాయి. ఈ తేదీలను ఎందుకు చెప్పడం లేదంటే.. 13న మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపలేదు. 15న గురువారం అష్టమి ఉండటంతో నామినేషన్లు కష్టమే. ఈ నెల 16న నవమి తర్వాత దశమి వస్తున్న నేపథ్యంలో చాలా మంది నామినేషన్ వేయడం వద్దనుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఈ నెల 17వ శనివారం కావడంతో చాలా మంది నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపరు. -
నామినేషన్ ఏరోజు వేద్దాం !
పెళ్లి చేయాలన్నా.. ఇల్లు నిర్మించాలనుకున్నా.. కుర్చీలో కూర్చోవాలనుకున్నా... ఇలా ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా తిథులు... వారాలు.. నక్షత్రాలు.. రోజులు, గడియలు చూస్తారు. అసలే ఎన్నికల సమయం కావడం నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో అభ్యర్థులు నామినేషన్లపై ప్ర«ధానంగా దృష్టి సారించారు. పుణ్యమాసమైన కార్తీక మాసంలో నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుండటంతో మంచి ముహూర్త కాలంలో నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు గాను అభ్యర్ధులు జ్యోతిష్యులు, పండితులతో ముహూర్త బలం గురించి చర్చలు జరుపుతున్నారు. సాక్షి, షాద్‌నగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల పర్వానికి తెరలేవనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 20న «నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెంటిమెంటుకు విలువ ఇస్తూనే.. ఇప్పటి వరకు పార్టీలు ప్రకటించిన అభ్యర్థులతో పాటు పార్టీల నుంచి టికెట్ వస్తుందని ధీమాలో ఉన్న నేతలు, స్వతంత్ర అభ్యర్థులు, నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అభ్యర్థులు సెంటిమెంటుకు విలువ ఇస్తూనే తమ పేరుపై రాజకీయ బలం ఎలా ఉందో చూసి చెప్పాలని జ్యోతిష్యులను అడుగుతున్నారు. జనంలో మంచి పేరు ఉంటే చాలు అన్ని రోజులు మంచివేననే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముహూర్తాలు ఇలా.. 12వ తేదీ సోమవారం, పంచమి తిథి, పుర్వాషాడ నక్షత్రం కావడంతో అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 13వ తేదీ మంగళవారం తిథి షష్టి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటడం, మంగళవారం కావడంతో కొందరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆసక్తి కనబర్చరు. 14వ తేదీ బుధవారం, సప్తమి తిథి, శ్రవణా నక్షత్రం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు అధికంగా వేసే అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ గురువారం, ఉదయం 8.45నిమిషాల వరకే సప్తమి తిథి ఉంది. ఆ తర్వాత అష్టమి వస్తుండటంతో ఆ రోజున నామినేషన్లు వేసే అవకాశాలు చాలా తక్కువ. 16వ తేదీ శుక్రవారం, తిథి అష్టమి ధనిష్ట నక్షత్రం కావడంతో నామినేషన్లు వేయడానికి అంతగా ఎవరు సాహసించకపోవచ్చు. 17వ తేదీ శనివారం, తిథి నవమి శతభిషా నక్షత్రం ఉండగా మధ్యాహ్నం 2.26 గంటల వరకు నవమి ఉంటుంది. వెంటనే దశమి వస్తుండటంతో ఆ రోజు ఎక్కువగా నామినేషన్లు పడే అవకాశాలు ఉంటాయి. 18వ తేదీ ఆదివారం 19వ తేదీ సోమవారం నామినేషన్ల చివరి రోజు. ఆ రోజు తిథి ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో ఆరోజు మంచి రోజుగా భావించి ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశాలు ఉంటాయి. మంచి ముహూర్తాలు ఉన్నాయి కార్తీక మాసం ప్రారంభం కావడంతో మంచి శుభ ముహూర్తాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల కోసం ఈ వారం రోజులూ మంచి దివ్యమైన ముహుర్తాలే.. అభ్యర్థులు వారి వారి జాతక రీత్యా సుముహూర్త సమయంలో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. – రవిశర్మ, బ్రాహ్మణ సేవా సమాఖ్య అడహక్ కమిటీ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
గ్రహాల నాడి తెలిపే రచన
తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకోడం కోసం కొందరు హస్తసాముద్రికాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు సంఖ్యాశాస్త్రాన్ని, ఇంకొందరు పుట్టుమచ్చల శాస్త్రాన్నో, జ్యోతిషాన్నో ఆశ్రయిస్తారు. వీరేగాక చిలక జోస్యాన్నీ, కోయదొరల పలుకులనీ, సోది చెప్పేవారి మాటలనూ పరిగణనలోకి తీసుకునేవారూ కోకొల్లలు. రోగి నాడి పట్టుకుని రోగ లక్షణాలను వైద్యుడు తెలుసుకున్నట్టే, జాతకుడి లక్షణాలను అతడి నాడి ద్వారా జ్యోతిష్యుడు తెలుసుకోగలడు. అయితే, నాడీజ్యోతిషంలో కొందరు పరాశరనాడిని అనుసరిస్తే ఇంకొందరు భృగు పద్ధతిని, మరికొందరు కనీనిక నాడిని అనుసరిస్తారు. చాలామంది జ్యోతిషులు లగ్నాన్ని ఆధారంగా చేసుకుంటారు. కొంద రు శనిగ్రహాన్ని, మరికొందరు బుధగ్రహాన్నీ పరిశీలించి చెబుతారు. అయితే, ‘ప్రశ్నహోరా’, ‘పాపగ్రహాలు– పరిహారాలు’ పుస్తక రచయిత పామర్తి హేమసుందరరావు భృగునాyì మరింత కీలకమంటూ, ఆ నాడి ద్వారా ఏమేం తెలుసుకోవచ్చో వివరించారు. టైటిల్‌ను బట్టి ఈ పుస్తకం చదివితే ఎవరికి వారే తమ జాతకాన్ని తెలుసుకోవచ్చేమో అనిపిస్తుంది. అయితే వివిధ రకాల నాడీ జ్యోతిషాల గురించి తెలిసిన వారికి, జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నవారికే ఈ పుస్తకం ఎక్కువ ఉపకరిస్తుంది. రచయిత సీనియర్ పాత్రికేయులు కావడంతో పుస్తకాన్ని ఆసక్తికరంగా మలచడంలోనూ, వాడుకభాషలో రాయడంలోనూ సాఫల్యాన్ని సాధించారు. -
సౌరమానం
జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (అక్టోబర్ 21 నుంచి 27 వరకు) మీ రాశి ఫలితాలు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కుజ బుధ గురు రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగానూ శని ప్రతికూలంగా ఉన్న కారణంగానూ సంఘంలో కీర్తిప్రతిష్ఠలూ పలుకుబడీ ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వాళ్ల ద్వారా ఏమేమో అద్భుతాలు జరిగిపోగలవనుకుంటూ మీరు మీ ప్రయత్నాల విషయంలో కొంత నిర్లక్ష్యాన్ని చూపించే అవకాశముంది. అది ఏమాత్రమూ సరికాదని గ్రహించండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, వారు మీ ద్వారా ప్రయోజనాన్ని మరొకరి నుండి పొందదలిచి, మిమ్మల్ని ఓ దూత లేదా మధ్యవర్తిగా నిర్ణయించుకుని పరిచయాన్ని చేసుకుంటున్నారని భావించండి. కార్తీకంలో ఏర్పడే పరిచయాలు శాశ్వతంగా ఉండవు. విరోధంగాని ఏర్పడితే అది చాలాదూరం వెళ్లిపోతుంది. భారత యుద్ధ ప్రారంభం కార్తీకంలోనే. మీ ప్రతిభకి గుర్తింపుగా మీ ఉద్యోగ సంస్థ గాని లేదా మీకు మీరే గాని వాహనాన్ని పొందే అవకాశముంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మరింత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చునేమో గాని, సంతృప్తికరంగా నడుస్తుంటాయి. జరిగిన మూడు మాసాల కంటె మీ ఆర్థిక స్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. శుభకార్యం ఒకటి ముందు నాటికి రాబోయే అవకాశముంది కాబట్టి ధనవ్యయాన్ని చేసేప్పుడు ఓ క్షణం ఆలోచించండి. ఓ పథకం ప్రకారం వెళ్లండి. కుటుంబ సభ్యులతో ఐకమత్యం బాగా ఉన్న కారణంగా మీరెంతో ఉత్సాహంగా ఉంటారు. లౌకిక పరిహారం: అవకాశం చేసుకుని గోశాలలో ఉన్న ఒక ఆవుకి గడ్డిని పంపించండి. లేదా స్వయంగా అందివ్వండి. అలౌకిక పరిహారం: సమీప శివాలయానికి వెళ్లి శంకరునికి అష్టోత్తర శతనామావళికి సరిపడేలా 108 పూలని సమర్పించండి. ఇంటి గుమ్మంలో సంధ్య దీపాన్ని వెలిగించి ఉంచండి. మిధునం (మే 21 – జూన్ 20) కుజ, గురు, శుక్ర, రాహు, కేతువులు అనుకూలురుగా ఉన్న కారణంగా ఏయే ముఖ్య కార్యాలని మున్ముందు చేయాలని భావిస్తున్నారో ఆ అన్నిటినీ ఒక క్రమంలో రాసుకుని, దేనికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలో, దేన్ని తర్వాత చెయ్యాలో ఆ తీరుగా ఒక పట్టికని ఏర్పాటు చేసుకోండి. ఎవరో మీ వద్దకి వచ్చి ఏమీ చేయరు కాబట్టి మీకు మీరే బిడియాన్నీ వెనుకబాటుతనాన్నీ విడిచిపెట్టండి. ముఖ్యులైన వారితో పరిచయాన్ని చేసుకోండి. మీరు అడిగితే చాలు తగిన సహాయాన్ని చేయడానికి కొందరు మీకున్నారని గ్రహించి పరిచయం కోసం ప్రయత్నించండి ఈ వారంలో. విత్తనం నాటితే ఎప్పుడో ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ఏమి లాభం అనుకోండి. ఇప్పుడు నాటితే తొందరలో ప్రయోజనం ఉండగలదు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఎవరెవరికో ఋణాలిచ్చి ఉంటారు. వారందరినీ స్వయంగా కలిసి మీ డబ్బును తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయండి. దూరాల్లో ఉండే వారికి తరచూ ఈ విషయాన్ని గుర్తుచేయండి. మనసులో ఆవేశం ఉన్నా దానిని మాటలో కనబడనివ్వకండి. సౌమ్యంగా మాట్లాడండి. తప్పక ఋణాలు వసూలవుతాయి. అనుకూల కాలం ఇది. కొత్త ఉద్యోగం కాని, ఉన్న ఉద్యోగంలోనే అదనపు బాధ్యతలు కానీ కలగవచ్చు. మీకు సహజంగా ఓర్పూ నైపుణ్యం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని నచ్చిన తీరుగా చేయండి. మీ సమర్ధతకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రదేశం సుఖంగా ఉంటే కుంటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కూడా ముందుకి సాగిపోవడానికి ఇది మీకు అనువైన కాలం. లౌకిక పరిహారం: కార్తీకం గోవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శివ విష్ణువులకి ఆనందదాయకం కాబట్టి ఓ గోవుకి సరిపడినంత తౌడుని సమర్పించి రండి లేదా పంపించండి. అలౌకిక పరిహారం: వారంలో ఏదో ఒకరోజున శంకరునికి విభూతితో అభిషేకాన్ని చేయించండి. స్వయంగా చేసుకోగలిగితే మరీ మంచిది. సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కుజ, బుధ, గురు, శుక్రులు అనుకూలంగా ఉన్న కారణంగా ఇప్పటికే ఒక వాహనాన్ని కొని ఉండి ఉండవచ్చు. పదిమందితో పరిచయం పెట్టుకుందామని మీరనుకుంటే మరో పదిమంది కూడా మీ పరిచయం కోసం వచ్చేవారు సిద్ధంగా ఉంటారు. ఎదుటివారిని తమవారిగా తీర్చిదిద్దుకోవడంలో మంచి నైపుణ్య మున్న మీరు ప్రభుత్వ అధికారులతో మంచి స్నేహ సంబంధాలను పెట్టుకుంటారు. అయితే ఏ పరిచయమైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండడమే మంచిదనే యదార్థాన్ని మరువకండి. ముఖ్యంగా వాళ్ల నుండి ఋణాలని తీసుకోవద్దు. వారు చేయలేని పనిని వారి ద్వారా మరొకరికి చెప్పించి చేయించుకోవాలనే ప్రయత్నం అసలు చేయవద్దు. అది మంచిది కా(బో)దు. స్థలాల విషయంలో లేదా ఆస్తి అమ్మకపు విషయంలో ఏవైనా లోటుపాట్లు మీరు తెలిసి కానీ, తెలియక గాని చేసి ఉంటే వెంటనే ఆ కొన్నవారి దృష్టికి ధర్మబద్ధంగా తెలియజేయడం మంచిది. లేనిపక్షంలో అది ఒక న్యాయసంబంధ వ్యవహారంగా రూపుదిద్దుకుని మీకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు. చర్మవ్యాధి గాని, శ్వాస సమస్యలు గాని వచ్చి ఉన్నా, రాబోయే సూచనలున్నాయని అన్పించినా వీలయినంత శీఘ్రంగా వాటిని పరిష్కరించుకోండి తప్ప అశ్రద్ధ చేయడం సరికాదు. తల్లితో గాని తండ్రితోగాని లేదా ఇద్దరితోనూ గాని ఏవైనా వ్యవహారాలుంటే నిజాయితీగా పరిష్కారాన్ని చేయించుకునే దిశగా ఈవారంలో ప్రయత్నిస్తే సమస్యలు విడిపోగలవు. లౌకిక పరిహారం: కార్తీకం గోప్రీతికర మాసం కాబట్టి ఇతర గ్రహాల అనుకూలత కోసమూ గోశాలని ఓ రోజున స్వయంగా శుభ్రం చేయండి లేదా శుభ్రం చేయించండి. అలౌకిక పరిహారం: ఉదయాస్తమయ కాలాల్లో ఉదయం శివుణ్ణీ సాయంత్రం విష్ణువునీ వారం రోజులపాటు వీలు చేసుకుని దర్శించండి. మనసుంటే మార్గం ఉంటుంది. వీలు కాదనుకోకండి. ఇది మీకోసమే కదా! వృషభం (ఏప్రిల్ 20 – మే 20) రవి శని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా సంతానం గురించిన విద్య, ఆరోగ్యం, అభివృద్ధి గురించి సక్రమంగా పట్టించుకోవడం లేదనే ఊహ మీకు వస్తుంది. నిజానికి మీరు అంతగా శ్రద్ధ చూపించడం లేదనేది కూడా యదార్థమే. కొద్దిగా పట్టించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లల విద్య, ప్రవర్తన విషయంలో మెత్తగా ఉండవద్దు. అలాగని కఠిన వైఖరి కూడా తగదు. ఇంటికొచ్చిన బంధువులో లేక మీ కుటుంబంతో మరింత చనువుగా వుండే మిత్రుల ద్వారానో మీ ఇంట్లో చిన్నచిన్న మనస్పర్థలేర్పడే అవకాశముంది కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో మీ దంపతులు ఆలోచించుకుని ఓ నిర్ణయాన్ని చేసుకుని దాన్ని అమలు చేయడం మరింత అవసరం. మీరు ఏదైనా ఓ ప్రత్యేక శాస్త్ర రంగానికి చెందిన వారయినట్లయితే (వైద్య, విజ్ఞానం, న్యాయం...) మీ కృషికి గుర్తింపు లభించే అవకాశముంది. కాబట్టి కృషిని మరింతగా చేయడం ఎంతైనా మంచిది. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో ఉంటే కుటుంబ యజమాని లేదా యజమానురాలు మరింత ఎత్తుకి ఎదగగలుగుతారనే విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ ఓ చోట కూర్చోబెట్టి ఉదాహరణలతో సహా చెప్పండి. ఒకప్పుడు సమష్టి కుటుంబాలుండే రోజుల్లో ఈ బాధ్యతని తాత బామ్మ అమ్మమ్మలు తీసుకుంటుండే వారు. ఈ కాలంలో కుటుంబంలో ఉన్న సభ్యుల్లో కూడా సమష్టి విధానం లోపిస్తుండడం వల్లే తరచూ సమస్యలు వస్తున్నాయి. ఆ పరిస్థితిని రానిచ్చుకోకండి. లౌకిక పరిహారం: దగ్గరలో వుండే గోశాలకి వెళ్లి ఓ ఆవుకి కావలసిన వైద్య ఔషధాలని పంపించండి లేదా వ్యయాన్ని భరించండి. అలౌకిక పరిహారం: రోజుకొక్కమారైనా శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి.ఇంటి గుమ్మంలో సంధ్యా దీపాన్ని వెలిగించి ఉంచండి. కర్కాటకం (జూన్ 21 – జూలై 22) శని, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్న కారణంగా మిగిలిన గ్రహాల అనుకూలతలు తగినంతగా ఉన్నందువల్ల లోగడ చేసిన వివాహాది శుభకార్యాల ఫ్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. లౌక్యాన్ని ప్రదర్శించకుండా ఉన్నదున్నట్టుగా ధర్మబద్ధంగా వ్యవహారాన్ని నడిపించుకున్నట్లయితే అంతా ఆనందకరంగానే ఉంటుంది. ఇష్టపూర్వకంగానూ ఎంతో కాలమైందనే ఉద్దేశ్యంతోనూ సమీప బంధువుల్ని హృదయపూర్వకంగా వెళ్లి కలుస్తారు. అది మీకు చక్కని ఫలితాలు ఇవ్వబోతోంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పైకి ఎదిగేందుకై ఏవైనా పరీక్షలూ లేదా మెళకువలూ గాని ఉన్నట్లయితే ఆలసించకుండా ఆ ప్రయత్నాలను చేయండి. అవి లాభిస్తాయి. మీకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లోనే కాక వీటికంటె వేరైన మరో రకంలో కూడా కొత్తగా ప్రతిభని చూపించగల శక్తి ఉండి తీరుతుంది కాబట్టి, అలా గూఢంగా మరుగునపడిన మీలోని శక్తిని పైకి తీయండి. మెరుగులు దిద్దండి. పదిమందిని ఆకర్షించండి. సంఘం ద్వారా వచ్చే కొన్ని లౌకిక సమస్యలు, వ్యక్తులు మీకున్న పరిచయాలని గుర్తించిన కారణంగా సమస్యలు వాటంతట అవే పరిష్కరించుకుంటూ వెళ్లిపోతాయి. వ్యక్తులు మీ దాకా రానే రారు కూడ! మీ విషయంలో ధర్మబద్ధమైన అంశాన్ని చెప్పేటప్పుడు నాన్చకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఎంతైనా అవసరం. లౌకిక పరిహారం: కార్తీకమాసం గోప్రీతికరం కాబట్టి ఓ గోవుకి క్రిమికీటక మక్షికా (ఈగలు) బాధలు లేకుండా దోమతెరని కొని ఇవ్వండి. శునకాలకి రొట్టెలు తినిపించండి. అలౌకిక పరిహారం: అరగదీసిన గంధపు చెక్క గంధాన్ని దేవాలయానికి వెళ్లి శ్రీహరికి సమర్పించి రండి. గంధపు చెక్క లేనిపక్షంలో పసుపుని అందించండి. గురువులను గౌరవించండి. వీలయితే వారికి మీకు చేతనయిన సేవ ఏదైనా చేసి, వారి ఆశీస్సులు అందుకోండి. గురుబలం ఉండటం అన్నివిధాలా క్షేమదాయకం. కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) రవి బుధులు మాత్రమే అనుకూలిస్తున్న కారణంగా తీవ్రంగా శ్రమించడానికి మీకు మీరే ముందుగా సిద్ధపడి ఉండండి. ఎంతో తేలికగా అయిపోతుందన్న ప్రతి పనీ, నిజానికి తేలికగా అయిపోయే పనీ కూడా శ్రమతో పూర్తవుతుంది. పూర్తయ్యేవరకూ మానసికాందోళన ఉంటుంది. అయితే ఆందోళన పడుతూ ఉండటం వల్ల పనులు నెరవేరవని గ్రహించండి. స్థిమితంగా ఉండి, ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. తప్పనిసరిగా స్వదేశంలోని వారు విదేశానికో, విదేశంలో ఉన్నవారు స్వదేశానికో అతి స్వల్పకాలం కోసం రావలసి ఉంటుంది. అశుభ కార్యక్రమం ఏదైనా ఉంటుందేమో అని సంశయించకండి. శుభకార్యం శుభ సంఘటన నిమిత్తంగా రావలసి లేదా పోవలసి ఉంటారు. ధన వ్యయం తప్పనిసరి. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి ఇప్పుడు పిలుపు రావచ్చును. ఏ ఉద్యోగం ఎంత జీతం అనుకుంటూ మీనమేషాలని చూడకుండా ఉన్నంతలో ఓ మార్పుని ఆనందంగా ఆహ్వానించండి. తేలికపాటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. నిర్ణయాలని తీసుకోవడంలో కొద్ది వేగాన్ని చేయడం అవసరం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో మీరు ఇప్పుడేమీ పరిష్కరించలేరని గ్రహించి కొత్త సమస్యలు రాకుండా ఉండేలా చూసుకోండి. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల విషయంలో, అలాగే ఆస్తుల్ని కొన్న–అమ్మిన వాటి విషయంలో వచ్చిన సొమ్ము గురించిన పత్రాలూ లెక్కలూ భద్రపరచుకుని ఉండండి. వివాహాలు కావలసిన వారు గాని ఉంటే తొందరగా అనుకూల నిర్ణయం తీసుకోవలసిందే. లౌకిక పరిహారం: గోశాలకి వెళ్లి గోవుకి బియ్యాన్నీ, ఆకుకూరలనీ సమర్పించండి. గో ప్రదక్షిణ చేయండి. అలౌకిక పరిహారం: రోజుకి ఓమారు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి. వీలు చేసుకుని ఒకరోజున శ్రీమహావిష్ణువుకి పంచామృతాభిషేకాన్ని చేయించండి. తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఆడంబరం కోసం, పదిమందిలో మీ గొప్పతనాన్ని చూపించుకోవాలనే దృష్టితోనూ ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తారు. పదిమందీ మిమ్మల్ని గమనిస్తున్నారన్న ఆలోచన ఉండడం అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి తాము అనుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికారుల్ని కలవడం, సిఫారసులు చేయించడం వల్ల కొత్తగా ఒరిగేదంటూ ఏమీ ఉండకపోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మీ పై అధికారులకు మాత్రం మీ మీద ఓ వ్యతిరేక దృష్టి పడే అవకాశం ఉంటుందని గ్రహించండి. ఇష్టం లేకున్నా, కష్టమైనా, నిష్ఠూరమైనా జీతం కోసం జీవితాన్ని కొంత శ్రమకు గురి చేయక తప్పదని భావించండి. పరిస్థితి ఇలాగే ఉండదు. అంతా త్వరలో.. అంటే అతి శీఘ్రంగా మీ ప్రయత్నమేమీ లేకుండానే చక్కబడిపోతుంది. ఓ చిత్రాన్ని గీసి అలా చెరిపేసిన చందంగా. మీకుండే ఆవేశం కారణంగా పై అధికారులతో కొంత వాగ్వివాదం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అలాగే మీ కింది వారిని తూలనాడాల్సిన సందర్భాలూ ఏర్పడవచ్చు. ‘ఎవరినీ కరవద్దు గానీ, బుస్సుమనకుండా ఉండమన్నానా’ అన్నట్లు పరిస్థితిని బట్టి విషయం దూరం వెళ్లకుండా ఉండేలా విచక్షణతో ప్రవర్తించండి. ఏ సందర్భంలోనూ రాతపూర్వకంగా తప్పుల్ని అంగీకరిస్తూ లొంగిపోవద్దు. తప్పులను తల మీద వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. లౌకిక పరిహారం : గోవు ప్రీతికరమైన మాసం కార్తీ్తకం. ఈ మాసంలో గోవుకు పచ్చికూరల్నీ, అవి ఇష్టంగా తినే పండ్లనీ స్వయంగా సమర్పించండి. అలౌకిక పరిహారం : శ్రీహరి హృదయస్థానంలో నిరంతరం ఉంటూ శ్రీహరిని నడిపించే లక్ష్మికి పుష్పాలు ముంచిన జలాలతో అభిషేకాన్ని చే(యి)స్తూ లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించండి. ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) గురుశుక్రులు అనుకూలిస్తూ రవి కుజ శనులు స్వల్ప అనుకూలతతో ఉన్నారు. ఈ కారణంగా మీరు అనుకున్నది తడవుగా పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. దాంతో కొంత అహంకారం రావచ్చు. అది భార్య లేక భర్త విషయంలో కొంత అసంతృప్తికి కారణమూ కావచ్చు కాబట్టి తగినంతలో ఉండడం (కుటుంబ విషయంలో మాత్రమే) సరైన కర్తవ్యం. నిర్మాణరంగంలో గాని ఉన్నా, లేక ఏదైనా ఇంటి మరమ్మతులూ గృహనిర్మాణాలూ మొదలైనవి చేపట్టినా, అవి సగంలో నిలుపుదల కావచ్చు. పనులు మందకొడిగా జరుగుతూ ఉండవచ్చు. ప్రయాణాల సమయంలో వస్తువులూ ఇతర సామగ్రీ, అలాగే వాహనాలని నడిపేటప్పుడూ, ప్రయాణించేటప్పుడూ జాగ్రత్తతో వ్యవహరించడం అవసరం. నమ్మకంతోనూ ఎంతో కాలనుండీ పరిచయంతోనూ ఉన్న మిత్రులు రుణాన్ని కానీ అడిగినట్లయితే ఇవ్వడం మంచిది కాదు. ధననష్టం మాట అటుంచి విరోధం తప్పక వచ్చే అవకాశముంది. అలాగని మీరు హామీగా ఉండి ఇతరుల ద్వారా ఇప్పించడం మరింత తగని పని. ఇదే సందర్భంలో వాగ్దానాలూ మంచిది కాదని గ్రహించుకోవాలి. మీ పరిచయాన్ని ఆధారం చేసుకుని మీకు ముఖ్యమైన వారి నుండి ఏదైనా సహాయాన్ని ఎవరైనా పొందుతూ ఉండవచ్చు. అలాంటి వారిని గమనించి వీరిని మందలించి ఆ ముఖ్యమైన వారికి విషయాన్ని వివరించి చెప్పండి. ఎక్కువ చనువునియ్యడం– కుటుంబ గోప్యత లేకపోవడమే దీనికి కారణమని గ్రహించండి. లౌకిక పరిహారాలు: నిజమైన అర్హులైన వారిని గ్రహించి (సాధారణ గృహస్థులకి) వారికి చలి బాధ లేకుండా దుప్పట్లని ఇవ్వండి. అలౌకిక పరిహారం: శనికి సంబంధించిన శ్లోకాన్ని రోజుకి 361 మార్లు పఠించడం ఎంతైనా సత్ఫలితాలనిస్తుంది. (నీలాంజన సమాభాసమ్ రవిపుత్రం యమాగ్రజమ్ ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్) కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) బుధుడు అనుకూల దృష్టితో ఉండగా గురు శుక్ర శనులు స్వల్ప అనుకూలతతో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దాచుకున్న సొమ్మ మరింతగా పెరిగి (క్రయ విక్రయాల కారణంగా) ఆనందాన్నివ్వడమే కాకుండా సంతానానికి వివాహాది శుభకార్యాలు అనుకోకుండా కలిసొస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారున్నట్లయితే రావలసిన బకాయిలు శీఘ్రంగా చేతికొస్తాయి. వ్యవసాయదారులకి పంట బాగా వస్తుందనే నమ్మకంతో పాటు గిట్టుబాటు ధర లభించే కారణంగా రాబోయే ఆదాయం మరింత ఉత్సాహాన్ని కల్గిస్తుంది. అయితే తొందరపడి ఇల్లో పొలమో స్థలమో... కొనెయ్యద్దు. ఏదేని కళారంగానికి చెందిన వాళ్లకి అనుకూలంగా ఉన్న కారణంగా విదేశీ ప్రయాణం చేయవలసిన అవసరం లేదా ఉన్న చోటనే మంచి కార్యక్రమానికి అవకాశం లభించే గ్రహస్థితీ కన్పిస్తోంది. గాత్ర సంగీతం కంటె వాద్యపరికరాల మీద స్పష్టమైన అధికారం మీకొస్తుంది. స్వదేశీయులు విదేశానికీ, విదేశీయులు స్వదేశానికీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకుంటే విదేశానుమతి (వీసా)తప్పక లభిస్తుంది. సంతానానికి చదువు, ప్రవర్తన బాగుంటాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన పిల్లలున్నట్లయితే స్థానచలనం కలగవచ్చు. పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యుంటే ఈమారు విజయం తథ్యం. లౌకిక పరిహారాలు: మీకు సమయం వృథా అయ్యే అవకాశం ఉన్నందువల్ల మిత్రులతో, సమీప బంధువులతో అనవసర కాలక్షేపాన్ని మానాల్సిందే. మొగమాటం వీడి మీ సమయానికి ఉన్న విలువని చెప్పండి. అలౌకిక పరిహారాలు: విష్ణ్వాలయ ప్రాంగణంలో లేదా మీకు సమీపంగా ఉన్న ఏదేని గుడిలో శ్రీ విష్ణు సహస్ర నామాలని పఠించి ఒకరోజు ప్రసాదాన్ని చేయిం^è ండి. లేదా కనీసం మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని వీలయినన్ని మార్లు పఠిస్తూ, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించండి. శక్తిమేరకు ప్రసాదం తయారు చేసి, నివేదించి, మీరు తీసుకోవడంతోపాటు ఇతరులకు కూడా పంచండి. వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) రవి, బుధ, శుక్ర, రాహువులు అనుకూలురుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు గాని గమనించుకుని చూస్తే మీలో మీకే ఎంత మార్పుందో ఆశ్చర్య పడతారు. ఒకప్పటి ఆవేశం, నా మాటే నెగ్గాలనే పట్టుదల, ఎదుటివాణ్ణి నిలదీసే తీరు.. అన్నీ పూర్తిగా తగ్గి ప్రశాంతమైన రుషిలాగా ధర్మం కోసం ఎదురుచూస్తూ నిలబడతారు జీవితం అనే అద్దం ముందు. ఇది మీకు చాలా మంచి కాలం. జీవితంలో నిజమైన పాఠాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసే గ్రహం శని. ఆయన శిక్షణలో మీరు 2013 వ సంవత్సరం నుండీ, మళ్లీ మాట్లాడితే 2010 నుండీ ఉన్నారు. ఇక మిమ్మల్ని ఇంతగా పరీక్షకు గురి చేసి మీలో అంతఃపరివర్తనని (మీకు మీరుగా మారే విధానాన్ని) పొందించగల గ్రహం మరొకటి లేదు. కొన్ని సందర్భాలలో రుణదాతల నుండి తీవ్రమైన ఒత్తిడులను, కొన్ని సందర్భాలలో దంపతులు వేర్వేరుగా ఉండే పరిస్థితినీ, ఇంకా కొన్ని సందర్భాల్లో రక్షక భటుల వద్దకు వెళ్లి సమాధానాన్ని నిలబడి చెప్పవలసిన అగత్యాన్నీ, మరికొన్ని సందర్భాల్లో న్యాయ స్థానంలో ముద్దాయిగా అందరిముందూ కన్పించవలసిన ధోరణినీ నిష్కాణంగానూ, నిజంగా మీరు తప్పు చేయకుండానూ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటివి ఉంటే ధర్మబద్ధంగానే ఉండండి. సముద్రపు అలకు తలొంచితే ఎలా ఒక్కసారి దూసుకుని కెరటం వెళ్లిపోతుందో అలా ఒడ్డుకు చేరే అవకాశం దగ్గరకొస్తోంది. తల్లీ, తండ్రీ లేదా ఇద్దరి ఆరోగ్యాలను ఒకమారు జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని చెప్పడం, లేదా పరీక్ష చేయించడం చెయ్యండి. ఏ భయమూ లేదని గ్రహించండి. లౌకిక పరిహారం : కుష్టువ్యాధిగ్రస్తులకు ఆహారం నింపిన పొట్లాలను పంచండి. అలౌకిక పరిహారం : శనికి తైలాభిషేకాన్ని నువ్వులతో అర్చించి ఆ నువ్వుల్నీ, నూనెనీ పాత ఇనుప వస్తువు (బూర్లె మూకుడు వంటివి)తో పాటు శనివారం నాడు బ్రాహ్మణునికి దక్షిణతో దానం చెయ్యండి. శని శ్లోకాన్ని 19 మార్లు పఠిస్తూ 19 ప్రదక్షిణల్ని నవగ్రహాలకు చెయ్యండి. మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) శుక్రుడు అనుకూలునిగా ఉన్న కారణంగా ఉన్న పళంగా తీర్థయాత్రలకో విహార యాత్రలకో వినోద పర్యటనలకో వెళ్లాలనే నిర్ణయానికొచ్చి వెంటనే ప్రయాణాలు చేస్తారు. అనుకున్న దానికి మించి ధనవ్యయాన్ని చేస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ధనవ్యయం అయిందనే ఆందోళన కంటే, అరుదైన వస్తువులను తెచ్చుకోగలిగామన్న ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది మీలో. బంధుమిత్రులు... చాటున మీ గురించి మరోలా అనుకుంటూ, మీ ముందు మాత్రం ప్రశంసిస్తూ ఉంటారు. వారి మాటలు నమ్మి మీరు మరింతగా ధననష్టాన్ని చేసుకుంటారు. ఈ పద్ధతిని విడనాడి తీరాలని గ్రహించండి. దుర్జన మైత్రి కలిగే అవకాశం ఉంది. దాంతో జూదాలలో ధనాన్ని పెట్టే అలవాటు రాబోతోంది. మీరు ఆ ఉచ్చులో పడకండి. మీ కుటుంబ సభ్యులకి ఇలాటి పరిస్థితి రాబోతోందని చెప్పి మిమ్మల్ని ఆ జూదానికి ఆకర్షితులు కాకుండా చేయవలసిందని చెప్పుకోండి. జూదం మీకు రాని పక్షంలో పందాలు కాయడంలో ఆసక్తి చూపించే ప్రమాదం పొంచి ఉంది. మరోమారు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవలసిన కాలం ఇది. భార్య లేదా అత్తగారి ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంది కుజ బుధ శని రాహుకేతువుల అననుకూలత కారణంగా. సరైన కాలంలో ప్రతిస్పందిస్తే వైద్యవ్యయం తక్కువ అవుతుంది. మనశ్శాంతి శీఘ్రంగా కలుగుతుందని గుర్తించి వీలైనంత తొందరలో వారికి ఆరోగ్యపరీక్షలని నిర్వహింప చేయండి. లౌకిక పరిహారం: ప్రవహించే నీటిలో బియ్యపు పిండినీ, అరటిపండు గుజ్జునీ జలచరాలకి వేయండి. నది, ఏరు, వాగువంకలు అందుబాటులో లేకపోతే సరస్సులు, చెరువుల్లో వేయవచ్చు. అలౌకిక పరిహారాలు: ఒక దేవాలయ పురోహితుణ్ణి లేదా పండితుడిని సాదరంగా ఇంటికి ఆహ్వానించి మీ శ్రీమతితోనే వంట చేయించి సంతృప్తికరంగా భోజనాన్ని పెట్టి చక్కని దక్షిణ ఇచ్చి పంపండి. భోజనం పెట్టేటప్పుడు ‘త్రిమూర్తి స్వరూపాయ సద్గురవే నమః’ అని చెప్పండి. మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) రవి శుక్ర రాహువులు అనుకూలురై ఉన్న కారణంగా ఎప్పుడో మీరు వేసుకున్న ఓ ప్రణాళికని ఇప్పుడు అమలు చే సే అవకాశం రాబోతోంది. దాన్ని సక్రమంగానూ, అహంకారం లేకుండానూ గాని ఆచరణలో పెడితే చెప్పలేని ఆనందం, దానితోబాటు చక్కని ధనాదాయం లభిస్తుంది. సంతృప్తికరంగా జీవించే అవకాశం లభిస్తుంది. కొత్త ఇల్లు లేదా కొత్త పొలానికి తగిన వసతులని ఏర్పాటు చేయడంలో నిమగ్నులవుతారు. ఏవో కొన్ని కారణాలతో ఇంతకుముందు తమకి తామే శత్రువులైనవారు తమ శత్రుత్వాన్ని విడిచి మీ వద్దకి వారే వస్తారు. వచ్చినంత మాత్రాన వారు మీకు అనుకూలమై పోయారని భావించకుండా తగుమాత్రపు దూరాన్ని పాటిస్తూనే ఉండడం మంచిది. అనారోగ్యం ఏ మాత్రమూ లేదుగదా అనే ఆనందంతో ఆహార విహారాల పట్ల అశ్రద్ధ ఏమాత్రమూ సరికాదు. ఆహారవిహారాదులు క్రమం తప్పితే ఆరోగ్యం పాడవడానికి ఎంతోకాలం పట్టదని మర్చిపోవద్దు. ప్రశంస(ల)కి లొంగిపోతే అకాల నిద్ర అకాల భోజనం అనే స్థితికి వెళ్లిపోతారు. మొహమాటం లేకుండా ఈ తిండి నిద్రల విషయంలో స్పష్టమైన ఆదేశాలని పొందండి. జరిగిన 3, 4 నెలలకింద ఏదో ఒక చక్కటి ఉద్యోగం లేదా ఆస్తీ మీకు సంక్రమించి ఉండవచ్చు. దాని విషయంలో నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధనీ చూపకండి. ఇప్పటి ఈ ఆస్తి మీకు జీవితంలో పెద్ద విలువని కలిగి ఉన్న ఆస్తిగా మారిపోబోతోంది. ఎంత ఒత్తిడికి గురి చేసినా ఉద్యోగం– వృత్తి– వ్యాపారం... అనే వీటిని మారడం ఏ విధంగానూ సమంజసం కాదు. లౌకిక పరిహారాలు: ఇతరుల విషయాల్లో ‘తీర్పరి’గా ఉండం ఏమాత్రమూ సరికాదు. అలౌకిక పరిహారాలు: అవకాశం ఉంటే సంకట హర గణపతి స్తోత్రం రోజుకు నాలుగుమార్లు చదువుకోండి. అది కుదరకపోతే వినాయకునికి గరికతో పూజించండి. గణపతికి సంబంధించిన మంత్రాలు లేదా స్తోత్రాలని చదువుతూ పూజ నిర్వహించండి. ఉదాహరణకి ‘ఓం గం గణపతయే నమః’ 32 అరటిపండ్లని లేదా 32 చిన్న ఉండ్రాళ్లని గణపతికి నివేదన చేయండి. – డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు , జ్యోతిష్య పండితులు -
రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆయన పొలిటికల్ ప్యూచర్‌పై ఎడతెగని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అభిమానులను ఎన్నడూ నిరాశ పరచనని హామీ ఇచ్చారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశానికే అభిమానులతో రజనీకాంత్ సమావేశాలని రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన ఆలోచనలకు అభిమానుల సలహాతో పదును పెట్టేందుకు సిద్ధమైన ఆయన రాజకీయ అరంగేట్రం ఇక ఎంతో దూరంలో లేదని అంటున్నారు. ఆ శుభదినం ఈ నెల 19వ తేదీ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తదితర పార్టీలు అప్పుడే ప్రకటించేశాయి. కేరళలోని ఒక ప్రముఖ జోస్యుని వద్ద రజనీకాంత్ సన్నిహితుడు ఒకరు జాతకం చూపగా, రాజకీయాల్లో రజనీ రాణిస్తారు, ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని అభిమానులను జిల్లాలవారీగా విభజించి వారితో సమావేశమయ్యే కార్యక్రమం ఈ నెల 15వ తేదీన రజనీకాంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో కన్యాకుమారి, కరూరు, దిండుగల్లు, తిరునెల్వేలి, తూత్తుకూడి, తేని జిల్లాలకు చెందిన సుమారు 1500 మందికిపైగా అభిమానులను ఆయన కలుసుకుని, ఫొటోలు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న అభిమానులను మాత్రమే లోనికి అనుమతించి ఫొటోలు దిగనిస్తున్నారు. మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఉదయం తొమ్మిది గంటలకు రాఘవేంద్ర కల్యాణ మండపానికి రజనీకాంత్ చేరుకున్నారు. గుర్తింపు కార్డుల్లేని అభిమానుల బైటనే ఉండిపోవడం గమనించి, కారు దిగారు. ఆయనను చూడగానే ‘రజనీకాంత్ వాళ్గ(రజనీకాంత్ వర్ధిల్లాలి), ‘తలైవర్ రజనీ వాళ్గ’ ( అధినేత వర్ధిల్లాలి) అంటూ నినాదాలు చేశారు. రజనీకాంత్ అందరికీ అభివాదం చేస్తూ పలకరించి ఆ తరువాత లోనికి వెళ్లిపోయారు. తిరువణ్ణామలై, శివగంగై, విళుపురం జిల్లాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ వరుస సంఖ్యలను కేటాయించి జిల్లాకు 250 మంది చొప్పున ఎంపిక చేసి ఫొటోకు అనుమతించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని ఆయనపై ఒత్తిడి చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో రజనీ మాట్లాడుతూ అభిమానులతో సమావేశం కావడం, ఫొటోలు తీసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నాలుగో రోజైన గురువారం (ఇవాళ) కడలూరు, తంజావూరు, పాండిచ్చేరి, కారైక్కాల్ జిల్లాలకు చెందిన అభిమానులు హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీతో సమావేశాలు ముగుస్తుండగా, మిగిలిన జిల్లాల అభిమానుల కోసం రెండో దశ సమావేశాలు వచ్చేనెల నిర్వహిస్తారని తెలుస్తోంది. -
2017లో దలాల్ స్ట్రీట్‌కు శని గండమా?
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరాదిలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతోంది. ఎవరికి వారు తమకు కొత్త ఏడాది 2017 ఎలా ఉండబోతుంది? కొత్త కార్యాచరణలు ఏం చేపట్టాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. దలాల్ స్ట్రీట్ విశ్లేషకులు కూడా కొత్త సంవత్సరాది అంచనాల్లో మునిగిపోయారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొనే ఆటుపోట్లపై జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 2017 సంవత్సరమంతా పూర్తిగా ఒడిదుడుకులమయంగా సాగుతుందని దలాల్ స్ట్రీట్ జ్యోతిష్యులు చెబుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం దేశీయ మార్కెట్లు మరింత సవాళ్లుగా మారాయని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా పడిపోయిన మార్కెట్లు, ఆ దెబ్బకు పూర్తిగా కోలుకోలేక బేరిస్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. అటు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు సహకరించలేకపోతున్నాయి. ఈ బేరిస్ ట్రెండ్ 2017వరకు సాగుతుందట. ఒకవేళ లాభపడిన స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. 400 పాయింట్ల రేంజ్లో 7,730 కీలక మార్కు నుంచి 8,230 పాయింట్ల మధ్యలో కదలాడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. డీమానిటైజేషన్ అనంతరం నెలకొన్న గడ్డు పరిస్థితులు 2018 ఆగస్టు వరకు ఉంటాయని ముంబాయికి చెందిన సెలబ్రిటీ ఆస్ట్రో-న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని చెప్పారు. 'మనం 71వ స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతున్నాం. 71 అనే సంఖ్య 8తో సమానం. ఎనిమిది శనిని సూచిస్తుంది. ఎక్కువ బాధలు పెట్టే దేవుడిగా శనికి పేరుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా నవంబర్ 8వ తేదీన సాయంత్రం ఎనిమిది గంటలకే తీసుకున్నారు' అని విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. బాధలు పెట్టిన అనంతరం శని శుభాలు చేకూరుస్తాడని, తర్వాత వచ్చే 72వ ఏడాది బాగుంటుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఎవరైనా 2017లో పెట్టుబడులు పెట్టదల్చుకుంటే, దేవుడిపై భారం వేసి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. మంచి రంగంలో పెట్టుబడులు పెట్టేలా నిర్ణయించుకోవాలంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారమైతే 2017 ఏడాది మిక్స్‌డ్‌గా ఉంటుందని, కానీ పెట్టుబడులకు పాజిటివ్ సంకేతం కాదంటున్నారు ఆస్ట్రాలజర్ ముర్తాజా అలీ. అయితే పెట్టుబడిదారుల కోసం ఏమైనా మంచి ఆప్షన్లు ఉన్నాయో లేవో వేచిచూడాల్సిందేనన్నారు. కేంద్ర బడ్జెట్ వచ్చేంతవరకు కూడా ఆటో, కన్జ్యూమర్ డురెబుల్స్, ఎఫ్ఎమ్సీజీలు పెట్టుబడులు పెట్టడానికి తగిన స్టాక్స్ కావని హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ కూడా నెగిటివేనంటున్నారు. సిమెంట్, స్టీల్ స్టాక్స్‌ను భయం లేకుండా కొనుగోలు చేయొచ్చని భరోసా ఇస్తున్నారు. -
యాదాద్రిలో శివాలయం
ఎకరం స్థలంలో విస్తరణ.. పంచాయతన సైకత శివాలయంగా.. యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మినారసింహస్వామి పుణ్యక్షేత్రం విస్తరణలో భాగంగా కొండపై గల శివాలయం అభివృద్ధిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. కొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని మరింత సువిశాలంగా విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తోగుట్ట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ ఆలయాన్ని, ప్లాన్‌ను పూర్తిగా పరిశీలించి వైటీడీఏ అధికారులతో సమాలోచనలు జరిపారు. రానున్న రోజుల్లో పంచాయతన సైకత శివాలయంగా పేరు గాంచనున్నట్లు పండితులు, జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఎకరం స్థలంలో రాహుకేతు ఆలయం, దక్షిణ ముఖంగా ఆంజనేయస్వామి, పార్వతీదేవి, గణపతి ఆలయాలతోపాటు ప్రత్యేకంగా మణిమయ ఆలయం నిర్మించనున్నారు. వీటితోపాటు రామాలయం, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, రాహుకేతువులు, నవగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. సైకత లింగం లేదా స్పటిక లింగం తేనున్నారు. భక్తుల అభిషేకాలకు ప్రత్యేక స్పటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్తీకదీపాలకు ప్రత్యేక మండపం, తూర్పుఈశాన్యంలో పార్వతి ఆలయం రానుంది. రూ.500 కోట్లతో అభివృద్ధి యాదాద్రికి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం శివాలయానికి వెళ్లడం ఆనవారుుతీ. అందుకే శివాలయాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ.500 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిసింది. ఫిబ్రవరిలో పనులను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. -
జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?
బెంగళూరు: ఇలాంటి విపత్తు ఒకటి వచ్చి మీద పడుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందరూ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులకు ఇప్పుడు కర్ణాటకలో తమ భవిష్యత్తేమిటో తెలియడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజా నిర్ణయం కనుక అమలైతే ఆ రాష్ట్రవ్యాప్తంగా టీవీల్లో ప్రసారమవుతున్న లైవ్ ఆస్ట్రాలజీ కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం కనిపిస్తున్నది. కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో మాట్లాడిన సిద్దరామయ్య టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే లైవ్ జ్యోతిష్య కార్యక్రమాలపై నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. 'కర్ణాటకలో ప్రతి టీవీ చానెల్ కూడా జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారం చేయాలని భావిస్తున్నది. ఈ కార్యక్రమాలకు బాగా ప్రేక్షకాదరణ ఉన్నట్టు కనిపిస్తున్నది. మా ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలపై నిషేధించడానికి ఇదే సరైన సమయం' అని ఆయన అన్నారు. సిద్దరామయ్య తనను తాను అజ్ఞాతవాదిగా అభివర్ణించుకుంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేకపోవడం. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయనను హేతువాదిగా ప్రశంసిస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తీరు కొంచెం మారినట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దరామయ్య దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. జ్యోతిష్కులను కూడా సంప్రదిస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సిద్దరామయ్య తన భార్య మాత్రమే జ్యోతిష్కులను నమ్ముతుందని, తాను అలాంటి వాటికి వ్యతిరేకమని చెప్పారు. దీంతో ఆయన పాలనలో తమకు ఎలాంటి ఢోకా ఉండదని కర్ణాటకలోని జ్యోతిష్కులు భావించారు. అయితే ఆయన తాజా ప్రకటన మాత్రం వారి భవిష్యత్తును ఊగిసలాటలో పడేసింది. కర్ణాటకలో డజన్ల కొద్దీ న్యూస్, ఎంటర్టైన్మెంట్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లన్నింటిలోనూ ప్రతి రోజూ జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే కొందరు జ్యోతిష్యులు పెద్ద సెలబ్రిటీలుగా కర్ణాటకలో చెలామణి అవుతున్నారు. కన్నడ కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే నరేంద్రబాబు శర్మ 'బృహత్ బ్రహ్మాండ' కార్యక్రమం.. ఆ చానెల్లోనే ప్రసారమయ్యే 'బిగ్‌బాస్-1' తర్వాత అంతటి ప్రజాదరణను సాధించింది. టీవీ చానెళ్లకు లైవ్ ఆస్ట్రాలజీ షోలే ప్రధాన ఆదాయ వనరు అని, ఆ కార్యక్రమాలు ఆగిపోతే కొన్ని చానళ్లు మనుగడ సాగించడం కష్టమని పరిశీలకులు చెప్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాలను నిషేధించాలని, వీటివల్ల సమాజంలో మూఢనమ్మకాలు, మానసిక సమస్యలు ప్రబలుతున్నాయని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తుండగా.. ఈ కార్యక్రమాలను సమర్థించే మరో వర్గం వారు మాత్రం తమ వ్యక్తిగత అభీష్టాలలో తలదూర్చడానికి ప్రభుత్వం ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం సిద్దరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు టీవీల్లో జ్యోతిష్య కార్యక్రమాలు కొనసాగాలా? వద్దా? అనే చర్చకు మరింత ఆజ్యం పోశాయి. -
భలే మంచిరోజు
ఎన్నికల వేళ నగరంలో జ్యోతిష్యులకు పెరిగిన డిమాండ్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక పూజలు, హోమాలు బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల వేడి నగరంలో రోజురోజుకు పెరుగుతోంది. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు గాను మరో మూడు రోజులే గడువు ఉన్న సమయంలో అన్ని ప్రధాన పార్టీలు శుక్రవారం నాటికి తమ అభ్యర్థుల పూర్తి స్థాయి జాబితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఇక జాబితాలో స్థానం సాధించిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మిగిలింది కేవలం శనివారం, సోమవారం మాత్రమే. అందువల్ల తమకు కచ్చితంగా జాబితాలో చోటు లభిస్తుందని భావిస్తున్న అభ్యర్థులంతా ఈ రెండు రోజుల్లో తాము నామినేషన్ వేసేందుకు ఏ రోజు మంచిదో తెలుసుకునేందుకు గాను జ్యోతిష్యుల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. ఏ రోజున నామినేషన్ దాఖలు చేస్తే తమ విజయం గ్యారంటీనో తెలుసుకొని ఆయా రోజుల్లోనే నామినేషన్ దాఖలు చేయాలని వీరంతా భావిస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తన మొదటి విడత జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. కాగా, వీరు తమ విజయం కోసం ప్రత్యేక పూజలను చేయించడంలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రస్తుతం నగరంలో జ్యోతిష్యులకు, పురోహితులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నామినేషన్కో మంచిరోజు... బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈనెల10న ముగియనుందన్న విషయం తెలిసిందే. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంపై శుక్రవారం సాయంత్రానికి కానీ అన్ని పార్టీలు పూర్తి స్థాయి జాబితా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కచ్చితంగా తమకే బీ-ఫాంలు లభిస్తాయని నమ్మకంతో ఉన్న నేతలంతా ఇప్పటికే జ్యోతిష్యులను సంప్రదిస్తూ, నామినేషన్ వేసేందుకు ఏది మంచి రోజో చెప్పాలని కోరుతున్నారు. ఈ విషయంపై కర్ణాటక జ్యోతిష్యుల సంఘం సభ్యుడొకరు స్పందిస్తూ...‘ ఏ రోజు నామినేషన్ వేయాలో చెప్పాల్సిందిగా కోరుతూ మా వద్దకు వస్తున్న అభ్యర్ధుల సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్ధులు ఈ వరుసలో ఉన్నారు. అభ్యర్ధుల జన్మనక్షత్రం, పుట్టిన తేదీ తదితర వివరాలను బట్టి మేం నామినేషన్ దాఖలుకు శనివారం, సోమవారాల్లో ఏది మంచి రోజో చెబుతున్నాం. అంతేకాదు ఈ ఎన్నికల్లో తమను గెలుపు వరిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా చాలా మంది అభ్యర్ధులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఈ వివరాలు చెప్పడానికి అభ్యర్ధి వివరాలతో పాటు ప్రత్యర్ధి జన్మనక్షత్రం కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం’ అని తెలిపారు. గెలుపు కోసం ప్రత్యేక పూజలు.... నామినేషన్లు దాఖలుకు, పోలింగ్ తేదీకి మధ్య చాలా తక్కువ సమయం ఉండడంతో తమను విజయ తీరాలకు చేర్చే భారాన్ని చాలా మంది నేతలు ఆ భగవంతుడికే అప్పగించాలని భావిస్తున్నారు. అందుకే మొదటి జాబితాలో స్థానం సంపాదించుకున్న వారితో పాటు సీటు తప్పక లభిస్తుందని భావిస్తున్న నేతలంతా తమ గెలుపును ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమను గెలిపించాల్సిందిగా భగవంతుని ప్రార్ధిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతో పాటు నగరంలోని ప్రఖ్యాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో రాష్ట్రంలో పురోహితులు, జ్యోతిష్యులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. -
జూన్‌లో పునాది రాయి
ఏపీ రాజధానికి జూన్ 11వతేదీ లేదా 12న శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 11వ తేదీ లేదా 12వ తేదీన పునాది రాయి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. జూన్ 11, 12వ తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచిం చడంతో ఈ ముహూర్తం మేరకు రెండింటిలో ఏదో ఒక రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కృష్ణా నదిని ఆనుకుని వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, బోరుపాలెంలో పాలనా రాజధాని నిర్మాణం కానున్న నేపధ్యంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్కడే జరగవచ్చని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు సింగపూర్ ప్రధానమంత్రిని కూడా దీనికి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సింగపూర్ కంపెనీలు ఈలోగా రాజధాని నిర్మాణంపై మాస్టర్ ప్లాన్‌ను అందచేస్తాయని తెలిసింది. కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్, ఎమ్మెల్యే, మంత్రులు నివాస గృహాలు, హైకోర్టు, ఆసుపత్రులు, పాఠశాలలు, మంచినీటి సరఫరా, రహదారుల నిర్మాణాలకు ప్రాథమికంగా రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. కేంద్రం సూచనల మేరకు దీన్ని అందచేసింది. సీఎం తాత్కాలిక సచివాలయానికి రూ.90 కోట్లు రాజధాని నిర్మాణానికి 20,500 ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికత నివేదికను రూపొందించింది. భూమిని సేకరించేందుకు, పునరావాసం అమలుకు ఎకరానికి రూ.కోటి వంతున వ్యయమవుతుందని అంచనా వేసిం ది. ఈ లెక్కన రూ.20,500 కోట్లు ఆర్థిక సాయం కావాలని కేంద్రానికి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్రణాళిక, సవివరమైన ప్రాజెక్టు నివేదిక తయారీ, కన్సల్టెన్సీ చార్జీల కింద రూ.500 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ముఖ్యమంత్రి తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి 14 ఎకరాల స్థలం అవసరమని, దీనికి రూ.90 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 655 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా రాజధాని నిర్మాణానికి రూ.8,962.17 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించింది. -
'వారి' సలహాతోనే చిరు సినిమా ఆలస్యం!
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహుర్తం దగ్గరపడుతోంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత ఆయన .... తన 150 సినిమా వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ...చిరు 150వ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ సినిమాపై చిరంజీవి మాత్రం పెదవి విప్పలేదు. ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగినా ...దర్శకుడి, కథ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా చిరంజీవి 150 సినిమా ఆలస్యం కావటానికి జ్యోతిష్కుల సలహా అట. ఈ పుకారు ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 22న చిరంజీవి తన పుట్టినరోజు సదర్భంగా నేపాల్‌లోని పశుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరు...150 సినిమాకు మంచి ముహుర్తం పెట్టాలని నేపాల్ జ్యోతిష్కులను కోరారట. అయితే అందుకు కొంతకాలం ఆగాలని, అక్టోబర్, నవంబర్ మాసాల్లో శివారాధనలో గడపాలని సూచించారట. కార్తీక మాసం అనంతరం సినిమా ప్రకటనకు మంచిదని సూచించారట. అలాగే జ్యోతిష్కుల వాస్తు సలహా మేరకు చిరంజీవి ఇటీవల తన నివాసానికి భారీగా మార్పులు, చేర్పులు చేయించిన విషయం తెలిసిందే. దాంతో చిరంజీవి తన 150 సినిమాను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. -
మోడీకి సమస్యలు తప్పవంటున్న జ్యోతిష్యులు!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అవుతాడని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు.. జ్యోతిష్యులు కూడా గళం కలిపారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంటూనే సమస్యలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం మాత్రం సమస్యలపైనే ప్రధానంగా సావాసం చేయాల్సి వస్తుందని ఘంటా బజాయించీ మరీ చెబుతున్నారు. ఎన్డీఏ నేతృత్వంలో మోడీ దేశానికి పగ్గాలు చేపట్టాక.. పలు సమస్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే ఆస్కారం ఉందన్నారు. దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని చెబుతున్నజ్యోతిష్యులు మాత్రం.. బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మిత్రపక్షాలతో కలసి బీజేపీ గెలుచుకునే సీట్లు 250 నుంచి 300 వరకు ఉండవచ్చని హరిద్వార్ కు చెందిన ప్రముఖ్య జ్యోతిష్యుడు రత్న కౌశిక్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా వచ్చే అక్టోబర్ లో దేశంలో చోటు చేసుకునే ఎన్ కౌంటర్ సంబంధిత అంశాలు మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికలు తరువాత వచ్చినట్లయితే మోడీ బలమైన ప్రధాని అయ్యేవారని తెలిపారు. మిత్రపక్షాలతో మోడీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పని ముంబైకు చెందిన జ్యోతిష్య పరిశోధకుడు మిలన్ థాకూర్ తెలిపారు. ఈ జూలై నుంచి 2015 నవంబర్ వరకూ మోడీ రాజకీయ పరమైన సమస్యలు తలకు మించిన భారంగా పరిగణించే అవకాశం ఉందని కోల్ కతా కు చెందిన మరో జ్యోతిష్యుడు రాకేష్ రాజ్ గుప్తా తెలిపారు. -
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పండి... రూ.10 లక్షలు గెలుచుకోండి
జ్యోతిష్యులకు హేతువాదుల సవాల్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా చెప్పి రూ. 10 లక్షలు గెలుచుకోవాలని దేశంలోని జ్యోతిష్యులకు హేతువాదులు సవాల్ విసిరారు. హేతువాద ఉద్యమ నేత బాబు గోగినేని, లక్ష్మణ్‌రెడ్డి (జనచైతన్య వేదిక), సాంబశివరావు(మానవ వికాస వేదిక), డీఎస్ఎన్ రాజు(దిశ సైన్స్ సెంటర్)లు శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా తమకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తులున్నాయని, జ్యోతిష్యం సైన్స్ అని నమ్మబలికే జ్యోతిష్యులకు తాము ఈ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. 40 ఏళ్లుగా తాము చేస్తున్న సవాళ్లకు జవాబు చెప్పలేక జ్యోతిష్యులు భంగపడుతూనే ఉన్నారన్నారు. అఖిల భారత హేతువాద సంఘాల సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ నరేంద్రనాయక్ సంధించిన 20 ప్రశ్నలకు 19 సరైన సమాధానాలు చెప్పిన వారు ఎవరైనా పారితోషికాన్ని పొందవచ్చన్నారు. జోస్యం చెప్పాల్సిన అంశాలు... 1. కాబోయే భారత ప్రధానమంత్రి ఎవరు? 2. ఏ పార్టీ లేక పార్టీలతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? (సంకీర్ణ ప్రభుత్వం అయితే, ఎన్ని పార్టీలు ఉంటాయి? వాటిలో ఏయే పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయో తదితర 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.) సవాలును ఎదుర్కొనే వారు తాము విధించిన నియమ నిబంధనల మేరకు తమ జోస్యాన్ని రాతపూర్వకంగా మే 12లోపు నరేంద్రనాయక్, వీటీరోడ్- కర్ణాటక అనే చిరునామాకు పంపించాలని కోరారు.