మోడీకి సమస్యలు తప్పవంటున్న జ్యోతిష్యులు! | Modi will be strong leader but will face problems:Astrologers | Sakshi
Sakshi News home page

మోడీకి సమస్యలు తప్పవంటున్న జ్యోతిష్యులు!

Published Thu, May 15 2014 4:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీకి సమస్యలు తప్పవంటున్న జ్యోతిష్యులు! - Sakshi

మోడీకి సమస్యలు తప్పవంటున్న జ్యోతిష్యులు!

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అవుతాడని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు.. జ్యోతిష్యులు కూడా గళం కలిపారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంటూనే సమస్యలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం మాత్రం సమస్యలపైనే ప్రధానంగా సావాసం చేయాల్సి వస్తుందని ఘంటా బజాయించీ మరీ చెబుతున్నారు. ఎన్డీఏ నేతృత్వంలో మోడీ దేశానికి పగ్గాలు చేపట్టాక.. పలు సమస్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే ఆస్కారం ఉందన్నారు. దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని చెబుతున్నజ్యోతిష్యులు మాత్రం..   బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.  మిత్రపక్షాలతో కలసి బీజేపీ  గెలుచుకునే సీట్లు 250 నుంచి 300 వరకు ఉండవచ్చని హరిద్వార్ కు చెందిన ప్రముఖ్య జ్యోతిష్యుడు రత్న కౌశిక్ మీడియాకు తెలిపారు.

 

ఇదిలా ఉండగా వచ్చే అక్టోబర్ లో దేశంలో చోటు చేసుకునే ఎన్ కౌంటర్ సంబంధిత అంశాలు మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందన్నారు.  ప్రస్తుతం జరిగిన ఎన్నికలు తరువాత  వచ్చినట్లయితే మోడీ బలమైన ప్రధాని అయ్యేవారని తెలిపారు. మిత్రపక్షాలతో మోడీకి  ఇబ్బందికర పరిస్థితులు తప్పని ముంబైకు చెందిన జ్యోతిష్య పరిశోధకుడు మిలన్ థాకూర్ తెలిపారు. ఈ జూలై నుంచి 2015 నవంబర్ వరకూ మోడీ రాజకీయ పరమైన సమస్యలు తలకు మించిన భారంగా పరిగణించే అవకాశం ఉందని కోల్ కతా కు చెందిన మరో జ్యోతిష్యుడు రాకేష్ రాజ్ గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement