'వారి' సలహాతోనే చిరు సినిమా ఆలస్యం! | astrology hurdles for chiranjeevi 150th film? | Sakshi
Sakshi News home page

'వారి' సలహాతోనే చిరు సినిమా ఆలస్యం!

Published Sat, Nov 15 2014 12:26 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'వారి' సలహాతోనే చిరు సినిమా ఆలస్యం! - Sakshi

'వారి' సలహాతోనే చిరు సినిమా ఆలస్యం!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహుర్తం దగ్గరపడుతోంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత ఆయన .... తన 150 సినిమా వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ...చిరు 150వ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ  సినిమాపై చిరంజీవి మాత్రం పెదవి విప్పలేదు. ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగినా  ...దర్శకుడి, కథ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా చిరంజీవి 150 సినిమా ఆలస్యం కావటానికి  జ్యోతిష్కుల సలహా అట. ఈ పుకారు  ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.  ఆగస్టు 22న చిరంజీవి తన పుట్టినరోజు సదర్భంగా  నేపాల్లోని పశుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరు...150 సినిమాకు మంచి ముహుర్తం పెట్టాలని నేపాల్ జ్యోతిష్కులను కోరారట. అయితే అందుకు కొంతకాలం ఆగాలని, అక్టోబర్, నవంబర్ మాసాల్లో శివారాధనలో గడపాలని సూచించారట.

కార్తీక మాసం అనంతరం సినిమా ప్రకటనకు మంచిదని సూచించారట. అలాగే జ్యోతిష్కుల వాస్తు సలహా మేరకు చిరంజీవి ఇటీవల తన నివాసానికి భారీగా మార్పులు, చేర్పులు చేయించిన విషయం తెలిసిందే. దాంతో చిరంజీవి తన 150 సినిమాను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement