
Astrologer Suggested To Allu Arjun As Per His Astrology: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. గతేడాది డిసెంబర్ 17న రిలీజైన ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇదిలా ఉంటే ఎక్కడ చూసిన పుష్ప మేనియానే కనిపిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్‌ను సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకులకు వరకు ఈ డైలాగ్‌ను వాడేస్తున్నారు.
చదవండి: ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్
ఇక ఈ చిత్రంలోని పాటకలు వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు. శ్రీవల్లి, సామీ సామీ పాటలు క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఇదే జోష్‌తో త్వరలోనే పుష్ప పార్ట్ 2ను మొదలపెట్టాలని చూస్తున్నాడు బన్నీ. అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అదృష్టం ఉన్న సమయం కూడా కలిసి రావాలి. అదే సమయం కలిసి రాకపోతే ఎలాంటి సమస్యలైన తలెత్తే అవకాశం ఉంది. సడెన్‌గా కెరీర్‌కు బ్రేక్‌లు పడటం, చేసే ప్రతి పనిలో అవాంతరాలు ఎదురవుతుంటాయి. అందుకే అలాంటివి జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు మన సినీ, రాజకీయ ప్రముఖులు.
చదవండి: 60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు
ఇక తాజా పాన్ ఇండియా స్టార్ హోదాను పొందిన అల్లు అర్జున్‌కు భవిష్యత్తులో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్‌లు రావాలంటే ఆయన కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు చేయాలని ప్రముఖ జ్యోతీష్య పండితులు సూచిస్తున్నారట. పుష్ప పార్ట్ 2 షూటింగ్ నేపథ్యంలో ఆయన ఫేమస్ జ్యోతీష్యలు వద్ద జాతకం చూపించినట్లు తెలుస్తోంది. బన్నీ జాతకం చూసిన పండితులు ఆయన జీవితం, సినీ కెరీర్ సాఫీగా సాగాలంటే కుటుంబంతో కలిసి పూజ, హోమాలు చేయాలని సూచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి సూచన మేరకు బన్నీ త్వరలోనే కుటుంబంతో కలిసి తన ఫామ్‌హౌజ్‌లో పూజలు, హోమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment